ఈ నెల 25 నుండి 27 వరకు వేములవాడ రాజన్న ఆలయంలో 23 నుండి 28 వరకు నిర్వహించే మహా శివరాత్రి జాతర విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ కమిటీని నియామకం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం 29 మందితో కూడిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని, బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఈఓ కె వినోద్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో జాతరకు విచ్చేయు భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అనుముల చంద్రం, వడ్డేపల్లి వెంకటరమణ, కే.రాజిరెడ్డి, సి.విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మీ, కూరగాయల కొమురయ్య, సంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూము సంతోష్, వకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగ స్వామి, జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపటి రామస్వామి ,కాయతి నాగరాజు, తొట్ల అంజయ్య, ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ధర్న మల్లేశం ,ఒలిమినేని నిత్యానందరావు, గొట్టే ప్రభాకర్, బుస్సా దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సుగూరి లక్ష్మి , తోట లహరి పాల్గొన్నారు.
