Sunday, November 10, 2024
Homeఓపన్ పేజ్Its a sensational manifesto by BRS: సంపద పెంచాలె.. ప్రజలకు పంచాలె

Its a sensational manifesto by BRS: సంపద పెంచాలె.. ప్రజలకు పంచాలె

వావ్‌..! వాట్‌ ఏ మేనిఫెస్టో

ప్రత్యర్థులందరికీ దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా బీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇన్నాళ్లుగా కేసీఆర్‌ ఏమైపోయారు, ఎక్కడున్నారన్న ప్రశ్న లన్నింటికీ ఈ ఒక్క మేనిఫెస్టోతో తిరుగులేని సమాధానం కనిపించింది. ప్రగతిభవన్‌లో మేధోమథనం చేసిన కల్వ కుంట్ల చంద్రశేఖర్‌ రావు.. రాబోయే ఐదేండ్లలో తెలంగాణ ప్రగతి పథాన్ని కండ్లముందు ఆవిష్కరించిండ్రు. ఇంత కాలం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక వరాలు ప్రక టించి, అమలుచేసిన తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌.. తమ పార్టీ జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలిసారిగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశా రు. ఇందులో వారు, వీరు అని లేకుండా ప్రతి ఒక్క వర్గా నికీ పెద్దపీట వేసుకుంటూ.. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో నిలిచారు. ఇన్నాళ్లూ రేషన్‌ బియ్యం అంటే చాలు.. చాలామంది తీసుకునేవారు కారు, ఒకవేళ తీసు కున్నా దాన్ని దోశల కోసమో, లేదా మరే ఇతర అవసరాల కోసమో వాడుకోవడం, అమ్ముకోవడం లాంటివి చేసే వారు. వాటన్నింటికీ చెక్‌ పెడుతూ, రేషన్‌ దుకాణాల ద్వా రా కూడా సన్న బియ్యాన్ని సరఫరా చేసేందుకు కేసీఆర్‌ ముందుకొచ్చారు. ఇంటి పెద్ద చనిపోతే, ఇంటికి ఆసరాగా ఉన్న వ్యక్తులు దూరమైతే ఆ కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతాయి. తర్వాతి రోజు గడిచేదెలాగో.. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేదెలాగో తెలియని కుటుంబాలు వేనవేలు. అలాంటివారందరికీ బెంగ తీరేలా, రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికీ ఎల్‌ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవిత బీమా ను అందిస్తామని, దీనికి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే కడుతుందని ప్రకటించారు. ఇది రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాలకు పెద్ద వరం అవుతుంది.
ఆసరా పథకం కింద ఇచ్చే పింఛన్లు ప్రస్తుతం రూ.2,016 మాత్రమే ఉన్నాయి. వాటిని వచ్చే సంవత్సరం వెయ్యి రూపాయలు పెంచి రూ.3,016 చేయడంతో పాటు రాబోయే ఐదేండ్లలో రూ. 5వేలకు తీసుకుపోతమని హామీ ఇచ్చారు. కాళ్లు, చేతులు ఆడక.. వయసైపోయి, ఏం చేయాలో, ఎలా తినాలో, ఎందుకు బతకాలో అర్థంకాక బతుకును భారంగా వెళ్లదీసే అనేకమంది నిరుపేద వృద్ధు లు, ఒంటరి మహిళలు.. ఇలా ఎంతోమందికి ఈ ఆసరా పింఛను 5వేలు కావడం ఎంతో ఊరటనిస్తుంది. ఇక దివ్యాంగుల పింఛను అయితే ఇటీవలే రూ.4,016 చేయగా.. దాన్ని రాబోయే ఐదేండ్లలో రూ.6,016 చేస్తా మనీ కేసీఆర్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. తద్వారా బతుకు మీద ఈ వర్గాలన్నింటికీ పెద్ద భరోసా కల్పించారు. ఇక తాము ఆత్మగౌరవంతో బతకగలమన్న ఒక నమ్మికను వారందరికీ ఇచ్చినట్లయింది.
దేశంలో రైతులకు సాయం అందించేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణకే దక్కుతుంది. ఈ మోడల్‌నే కొంత అటూ ఇటూగా దేశవ్యాప్తంగా కూడా అమలుచేస్తున్నారు. ఇంతకాలం పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10వేల రూపాయలు అందిస్తుండగా, దాన్ని బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్స రమే రూ.12వేలు చేస్తామని, రాబోయే ఐదేండ్లలో గరిష్ఠం గా ఎకరానికి రూ.16 వేలు చేస్తామనీ హామీ ఇచ్చారు.
