Friday, September 20, 2024
HomeదైవంSrisailam: శ్రీశైలంలో ఘనంగా యోగ దినోత్సవం

Srisailam: శ్రీశైలంలో ఘనంగా యోగ దినోత్సవం

యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి: అష్టాంగయోగా

శ్రీశైల దేవస్థానం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది. చంద్రవతి కల్యాణమండపంలో ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. యోగసాధనకు పతంజలి మహర్షి ఎనిమిది అంచలు ఏర్పరచాడని, దానిని అష్టాంగయోగాగా పేర్కొంటున్నామని శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్ పేర్కొన్నారు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి అనే ఎనిమిది అంచలే అష్టాంగ యోగాలుగా ప్రసిద్ధమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక ఆసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు మొదలైనవన్నీ యోగాలోని ప్రధాన క్రియలు అన్నారు.

- Advertisement -


యోగాసనాలు

కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ యోగా శిక్షకులు, యోగాచార్య, గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఒంగోలు వారు ఆయా అంశాలను వివరిస్తూ అందరిచేత యోగాసనాలు చేయించారు. ప్రతి ఆసనానికి కూడా వీరు వివరణ ఇస్తూ, యోగపరమైన అంశాలను ఆధునిక వైద్య
విజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ఆయా విశేషాలను, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నారు. శాంతిమంత్రాలతో ఈ యోగా కార్యక్రమం ముగించారు.


యోగ శిక్షకులందరికీ దేవస్థానం తరుపున శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి, వారిని సత్కరించారు. ఈ యోగా కార్యక్రమములో యోగాచార్య బాలసుబ్రహ్మణ్యంతో పాటు పలువురు సహాయ యోగా శిక్షకులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామివార్ల ప్రధానార్చకులు శివప్రసాద్, స్వామివార్ల ఉపప్రధానార్చకులు ఎం. శివశంకరయ్య, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, జి. మురళీధర్ రెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లు ఎం. హరిదాసు, ఎ.కె. ధనపాల్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ సి) చంద్రశేఖరశాస్త్రి, పర్యవేక్షకులు అయ్యన్న, శ్రీనివాసులు, నాగరాజు పలువురు సిబ్బంది. పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News