Navratri 2025 Fasting and Food rules in Telugu: దేశవ్యాప్తంగా భక్తులు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. భక్తులు ఉపవాసం ఉంటూ దేవీనవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారి యెుక్క 9 రూపాలను పూజిస్తారు. సెప్టెంబరు 22న మెుదలైన శరన్నవరాత్రులు అక్టోబర్ 2, దసరాతో ముగుస్తాయి.
ఈ నవరాత్రులను తెలుగు రాష్ట్రాలతోపాటు మైసూర్, బెంగాల్ వంటి ప్రదేశాల్లో అత్యంత వైభవంగా జరుపుతారు. సాధారణంగా ఫాస్టింగ్ చేస్తూ స్వాతిక ఆహారాన్ని తింటూ నవరాత్రులను భక్తులు జరుపుకుంటారు. కానీ ఓ రాష్ట్రంలోని భక్తులు మాత్రం ఈ పర్వదినాల్లో సాత్విక ఆహారానికి బదులు తామసిక ఆహారం తీసుకుంటారు. అదేనండీ చేపలు, మాంసం వంటి వాటితో వండిన వంటకాలను తింటారు. ఈ విచిత్ర ఆచారం మనదేశంలో ఎక్కడో తెలుసా?
చేపలు, మాంసంతో నైవేద్యం
పశ్చిమ బెంగాల్‌లో దుర్గాదేవీ నవరాత్రులు చాలా బాగా జరుపుతారు. ఇక్కడ ప్రజలు అమ్మవారిని తమ కుమార్తెగా భావించి ఈ ఉత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారికి పులిహోర, పాయసం వంటి వాటిని నైవేద్యంగా పెడతాం. కానీ బెంగాలీలు దానికి విరుద్దంగా ఆ దుర్గామాతకు చేపలు, మాంసంతో చేసిన ప్రత్యేక వంటకాలను ఆ దేవతకు భోగంగా సమర్పిస్తారు. దుర్గాదేవి ఉగ్రరూపాన్ని శాంతిపజేయడానికి శాక్త సంప్రదాయాన్ని అనుసరించి ఇలాంటి ఆహారాన్ని పెడతారు.
Also read: chaturgrahi yogam- తులారాశిలో శక్తివంతమైన యోగం.. దీపావళి తర్వాత అదృష్టమంటే వీరిదే..
మరోవైపు, దేశంలో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలను వైష్ణవ మరియు సాత్విక సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటారు. అయితే వీరు దేవీనవరాత్రుల తొమ్మిది రోజులు ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా మాంసాహార ఆహారాన్ని తినరు. మన ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో కూడా నాన్ వెజ్ తినరు. ఇలా విభిన్న ప్రాంతాల్లో ఒక్కో ఆచారాన్ని పాటించడం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన వార్త పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. పండితుల అభిప్రాయాలు, ఇంటర్నెట్ సమాచారంను పరిగణనలోకి తీసుకుని ఈ కథనాన్ని రూపొందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించలేదు.