మహిళలు అంటే ఇంటి దీపం. ఎలాంటి ఉద్యోగాలు చేయకపోయినా.. మహిళ ఇంటి మొత్తం పని చేయడంతో పాటు, పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. అలాం టి పేద మహిళలు తమ కోసం తాము ఏం చేసుకోవాలన్నా చేతిలో డబ్బులేక ఇబ్బంది పడుతుంటారు. ఇక అలాంటి సమస్య అక్కర్లేకుండా.. అర్హులైన ప్రతి ఒక్క పేద మహిళకూ నెలకు రూ.3వేల చొప్పున ప్రతినెలా జీవనభృతిగా అంది వ్వాలని ఇంటిపెద్ద బాధ్యతను తలకెత్తుకున్న పెద్దమనిషి… కేసీఆరే! ఇంట్లో ప్రతి ఒక్కరి బాగోగులు చూడటం కుటుం బ పెద్దకు ఒక బాధ్యతగా ఉంటుంది. రాష్ట్రమంతా తన కుటుంబమేనని, ఇందులో అన్ని వర్గాల వారినీ చూసుకునే బాధ్యత తనదేనని స్పష్టంగా చెబుతున్న కేసీఆర్‌.. తమ పార్టీ బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగకుండా దగ్గరుండి దానికి రూపకల్పన చేశారు.
పేద మహిళలకు కేవలం జీవనభృతి ఇవ్వడమే కాదు, ప్రతి రోజూ పెరుగుతున్న గ్యాస్‌ ధర భారం వారు మోయా ల్సిన అవసరం లేకుండా.. అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్‌ సిలిండరును అందిస్తుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అంతే కాదు, తెలంగాణలో అక్రెడిటేషన్‌ ఉన్న జర్నలిస్టుల కుటుం బాలకు కూడా రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. నాణ్యమైన వైద్యాన్ని మారుమూల ప్రాంతా లకూ తీసుకెళ్లేలా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా క్లినిక్‌లు పెట్టడం తో పాటు, వేలకు వేల ఖరీదుచేసే వైద్య పరీక్షలను సైతం పూర్తి ఉచితంగా అందజేస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వా నికే దక్కుతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ.. ఇప్పటివరకు రూ. 5 లక్షలుగా ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల గరిష్ఠ పరిమితిని ఏకంగా రూ. 15 లక్షలకు పెంచుతామని చెప్పారు. అదే సమయంలో.. ప్రభుత్వోద్యోగులకు, తెలం గాణ వ్యాప్తంగా ఉన్న అక్రెడిటేషన్‌ గల జర్నలిస్టులకు కూడా రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమాను కల్పిస్తా మని ప్రకటించారు. కార్పొరేట్‌ వైద్యం బాగా ఖరీదైపోయిన ఈ సమయంలో.. ఈ నిర్ణయం ప్రభుత్వోద్యోగులకు, జర్నలిస్టులకు, అర్హులైన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఎంతగానో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అసైన్డ్‌ భూములంటే ఎక్కడలేని ఆంక్షలు ఉంటాయి. వాటిపై హక్కులు ఉన్నట్లే ఉంటాయి గానీ, ఆ భూములను ఏం చేసుకోవడానికీ వీలుండదు. అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ఇకపై అసైన్డ్‌ భూముల మీద ఆంక్షలను సంపూ ర్ణంగా ఎత్తేయనున్నట్లు తమ మేనిఫెస్టోలో కేసీఆర్‌ ప్రకటిం చారు. ఇదే అమలైతే.. ఇక అసైన్డ్‌ భూములకు, పట్టా భూములకు కూడా ఎలాంటి తేడా ఉండబోదు. అసైన్డ్‌ భూముల లబ్ధిదారులు సైతం ఇక గుండెల మీద చేయి వేసుకుని నిశ్చింతగా నిద్రపోవచ్చు. అలాగే హైదరాబాద్‌ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో డబుల్‌ బెడ్రూం ఇళ్లను పెద్ద ఎత్తున కట్టాలని.. దాదాపు లక్ష ఇండ్లు కట్టి ఇండ్లు లేని నిరుపేదలకు గౌరవప్రదమైన గూడు కల్పించా లని కూడా నిర్ణయించారు.
కాంట్రిబ్యూటరీ పింఛను పథకం అనేదాన్ని ఉద్యోగు లందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నరు. దీనిపై పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. తమకు పాత పింఛను విధానాన్నే కొనసాగించాలన్నది ఉద్యోగుల చిరకాల ఆం కాంక్ష. దీనిపై అధ్యయనం ప్రత్యేక కమిటీని నియమిస్తా మని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసు కుంటామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇది ఉద్యోగులకు ఎంతకాలంగానో ఉన్న చింతను తీరుస్తుంది. మొత్తమ్మీద ప్రత్యర్థిపార్టీలకు అందనంత దూరంలో.. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాబోయే కాలంలో బంగారు తెలంగాణకు మరింత తావి అద్ది అంతెత్తున నిలబెట్టేందుకు కావల్సిన అన్ని మార్గాలనూ కేసీఆర్‌ తన మేనిఫెస్టో ద్వారా పరిచి నట్లయింది.
సమయమంత్రి చంద్రశేఖర శర్మ

  • 7674869432
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News