Sunday, June 16, 2024
HomeదైవంValigonda: మత్స్యాద్రిలో ఘనంగా నృసింహస్వామి జయంతి

Valigonda: మత్స్యాద్రిలో ఘనంగా నృసింహస్వామి జయంతి

మత్స్యగిరిలో భక్తుల సందడి

మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల అతి పురాతనమైన ఎంతో మహిమాన్వితమైన చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ మత్స్యగిరి క్షేత్రం. ఈ క్షేతంలో శ్రీ నృసింహ జయంతి సందర్భంగా దేవస్థానంలో స్వయంభూ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి కి 108 కళాశాలతో పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, అలాగే అంగరంగ వైభవంగా శ్రీ భూ, సమేత లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణోత్సవం, ఆ తరువాత భక్తజన సందోహముతో శ్రీ మత్స్యగిరి స్వయంభూ స్వామివారికి లక్ష పుష్పార్చన,అశేష భక్తవాహిని తో భజనలతో, స్వామివారి నామ సంకీర్తనలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పల్లకీ సేవ జరిగింది.

- Advertisement -

శివానందలహరి భక్తబృందం (తొర్రూరు) వారిచే సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం శ్రీ నృసింహ స్వామి స్తోత్ర పారాయణాదులు చేశారు. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది. మోహన్ బాబు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News