Friday, November 22, 2024
HomeదైవంSrisailam: శ్రీశైల గిరి ప్రదక్షిణ

Srisailam: శ్రీశైల గిరి ప్రదక్షిణ

పౌర్ణమికి గిరి ప్రదక్షిణ

పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది. ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, గంగా సదనం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వద్దకు చేరుకుంటుంది. బయలు వీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంటుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంటుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్దిని, రుద్రాక్షమఠం, విభూతి మఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంటుంది. రుద్రవనం నుంచి నంది మండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

- Advertisement -

శ్రీశైల క్షేత్రములోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తుల చేత దర్శింప జేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణానంతరం శ్రీ స్వామివార్ల దర్శనం కల్పించబడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News