Sunday, October 6, 2024
HomeదైవంSrisailam: కాణిపాకం వినాయకుడికి శ్రీశైలం దేవస్థానం పట్టువస్త్రాలు

Srisailam: కాణిపాకం వినాయకుడికి శ్రీశైలం దేవస్థానం పట్టువస్త్రాలు

కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున (21.09.2023) పట్టువస్త్రాలు సమర్పించారు. సెప్టెంబరు 18వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 8వ తేదీతో ముగియనున్నాయి.
ఈ మేరకు శ్రీశైలదేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు విజయలక్ష్మీ ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, అర్చక స్వాములు, వేదపండితులు తదితరులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమంలో కాణిపాక దేవస్థానం ధర్మకర్తలి మండలి అధ్యక్షులు ఎ. మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -


ఈ సమర్పణకు ముందుగా కాణిపాక దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎ. వెంకటేష్, సహాయ కార్యనిర్వహణాధికారులు ఎస్.వి. కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, వాసు, అర్చకులు, వేదపండితులు సాదరంగా ఈ దేవస్థాన అధికారులను ఆహ్వానించారు. తరువాత సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, స్వామివారికి పూజాదికాలను జరిపించారు. అనంతరం ఈ దేవస్థానం అధికారులను, అర్చకులను కాణిపాక కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు.
కాగా ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిసంవత్సరం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సమయము ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News