Sunday, November 16, 2025
HomeదైవంVenus Transit 2025: మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు తిరుగులేని విజయం..

Venus Transit 2025: మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు తిరుగులేని విజయం..

Shukra Transit in Mrigashira Nakshatra: జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహంగా పరిగణిస్తారు. లవ్, రొమాన్స్, ఐశ్వర్యానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఆదివారం, జూలై 20న శుక్ర గ్రహం కృత్తిక నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనుంది. పైగా ఈ నక్షత్రానికి అధిపతిగా కుజుడును భావిస్తారు. మృగశిర నక్షత్రంలో శుక్రుడు సంచారం వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

కర్కాటక రాశి
మృగశిర నక్షత్రంలో శుక్రుడు గోచారం కర్కాటక రాశి వ్యక్తులకు సానుకూలంగా ఉంటుంది. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు అధికంగా లాభాలను ఇస్తాయి. ప్రేమికుల ప్రేమ ఫలిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మంచి గా ఉంటాయి. మీ కృషికి ప్రశంసలు లబిస్తాయి. మీ కోరికలన్నీ ఫలిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

తులా రాశి
శుక్రుడు నక్షత్ర మార్పు వల్ల తులారాశి వారిని అనుకొని అదృష్టం వరించనుంది. శుభవార్తలు వింటారు. మీకు ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. మీ లైఫ్ లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని పొందుతారు. కోల్పోయిన అవకాశాలను తిరిగి పొందుతారు.

మిథున రాశి
శుక్రుని నక్షత్ర మార్పు మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.. మీరు స్థిర చరాస్తులు భారీగా కొనుగోలు చేస్తారు. పెద్ద మెుత్తంలో డబ్బు ఇంటికి వచ్చి చేరుతుంది. మీరు వేసే ఫ్లాన్స్ ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగిపోతాయి. జీవితంలో మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఊహించని లాభాలను ఇస్తాయి. ప్రతి పనిలో అదృష్టం మిమ్మల్నే వరిస్తుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad