Wednesday, December 4, 2024
HomeAP జిల్లా వార్తలుతిరుపతిTiruchanur | స్వర్ణ రథంపై కటాక్షించిన శ్రీ పద్మావతి అమ్మవారు

Tiruchanur | స్వర్ణ రథంపై కటాక్షించిన శ్రీ పద్మావతి అమ్మవారు

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు స్వర్ణ రథం పై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు మంగ‌ళ‌వారం సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. వజ్ర వైడూర్యాలు, మణి, మాణిక్యాలు రత్నఖచిత స్వర్ణాభరణాలతో సర్వాలంకార భూచితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణ రథం పై ఊరేగింపులో భక్తులకు దర్శనం ఇచ్చారు.

- Advertisement -

భక్తులు తిరుచానూరు (Tiruchanur) మాడవీధుల్లో బారులు తీరి మంగళ హారతులు పలుకుతూ మొక్కలు తీర్చుకున్నారు. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌ సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు. ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో వీరబ్రహ్మం, ఎస్ ఇ- 3 జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, తదితర టిటిడి (TTD) అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News