Saturday, September 21, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలం క్యూ కంపార్ట్మెంట్ కోసం 75 కోట్లు

Srisailam: శ్రీశైలం క్యూ కంపార్ట్మెంట్ కోసం 75 కోట్లు

ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 17 వ ట్రస్ట్ బోర్డు సమావేశం

శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 17వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. సుమారు 3 గంటలపాటు సమావేశం కొనసాగింది. అనంతరం ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 19 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా, వాటిలో 18కి ఆమోదం తెలిపి 1 మాత్రం వాయిదా వేశామన్నారు. ఆలయ నూతన క్యూ కంపార్ట్మెంట్ కోసం 75 కోట్లు ఆమోదం తెలిపామని త్వరలోనే టెండర్లకు పిలుస్తామన్నారు.

- Advertisement -

అలానే క్షేత్రంలో పలుచోట్ల ఆగిన ఫ్లోరింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. క్షేత్ర పరిధిలో విద్యుత్ సదుపాయం కోసం 20 లక్షలకు ఆమోదం తెలిపామని, నెల్లూరు రాజ్యసభ సభ్యుడు వేమూరి ప్రభాకర్ రెడ్డి దేవస్థానానికి విరాళంగా ఇవ్వనున్న బంగారు రథానికి 40 లక్షలతో నూతన బిల్డింగ్ ఏర్పాటుకు ఆమోదించమన్నారు. సుండిపెంటలో దేవస్థానం సిబ్బంది గృహాలకు 40 కోట్లు ఆమోదంచినట్టు వెల్లడించారు. ఆలయ క్యూలైన్స్ లో కూడా ఐరన్ తీసేసి స్టీల్ గాని బ్రాస్ గాని ఏర్పాటు చేయాలని బోర్డులో నిర్ణయించినట్టు ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News