భారతదేశంలోని దాదాపు సగానికి పైగా రాష్ట్రాలలో బంజారా భాషను మాట్లాడుతున్న బంజారాలు వారిని వివిధ పేర్లతో పిలిచినప్పటికీ ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సాంప్రదాయం కలిగి ఉన్న బంజారాలు ఆరాధించే దైవం సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని పురస్కరించుకొని సేవాలాల్ మహారాజ్ ఆరోజు బంజారాలకు ఊరు, వాడా తిరుగుతూ వారిని చైతన్యం పరిచినప్పుడు చేసినటువంటి ప్రబోధాలను ఒకసారి పరిశీలిద్దాం.
భోగ్ బండార్ ప్రోగ్రామ్స్
సేవాలాల్ మహారాజ్ హిందూ సంస్కృతికి దగ్గరతో సంబంధాలు ఉండే భోగ్ బండార్ కార్యక్రమాలను నిర్వహిస్తూ బంజారా జాతిలో నెలకొని ఉన్నటువంటి దురాచారాలను, అశాస్త్రీయమైన అపోహలను నమ్ముతూ జీవిస్తున్నటువంటి బంజారా జాతులను తన వంతు చైతన్యం చేసే పాత్రను నిర్వహిస్తూ జాతిపై జరిగే దాడులతో జాతిని రక్షించిన జాతి ఉద్ధారకుడు సేవలాల్ మహరాజ్. గత కొన్ని సంవత్సరాలుగా బంజారా నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి లోకం AIBSS, TEGA బంజారా సంఘాలు, గిరిజన విద్యార్థి సంఘాలు పలు పోరాటాల ఫలితంగా నేడు సేవాలాల్ మహారాజ్ జయంతి గల్లి నుంచి ఢిల్లీ దాటి ప్రపంచంలో ఉండే అనేక దేశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడం బంజారాల అభివృద్ధికి ఒక చిహ్నంగా చెప్పొచ్చు. అయితే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బంజారా సంఘాలు తమ యొక్క డిమాండ్ ను నెరవేర్చుకోవడంలో కొంత సఫలమైనప్పటికీ ఇంకా వాటి యొక్క డిమాండ్ పూర్తిగా నెరవేరలేదు.
తండాలను గ్రామ పంచాయతీలుగా..
బంజారాలలో డిమాండ్ ని తండాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని డిమాండ్ ను బారాస నెరవేర్చినప్పటికీ, గత కొన్ని సంవత్సరాల నుంచి బంజారాలు తమ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వo ప్రభుత్వ సులువుగా దినం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రావడం మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని పార్టీలు కూడా బంజారాల ఆరాధ్య ధైవని గౌరవిస్తూ సెలవు ఇవ్వాలని అనేక మీటింగ్లో పేర్కొనడం జరిగింది. కానీ ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తి సెలవు దినం కాకుండా ప్రకటించడం జరిగింది. అది కొంతమందికి ఊరట కలిగిస్తుందేమో గానీ పూర్తిగా డిమాండ్ నెరవేరినట్లు మాత్రం కాదు. మరొక డిమాండ్ సేవాలాల్ మహారాజ్ జయంతి నాడు అనేక మంత్రులు తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, తండాకు కోట్లు రూపాయలు కేటాయిస్తామని చెప్పినప్పటికీ అది ఇంతవరకు సాధ్యం కాలేదు. తండాల గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం చేస్తే అది పేరుకు మాత్రమే కానీ ప్రత్యేకమైన నిధులు ఇచ్చి వాటిని ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సర్పంచ్ లాంటి ఒక పదవి కనిపిస్తుంది, రాజకీయ భాగస్వామ్యం పెరిగినట్టు కనిపించింది, కానీ ఈ పదవిని చేపట్టడానికి బంజారాలో తమ భూములను నమ్ముకుని ఎలక్షన్ లో పెట్టుబడి పెట్టడం జరిగింది. పదవి కోసం ఒకే భాషను మాట్లాడి ఒకే సంస్కృతిని కలిగిన బంజారాలకు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అది ఒక కలలాగానే మిగిలిపోయింది. అదే విధంగా బంజారా సంస్కృతి చాటేటట్టు ప్రభుత్వం గుర్తించినటువంటి ఎలాంటి చిహ్నాలపైన కనిపించకపోవడం బాధాకరమైనది, ప్రభుత్వం ముద్రించే కరెన్సీ నోట్లపైన కూడా బంజారాల గుర్తింపు లేదు. కనీసం వారి సంస్కృతి చాటే పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయలేదు, ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుని సోమ్లా