Thursday, December 12, 2024
HomeదైవంThiruchanuru: ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Thiruchanuru: ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

కార్తీక బ్రహ్మోత్సవాలు..

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏవీఎస్వో వై. సతీష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News