శ్రీశైల మల్లన్న హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.4,04,21,906/-లు నగదు రాబడిగా లభించింది. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (09.05.2024 నుండి
05.06.2024 వరకు) సమర్పించినదే కావడం విశేషం.
అలాగే ఈ హుండీలో 332 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 760 గ్రాముల వెండి లభించాయి. 1768 – యుఎస్ఏ డాలర్లు, 45 – యూఏఈ దిర్హమ్స్, 1– ఖతార్ రియాల్స్, 5 – కెనడా డాలర్స్, 10 – ఈరోస్. 50- యూ.కె. పౌండ్సు, 55- ఆస్ట్రేలియా డాలర్లు, 1- మలేషియా కరెన్సీ, 109 సింగపూరు డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ, పలువురు శాఖాధిపతులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.