మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం హుండీలను కార్యనిర్వహణాధికారి ఎస్. మహేష్ ఆధ్వర్యంలో టి.సాయిబాబ పర్యవేక్షణలో లెక్కించారు. సదరు హుండీలలో 76 రోజులకు గాను 22,78,554/-రూపాయల ఆదాయం వచ్చినట్లు వారు ఒకప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్. ప్రసాద్, దేవస్థానం సిబ్బంది శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి కామారెడ్డి సభ్యులు 75 మంది, శ్రీ ముక్తేశ్వర సేవా సమితి రాగినేడు సభ్యులు 13 మంది శ్రీ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు హైదరాబాద్ వారు మరియు దేవస్థానం అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.