Sarva Pitru Amavasya 2025 Date and Time:సెప్టెంబరు 07 నుంచి పితృపక్షం ప్రారంభం కానుంది. ఈ సమయంలో పూర్వీకులకు చేసే శ్రాద్ధ కర్మల ఫలాలు ఏడాది పొడవునా మీపై ఉంటాయి. ఈ పితృ పక్షం అశ్వినీ మాసం కృష్ణపక్షంలోని అమావాస్య రోజున ముగుస్తుంది. దీనినే సర్వ పితృ అమావాస్య అని పిలుస్తారు. పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరడం కోసం పితృపక్షం పదిహేను రోజుల శ్రాద్ధ కర్మలు, తర్పణం, దానం వంటివి చేస్తారు. దీంతో వారి ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంటాయి. అయితే ఈ ఏడాది సర్వ పితృ అమావాస్య ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
సర్వ పితృ అమావాస్య శ్రాద్ధ సమయం?
సర్వ పితృ అమావాస్య సెప్టెంబరు 21న రాబోతుంది. ఇదే రోజు పితృపక్షం ముగియబోతుంది. మధ్యాహ్నా వేళలో పూర్వీకులకు తర్పణాలు వదలడం శుభప్రదంగా భావిస్తారు. మధ్యాహ్నం 01:27 గంటల నుంచి 03:53 వరకు మంచి సమయం ఉంది.
సర్వ పితృ అమావాస్య ఎందుకు ప్రత్యేకం?
అమావాస్య అనేది పితృ పక్ష చివరి రోజు. ఈ రోజున పూర్వీకులు భూమ్మీదకు తిరగొస్తారని నమ్ముతారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడంతోపాటు దానధర్మాలు కూడా చేయాలి. ఈరోజున వారి ఆత్మలకు శాంతి చేకూరాలని శ్రాద్ధ కర్మలు చేయాలి.పూర్ణిమ తిథి నాడు మరణించిన వారికి అమావాస్య తిథి నాడు మహాలయ శ్రాద్ధం కూడా చేస్తారు.
Also Read: Chaturgrahi Yoga 2025 -50 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో 4 గ్రహాల కలయిక.. ఈ 3 రాశులకు అదృష్టమే ఇక..
తర్పణం ఎలా చేయాలి?
సూర్యోదయానికి ముందే లేచి ఏదైనా పవిత్ర నదిలో లేదా ఇంట్లో గంగా జలం కలిపి నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఒక కుండలో నీరు తీసుకొని అందులో నల్ల నువ్వులు, బార్లీ మరియు కుశ కలపండి. అనంతరం దక్షిణ దిశ వైపు కూర్చోండి. “ఓం పితృభ్యః స్వధా” అనే మంత్రాన్ని జపిస్తూ పూర్వీకులను నీటిని సమర్పించండి. ఆ తర్వాత పూర్వీకులకు నైవేద్యం పెట్టండి. చివరిగా బ్రాహ్మణులకు లేదా పేదవారికి మీ శక్తి కొలదీ దానం చేయండి.
Also Read: Budh Gochar 2025-సెప్టెంబరులో సుడి తిరగబోతున్న రాశులు ఇవే..!


