Friday, September 20, 2024
HomeదైవంSrisailam: గిరి ప్రదక్షిణ

Srisailam: గిరి ప్రదక్షిణ

శ్రీశైలం మహా క్షేత్రంలో పాల్గుణ శుద్ధ పౌర్ణమి ఘడియలు పునస్కరించుకొని శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది.
శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ ప్రత్యేకపూజలు చేశారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్ రోడ్ మీదుగా ఫిల్టర్ బెడ్, సిద్ధి రామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ పూర్తి అవుతుంది.
కాగా శ్రీశైలగిరిప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగములో శ్రీరాముడు త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలైన ద్వారక్షేత్రాల గుండా ఈ గిరి ప్రదక్షిణ చేసినట్టు శ్రీశైల ఖండం చెబుతోంది.
శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, క్షేత్రాన్నిఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News