శ్రీశైల క్షేత్రంలో గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ వారికి శ్రీశైలం దేవస్థానం మూలా నక్షత్రం పురస్కరించుకొని బోనం సమర్పించింది. కాగా అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులు, ఫల పుష్పాలతో ప్రధాన ఆలయ మహాద్వారం నుండి మంగళ వాయిద్యాలతో సాంప్రదాయబద్ధంగా ఆలయ ఈవో ఎస్ లవన్న ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధికారులు అంకాలమ్మ ఆలయం చేరుకున్నారు. అనంతరం అంకాలమ్మ దేవతకు విశేష పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని అతివృష్టి, అనావృష్టి, అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు నిరోధించబడాలని, రోగకారక పరిస్థితులు రాకుండా జనులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పంతో ఈ బోనాన్ని సమర్పించి విశేషాలు పూజలు నిర్వహించామని ఆలయ ఈవో ఎస్ లవన్న తెలిపారు.