Pitru Dosham Effect in Telugu: మన పూర్వీకులు తెలిసి లేదా తెలియకుండానే తమ జీవితాల్లో తప్పులు లేదా పాపాలు చేసి మరణించినప్పడు అది మన జాతకంలో పితృ దోషంగా చుట్టుకుంటుంది. ఇది పూర్వీకులు ఇచ్చిన శాపం కాదు, మన కర్మ రుణం. వారి చేసిన కర్మల యెుక్క దుష్ర్పభావాలను వారి పిల్లలుగా మనం అనుభవించాల్సి వస్తుంది. అంతేకాకుండా పూర్వీకుల చనిపోయిన తర్వాత వారికి సరిగా శ్రాద్ధకర్మలు నిర్వహించకపోయిన పితృదోషం వెంటాడుతోంది. చేసిన తప్పులు తక్కువగా ఉంటే పితృదోష ప్రభావం కూడా తక్కుగానే ఉంటుంది. పితృ దోష నివారణ చేయకపోతే అది మన తర తరాలను వెంటాడుతోంది. దీని వల్ల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదురు చూడాల్సిరావచ్చు. అనేక కష్ట నష్ఠాలను అనుభవించాల్సి ఉంటుంది.
పితృ దోషం అనేది మూడు నుండి ఏడు తరాల వారిని ప్రభావితం చేస్తుందని గరుడ పురాణం చెబుతోంది. మన ముత్తాతలు, తాతలు, తల్లిదండ్రులు మరణించిన తర్వాత శాస్త్రోక్తంగా పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి, లేకపోతే పితృ దోషం పెరిగి మరిన్ని కష్టాలను చూడాల్సి రావచ్చు. పితృ దోషం ఉన్నవారికి వివాహ సమస్యలు, వ్యాపార నష్టం, ఆరోగ్య క్షీణత, వంద్యత్వం వంటి సమస్యలు ఎదుర్కోంటారు. ఆస్ట్రాలజీ ప్రకారం, పక్షం రోజులపాటు వారికి తగిన కర్మ ఆచారాలను చేయడం ద్వారా మనం ఆ దోషాన్ని నుండి విముక్తి పొందవచ్చు. సరైన పద్దతిలో శ్రాద్ధం, పిండదానం, తర్పణం చేయాలి. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలగడంతోపాటు వారి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి.
Also Read: Mahalaya Amavasya 2025 -మహాలయ అమావాస్య ఎప్పుడు? దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈ సంవత్సరం పితృ పక్షం 7 సెప్టెంబర్ 2025 మెుదలై.. 21 సెప్టెంబర్ 2025 ముగియనుంది. పూర్వీకులను స్మరించుకోవడానికి మరియు గౌరవించడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో పూర్వీకులకు పిండం పెట్టడం, శ్రాద్ధకర్మలు చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేయడం వల్ల వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఈ పితృపక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది చంద్రగ్రహణంతో మెుదలయి.. సూర్యగ్రహణంతో ముగియనుంది. దాదాపు శతాబ్ద కాలం తర్వాత ఈ అరుదైన సంఘటన జరగబోతుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను రూపొందించాం. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


