Friday, November 22, 2024
HomeదైవంSrinagar: శారదా యాత్రకు సిద్ధం కండి, ప్రారంభమైన శారదా పీఠం

Srinagar: శారదా యాత్రకు సిద్ధం కండి, ప్రారంభమైన శారదా పీఠం

హోంశాఖా మంత్రి అమిత్ షా శారదా పీఠం ప్రారంభించారు.  కర్తార్ పూర్ కారిడార్ తరహాలోనే శారదా కారిడార్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా వెల్లడించారు. ఎల్ఓసీ వద్ద 76 ఏళ్ల తరువాత సరస్వతీ దేవికి సంప్రదాయబద్ధంగా పూజలు సాగాయి. కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని కిషన్ గంగా నది ఒడ్డున ఈ శారదా పీఠాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం. కుప్వారా జిల్లాలోని తీత్వాల్ ప్రాంతంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. చైత్ర నవరాత్రుల సందర్భంగా ఉగాది రోజు ఈ ఆలయాన్ని పునఃప్రారంభించటం విశేషం. శారదాయాత్ర ఏర్పాట్లు అన్నీ సవ్యంగా చేసేలా కేంద్రం భారీ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసింది, సేవ్ శారదా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పట్టాలెక్కుతున్నాయి. శృంగేరీ పీఠం కూడా ఇందులో భాగస్వామిగా ఉంది.

- Advertisement -

పూర్వం ఇక్కడున్న శారదా పీఠంలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారు. విద్య కేంద్రంగా అలరారిన ఈ ప్రాంతం ఆతరువాత కాలగర్భంలో వివిధ కుట్రలకు బలైపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News