Monday, November 25, 2024
HomeదైవంSrisailam: చంద్రగ్రహణం, ఆలయాల మూసివేత

Srisailam: చంద్రగ్రహణం, ఆలయాల మూసివేత

ఈ నెల 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆరోజు సాయంత్రం గం. 5.00ల నుంచి మరుసటి రోజు అనగా 29వ తేది ఉదయం గం. 5.00ల వరకు శ్రీశైలం ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. 29వ తేది ఉదయం 5.00 గంటలకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం: 7గంటల నుండి దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జితసేవలు ప్రారంభమవుతాయి.
కాగా చంద్రగ్రహణం రోజైన 28వ తేదీన మధ్యాహ్నం గం. 3.30ల వరకు మాత్రమే భక్తులకు సర్వదర్శనం కల్పించబడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం గం. 12.30ల వరకు మాత్రమే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహించబడుతాయి. ఆ రోజున సామూహిక అభిషేకాలు ఉదయం: మాత్రమే నిర్వహించబడుతాయి. అదేవిధంగా స్వామివారి స్పర్శదర్శనానికి రూ.500/-లు టికెట్) ఉదయం మాత్రమే అవకాశం కల్పించబడింది. మధ్యాహ్నం గం. 12.30లకు నిర్వహించబడే సామూహిక అభిషేకాలు, స్పర్శదర్శనం నిలుపుదల
చేయబడ్డాయి. ఇక గ్రహణం రోజున మధ్యాహ్నం గం. 3.30ల నుండి మంగళవాయిద్యాలు, సుసాంధ్యం, సాయంకాల పూజలు, మహామంగళ హారతులు జరిపించబడుతాయి. అనంతరం గం. 5.00లకు ఆలయద్వారాలు మూసివేస్తారు.
గ్రహణం రోజున శ్రీస్వామివార్ల నిత్యకల్యాణం కూడా నిలుపుదల చేస్తున్నారు. గ్రహణం కారణంగా పైన తెలపబడిన విధంగానే ఆలయప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు:
మరియు సాక్షిగణపతి, హారకేశ్వరం – పాలధార పంచధార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా సాయంత్రం గం.5.00ల నుండి మూసివేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News