Sunday, October 6, 2024
HomeదైవంYadadri: పూర్ణాహుతి, చక్ర తీర్థ స్నానం, పుష్పయాగం, దేవతోద్వాసన

Yadadri: పూర్ణాహుతి, చక్ర తీర్థ స్నానం, పుష్పయాగం, దేవతోద్వాసన

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవరోజు చక్రతీర్థ స్నానం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కొండపైన విష్ణు పుష్కరిలో చక్రతీర్థ స్నానం గావించారు. విష్ణు పుష్కరిణిలోని జలాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో కలుపగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్త జనులు స్నానమాచరించి పులకించిపోయారు. సాయంకాలం ఆలయంలో శ్రీ పుష్పయాగం, దేవతో ద్వాసన, దోపు ఉత్సవాలు నిర్వహించారు. పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, శ్రీ పుష్పయాగం, దేవత ద్వాసన, దోపు ఉత్సవాల విశేషాల ప్రాముఖ్యతను ప్రధాన అర్చకులు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News