2020లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడాదిపాటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేశారు. అప్పట్లో 3 కీలక వ్యవసాయ బిల్లుల సవరణను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఆందోళనకు రైతులు సిద్ధమయ్యారు. గత రాత్రి నుంచే ఢిల్లీకి ట్రాక్టర్లను తరలిస్తున్నారు. దీన్ని, ఛలో ఢిల్లీ, ఛలో పార్లమెంట్ పేర్లతో పిలుపునిచ్చారు..ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్ర రైతు సంఘాలు మంగళవారం ‘మెగా మార్చ్’ నిర్వహించనున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు మరికొన్ని రైతు సంఘాలు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు మంగళవారం ‘చలో ఢిల్లీకి’ మార్చ్ నిర్వహించ తలపెట్టాయి. 2021లో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నప్పుడు పెట్టిన షరతుల్లో. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పార్లమెంట్ ఎదుట నిరసనకు సిద్ధమయ్యాయి.
ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి హస్తిన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి మెగా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలతో సిద్ధం అయింది. ఇందులో భాగంగానే మార్చి 12 వ తేదీ వరకు నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దులను మూసివేసింది. ఇక మరికొన్ని సరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. శాంతి, భద్రతల సమస్య తలెత్తవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు,. రైతుల నిరసనల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశంతో పాటు హింస చెలరేగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా రైతులు మరోసారి కదం తొక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే నేడు దేశ రాజధాని చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, రైతుల డిమాండ్లలో మరికొన్ని ఉన్నాయి. 2020-21లో తమపై పెట్టిన కేసుల్ని తొలగించాలనీ, లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధితులకు న్యాయం చెయ్యాలనీ, 2023 ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలనీ, MSPపై స్వామినాథన్ కమిషన్ రిపోర్టును అమలు చెయ్యాలనీ, దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీల రుణాలను మాఫీ చెయ్యాలనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్ తొలగాలనీ, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం మానుకోవాలనీ, ఇంపోర్ట్ డ్యూటీ పెంచి దేశీయ రైతులను కాపాడాలనీ ఇలా చాలా డిమాండ్లను రైతులు వినిపిస్తున్నారు.
అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీని 13న ఉదయం ప్రారంభించారు. పంజాబ్ ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరారు. కొన్ని బృందాలుగా ఇంద్రప్రస్థ దిశగా కదిలింది. దీంతో దేశ రాజధాని సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. సుదీర్ఘ ఆందోళనకు సిద్ధపడి.. అందుకు తగిన ఏర్పాట్లను చేసుకుని వచ్చినట్టు రైతులు వెల్లడించారు. ఆరు నెలలకు సరిపడే సామాగ్రి, వాహనాలకు డీజిల్‌ను తమవెంట తెచ్చుకున్నామని పంజాబ్‌కు చెందిన రైతులు తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఆందోళన నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసనను కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు…
రైతులను అరెస్టులరూపంలో అరికట్టడం సాధ్యపడదు అని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. డ్రోన్లు సహాయంతో టియర్ గ్యాస్ ను ప్రయోగించడంతో, ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అయినా వెన్నక్కి తగ్గని అన్నదాతలు…
గతంలో నిరసన తెలిపిన రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీలతో విరమించారు. అసలు ఆ హామీల అమలు ఎక్కడి వరకు వచ్చింది. మరి నేటి రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో అని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది….
జాజుల దినేష్.
సామాజిక విశ్లేషకులు..
ఎంఏ. ఏంఎడ్, సెట్, పిజిడిసిఎ.
పొలిటికల్ సైన్స్ లెక్చరర్.
9666238266