నాయక్ గారికి భగవద్గీతను తెలుగు భాషను ఉపయోగిస్తూ బంజారా భాషలో రాయడం జరిగింది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించడం ద్వారా కొంత ఆదరణ పొంది కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ ఇవ్వడం ద్వారా దేశంలోనే పద్మశ్రీ అందుకున్న బంజారా నాయకుడు రెండో వ్యక్తిగా సోమ్లా నాయక్ చరిత్రకి ఎక్కారు. బంజారాలు చేసే తీజ్ ఫెస్టివల్ని ఇంతవరకు భూములమ్ముకోవడం అప్పులు తీసుకొని ఎలక్షన్లో ఖర్చు చేయడం తదితర కారణాలవల్ల భూమిపైన హక్కును కోల్పోవడం పెట్టుకున్న పెట్టుబడి రాకపోవడం రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దేశంలో నివసించే సుమారు 15 రాష్ట్రాల నుంచి 15 కోట్ల మంది జనాభా ప్రభుత్వం ఒక ఆదరణ నోచుకోలేదు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఈ పండగను రకరకాల పేర్లతో జరుపుకోవడం జరుగుతుంది. ఇది బంజారా మహిళలకు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునే గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది. దీనిని కూడా రాబోయే తరంలో బంజారా సోదరులు ఒక బలమైన డిమాండ్ ను ముందు పెడుతున్నారు. దీనిని కూడా గుర్తిస్తే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్యన తెలుగు రాష్ట్రాలలో సేవాలాల్ మహారాజ్ జయంతి అనేది ఒక ఉత్సాహ పండుగలాగా మారిపోయి, ప్రతి మారుమూల తండా గ్రామాలు పట్టణం తేడా లేకుండా ఎక్కడికి అక్కడ ఈ ఫిబ్రవరి నెలలో రెండు వారాలు ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోవడం జరుగుతుంది. దీనిని ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలలో మలుచుకోకుండా నిజమైన వారి ఐక్యతను చాటుతున్న సందర్భంలో వారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ముందుండి అధికార కార్యక్రమాలు నిర్వహించాలి.
సోషల్ మీడియాలో బంజారా ఉద్యమాలు..
సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని బంజారా జాతి అభివృద్ధి కోసం నేడు బంజారలే స్వయంగా పత్రికా రంగంలోనూ, మీడియా రంగంలోనూ, సోషల్ మీడియా పుణ్యాన వారి యొక్క ఆలోచన విధానాన్ని పంచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. నేడు బంజారాలు స్వయంగా 3టీవీ వాయిస్ బంజారా థోరి బంజారా వంటి రకరకాల సోషల్ మీడియా వేదిక ద్వారా సొంత యూట్యూబ్ ఛానల్ లతో, ధర్మనాయక్ ఆధ్వర్యంలో గిరిజన సాంస్కృతిక పత్రిక డిజిటల్ ఫామ్ లో నడవడం అంటే ఒకప్పుడు లిఖితపూర్వకంగా లేని కేవలం మౌఖిక సాహిత్యాన్ని భావాలను వ్యక్తపరిచే అవకాశం నుంచి ఒక లిఖితపూర్వకంగా సమాజాన్ని చాటుకునేలా అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నేడు బంజారాల దినస్థితి భూమి పైన హక్కును కోల్పోవడం, వలసలు పెరిగిపోవడం విద్యా, ఉపాధి అవకాశాల కోసం తమ ఆస్తులను తకట్టు పెట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచనతో తమ ఆధీనంలో ఉన్న ఆస్తిని కూడా అమ్మేస్తున్నారు, ముఖ్యంగా వైద్యం పేరిట అవగాహన లేక పేదరికంలోకి జారిపోతున్నారు. ఇప్పటికీ ఇంకా మంచి విద్యావంతుడై ఉండి కూడా ఒక మగ పిల్లాడే పుట్టాలని ఒక రకమైనటువంటి వారసత్వ భావాలు కలిగి ఉండాలని బలమైన భావజాలం నాటుకోని ఉండడం బాధాకరం. కొంత మార్పు వచ్చినా ఇంకా రావలసింది చాలావుంది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, నేపథ్యంలో మార్కెట్లో జరిగే ఒడిదుడుకులను బంజారాలు సరిగా అర్థం చేసుకోక తక్కువ రేటుతో తమ భూములను ఆశ చూసి భూములను అమ్మేశారు. లక్ష రూపాయలకు అమ్మినటువంటి భూమి తక్కువ కాలంలోనే కోట్ల రూపాయలలో పలకడం ద్వారా తమ ముందల తమ భూమిని కోల్పోయామని అశాంతి పెరుగుతోంది. ఇది వలసలకు కారణం అవుతున్నది.
