Sunday, October 6, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలంలో ధర్మపథంలో భాగంగా భజన

Srisailam: శ్రీశైలంలో ధర్మపథంలో భాగంగా భజన

సంప్రదాయ కళలు పరిరక్షించటంలో భాగంగా..

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) శ్రీ సీతారామాంజనేయ భజన బృందం, నాగర్ కర్నూలు జిల్లా వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమములో ఓం నమ:శివాయ, శివశంకరా నిన్ను, శంకర శివా, పార్వతీతనయా, శివుడే దైవము, పరమేశ్వరీ జగదీశ్వరి తదితర గీతాలకు సిరిజాల రాము, కల్వకోట వెంకటయ్య, యాదిరెడ్డి, పి. బాలస్వామి, బి బాలకృష్ణ, శ్రీశైలమ్మ, వెన్నెలమ్మ, యాదమ్మ, సైదమ్మ, మల్లమ్మ, బాలమ్మ, జమున పద్మావతమ్మ, శ్రీనివాస్ తదితరులు ఆలాపించనున్నారు.
కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News