యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు నిత్యారాధనల అనంతరం అగ్ని ప్రతిష్ట, ద్వజారోహణం కార్యక్రమాల జరిగాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా యజ్ఞాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లదీంగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, అర్చక బృందం నేతృత్వంలో ధ్వజారోహణము అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి , కార్యనిర్వహణాధికారి ఎన్. గీత, ఆలయ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ద్వజారోహణం
వేద స్వరూపుడైన గరుత్మంతుని చిత్రమును తెల్లని వస్త్రంపై చిత్రించి, మంత్రపూర్వకంగా వేడుకొంటూ ద్వజపటమును ధ్వజస్తంభమునకు అలంకరించి బ్రహ్మోత్సవాలకు సకల దేవ కోటిని, ప్రాణికోటిని వేంచేయమని ఆహ్వానించే వైదిక ప్రక్రియనే ద్వజారోహణం. గరుడాల్వర్ వరకు నివేదించిన ముద్గాన్నాన్ని సంతానం లేని వారు ప్రసాదముగా స్వీకరిస్తే సంతానవంతులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.