Sunday, October 6, 2024
HomeదైవంThimmapur: శివపార్వతుల కల్యాణం

Thimmapur: శివపార్వతుల కల్యాణం

శివరాత్రి సందర్భంగా..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో గంగాభవాని శంకర ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం ఆలయ పూజారి ఉరుముడ్ల కిరణ్ శర్మ ఆధ్వర్యంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. కల్యాణాన్ని తిలకించారు.

- Advertisement -

అనంతరం బీఆర్ఎస్ నాయకులు దావు సంపత్ రెడ్డి, సిరికొండ అంజన్ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ వేడుకల్లో తహసీల్దార్ కోడం కనకయ్య, ఆలయ చైర్మన్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మీసాల అంజయ్య, సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, నాయకులు ప్రణీత్ రెడ్డి, సుగుర్తి జగదీశ్వర చారి, తిరుపతిరెడ్డి, ఆలయ సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News