Friday, July 5, 2024
HomeదైవంUrukunda: ఉరుకుంద క్షేత్రం భక్తజన సాగరం

Urukunda: ఉరుకుంద క్షేత్రం భక్తజన సాగరం

రెండో శ్రావణ సోమవారం సందడి

జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి (నరసింహ స్వామి) క్షేత్రంలో శ్రావణ సందడి నెలకొంది.. స్వామి ఉత్సవాలలో భాగంగా శ్రావణమాసం రెండవ సోమవారం భక్తుల రద్దీ నెలకొంది.. ఉరుకుంద క్షేత్రం భక్తజన సాగరంగా మారింది… ఎన్నడూ లేని విధంగా రెండవ సోమవారం లక్షల్లో భక్తులు తరలివచ్చారు.

- Advertisement -

ఆదివారం రాత్రి నుండే భక్తులు తరలివచ్చారు.. స్వామి విశిష్టవారాన్ని పురస్కరించుకొని స్వామికి ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, దీపారాధన, మహా మంగళారతి వంటి పూజలను శాస్త్రపరంగా నిర్వహించారు.. తుంగభద్ర దిగువ కాలువలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు, పిండివంటలతో స్వామికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు..

ఆంధ్ర నుండే కాక, తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనం కోసం తరలివచ్చారు..దీంతో ఆదోని, కౌతాళం , కోసిగి రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి… స్వామి దర్శనానికి దాదాపు నాలుగు గంటలపైగా సమయం పట్టింది.. క్యూలైన్లు అన్నింటిలోనూ భక్తులు పోటెత్తారు…

ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ నాగరాజు గౌడ్, ఆలయ ఈవో వాణి, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు… ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసిగి సీఐ ఎరిషావలి ఆధ్వర్యంలో, కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. భక్తుల సౌకర్యార్థం ఆంధ్ర కర్ణాటక ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News