కాంగ్రెస్-బంజారా బంధం
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సెలవు దినాలలో ముస్లిం సోదరులకు అదనంగా రెండు రోజులు, సిక్కుల గురునానక్ జయంతి సందర్భంగా ఒకరోజు కేటాయించడం కానీ ఆనాటి ప్రభుత్వము ఎన్నో రోజుల నుంచి గిరిజనులు అడుగుతున్న సెలవు రోజును ఇవ్వలేకపోయింది. ఆత్మగౌరవాన్నే ప్రధానంగా నమ్ముకునేటువంటి పేరులోనే నాయక్ అనే పదాన్ని తగిలించుకున్న బంజారా జాతి ఒక విషయాన్ని తలుచుకుంటే దాన్ని సాధించే వరకు ఉండదు అందుకే 10% రిజర్వేషన్ ఇచ్చిన టిఆర్ఎస్, మంత్రి పదవి ఇచ్చిన, తండాలను గ్రామపంచాయతీ ఇచ్చిన, సేవాలాల్ మహారాజ్ కి ఒక రకమైన గుర్తింపు తెచ్చిన టిఆర్ఎస్ చాలా మంది మొదటి తరం నాయకులను ప్రోత్సహించి ముందుకు తీసుకువచ్చిన టిఆర్ఎస్ పార్టీని కాదని ఈరోజు బంజారాలు కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపారో ఒకసారి ఆలోచించాలి. సాధారణంగా బంజారాలు ఇందిరా గాంధీ 1977 నుండి లంబాడీలను ప్రత్యేకంగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేసినందుకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు. కాంగ్రెస్ అంటే బంజారా, బంజారా అంటే కాంగ్రెస్ దానిని తిప్పి కొట్టడానికి కేసీఆర్ అనేక రకమైన పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ వాళ్లు చెప్పేటువంటి లెక్కల ప్రకారం మేధాన ప్రాంతలో 42 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఓటు వేసి బంజారాలను గెలిపించారు అని. ఇందులో ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉండడం కూడా ఒక విశేషమని బంజారా నాయకులు పేర్కొంటున్నారు.
బంజారాలు బీజేపీ వైపు మళ్లితే
పోస్ట్ పోల్ సర్వే ద్వారా కూడా బంజారాలు అధిక శాతం కాంగ్రెస్ కు ఓటు వేశారని తేటతెల్లమవుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విషయంలో బంజారాలు కొంత సందిగ్ధంలో పడుతున్నారు. తమ ప్రాతినిథ్యం క్యాబినెట్లో లేదని సరైన ప్రాతినిధ్యం లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బంజారాలను విడిచిపోయి హిందూ సంస్కృతికి దగ్గరగా వ్యవహరిస్తున్న బిజెపి పార్టీ వైపుకి కనుక మళ్ళితే గిరిజనుల పరిస్థితి ఎలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ జరగాలి, కాబట్టి తరతరాలు కాంగ్రెస్ పార్టీని మోసుకొచ్చిన గిరిజనులకు సరైన ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చి బలమైన ఓటు బ్యాంకు దాని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పైనే ఉంటుంది. ఈ దిశగా నమ్ముకున్న గిరిజనులకు భూమిపైన హక్కు కల్పించాలి ITDA tribal ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది పోడు భూముల పైన పట్టాలను కల్పించి అడవి ప్రాంతంలో నివసించే బంజారాలకు మంచి విద్య, వైద్యాన్ని అందించి తమకు విధేయత చూపిన బంజారాలను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. బంజారాలలో అత్యధికంగా చాలామంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల వైపుకు మొగ్గు చూపుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం ద్వారా చిన్నచిన్న ఉద్యోగాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సమయానికి భర్తీ చేస్తేనే బంజారా యువకులకు కాంగ్రెస్ పార్టీ కాపాడుకున్నట్టు అవుతుంది. నైపుణ్యం లేకపోవడం ద్వారా బంజారా యువకులు ఫంక్షన్ హాల్ కే పరిమితం కావడం క్యాటరింగ్ సిస్టం అలవాటు పడడం, ఉన్నత ఎడ్యుకేషన్ అందుకోకపోవడం, తక్షణ అవసరాల పైన దృష్టి పెట్టడం ఈ మధ్య మద్యం స్వీకరించే వాళ్ళ సంఖ్య పెరగడం చిన్న ఏజ్ లో తాగి చనిపోవడం ద్వారా ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతా ఉంది. ఇది ఒక సామాజిక రుగ్మత, అదేవిధంగా కట్న కానుకల పేరిట ఎక్కువ కట్నం ఆశతో ఇచ్చే సంప్రదాయాన్ని నెలకొనడం ద్వారా ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఏర్పడుతుంది. ఇది భృణ హత్యను దారి తీస్తుంది ఇది ఒక నేరం. మహిళల్లో విద్య శాతం తక్కువగా ఉండడం, పేదరికం పెంచేపోషించే స్థాయిలో లేకపోవడం, మగ పిల్లల మీద ఎక్కువ ప్రేమ లాంటి కొన్ని సామాజిక కారణాల రీత్యా కొన్ని రుగ్మతలు ఇప్పటికి కొనసాగుతా ఉన్నాయి. ఇది ఒక రకమైన బాధాకరం ప్రభుత్వం దీనిపైన అవగాహన కార్యక్రమాలను కల్పించాలి. ఈ మధ్యకాలంలో గ్రామాల నుండి పట్టణాలకు వలస రావడం మూలంగా ఎక్కువ మంది ఆటో కార్మికులే ఆటో నడిపే వాళ్ళే బంజారా వాళ్లే ఉండడం ఫ్రీ బస్సు వల్ల బంజారా ఆటో డ్రైవర్ల పైన కొంత ప్రభావాన్ని చూపించి కొంత వాళ్ళ ఆదాయాన్ని గండి కొట్టినట్టు అవుతుంది. కాకపోతే నైపుణ్యం కలిగినటువంటి యువతకు కనుక అవకాశం ఇస్తే టిఫిన్ సెంటర్ లాంటివి ప్రోత్సహించి కొంత బ్యాంకు లోన్లు ఇప్పిస్తే వాళ్లకి ఉన్న టాలెంట్ తోటి పది మందికి సాయం చేసే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ వలస కార్మికుల పట్ల స్వయం ఉపాధి పొందే బంజారాల పట్ల ఎలాంటి విధానం లేకపోవడం వల్ల ప్రైవేట్ ఫైనాన్స్ మీద ఆధారపడి తమ యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు ఇది బాధాకరం. భర్తతో పాటు భార్య ఉపాధి కూడా బంజారాలలో ఎక్కువ కనిపిస్తా ఉంది వీధి వ్యాపారాలు ఈ మధ్యన కొత్తగా వెలిసినటువంటి జొన్న రొట్టెల వ్యాపారం కొంత వరకు వాళ్లకు ఉపశమన కల్పించిన ప్రభుత్వం కనుక సాయం చేసినట్లయితే ఇది ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడతా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు సేవాలాల్ మహారాజ్ పేర్కొన్నట్టు సామాజిక రుగ్మతలను రూపుమాపి మంచి విద్యా అవకాశాలను కల్పించి ఆరోగ్య సౌకరియాలను మెరుగుపరిస్తే బంజారాల జీవితాలలో వెలుగు నింపిన వాళ్లమవుతాం, మద్యం అలవాటు నుంచి రూపుమాపడానికి ప్రభుత్వం కొన్ని గట్టి చర్యలు చేయకపోతే ఈ జాతి పైన కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది పెళ్లిళ్లు పేరంటాల పేరిట విపరీతమైన ధనాన్ని ఖర్చు పెట్టడం ఎక్కువ పాటుపడడం ద్వారా భూమి పైన హక్కును కోల్పోతున్నారు ఓనర్లు ఉండి కార్మికులుగా మారిపోయిన బంజారా లు కనిపిస్తా ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి బాధాకరం కాబట్టి త్వరలోనే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా ప్రముఖులతో నాయకులతో మేధావులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశం గర్వించే లాగా కర్ణాటక, మహారాష్ట్రలలో బంజారాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది ఉత్తమమైన బంజారాభివృద్ధి పాలసీని తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఓటు బ్యాంకు ను సుస్థిరం చేసుకోవాలని కోరుకుందాం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాజ్ కోరుకున్నట్టు బంజారా జాతి చెడు అలవాట్లకు లోను కాకుండా ఒక ఉత్తమమైన జీవితాన్ని అనుభవించాలని మహారాజ్ కోరుకున్న ఆశయాలను నెరవేరేటట్టు బంజారా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి జయంతి నాడు బంజారాలలో ఉన్నటువంటి లోపాలను చర్చించాలి జాతి బాగుకోసం సేవాలాల్ మహారాజ్ పడ్డ తపనను నెరవేరుద్దాం. జై సేవాలాల్ జై బంజారా జై జై బంజారా – డా. శంకర్ నాయక్ పమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ సిటీ కాలేజీ హైదరాబాద్ .
సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి