Sunday, October 6, 2024
HomeదైవంSrisailam: భాద్రపద పౌర్ణమి ఊయల సేవ

Srisailam: భాద్రపద పౌర్ణమి ఊయల సేవ

పౌర్ణమి, మూలా నక్షత్రం, శుక్రవారం పూట ఊంజల సేవ

శ్రీశైలంలో భాద్రపదశుద్ధ పౌర్ణమి శ్రీస్వామి అమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించారు. ప్రతి శుక్రవారం రోజు, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ నిర్వహించటం ఇక్కడి మల్లన్న ఆలయ సంప్రదాయం. లక్ష కుంకుమార్చన తరువాత ఈ ఊయల సేవ జరుపుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణం సంకల్పాన్ని పఠిస్తారు. అర్చక స్వాములు ఈ సేవా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ అనంతరం ఊయలలో వేంచేసిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ పూర్తిచేస్తారు. తరువాత చివరగా ఊయలసేవ నిర్వహిస్తారు. ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News