ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు స్వామివారి భక్తులు వేలాది మంది. ఆలయానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.