Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Pi day: నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు

Pi day: నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు

ఐన్స్టీన్ ఫిలాసఫీ

తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేప టిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమి టంటే ప్రశ్నించడం మాత్రం ఆపకూడదు. జీవితం సైకిల్‌ తొక్కడం లాంటిది. మీరు బ్యాలెన్సుగా ఉండడానికి, మీరు కదు లుతూ ఉండాలి. ఈ మాటలు అన్నది చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడి అతని తల్లిదం డ్రులుకి ఆందోళన కలిగించి, యువకుని గా ఉన్నప్పుడు భౌతిక శాస్త్రంలో శతాబ్దాల నాటి నుండి అపరిష్కృతంగా ఉన్న సమ స్యలను సాధించి,అప్పటి శాస్త్రవేత్తలకు కూడా తన సిద్ధాంతాలతో ఆశ్చర్యపరిచిన ఓ ప్రపంచ మేధావి, భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గ్రహీత. ఆయనే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. ఇంత వరకూ అంతటి ఐ.క్యు కలిగిన వ్యక్తి పుట్టలేదు. ఐన్‌స్టీన్‌ 1879 మార్చి 14న జర్మనీలోని ఉల్మ్‌లో జన్మిం చాడు. అతను 1895 లో స్విట్జర్లాండ్‌కు వెళ్లాడు. అతను 17 సంవత్సరాల వయ స్సులో స్విస్‌ ఫెడరల్‌ పాలిటెక్నిక్‌ స్కూల్‌ లో మ్యాథమెటిక్స్‌ మరియు ఫిజి క్స్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లో చేరాడు. 1901లో పాలిటెక్నిక్‌ నుండి పట్టభద్రుడయ్యాడు. స్విస్‌ పౌరసత్వం పొందాడు. అతను చాలా నెలలు నిరుద్యోగిగా ఉన్నాడు. చాలా కష్టమైన ఆర్థిక పరిస్థితిని అనుభవిం చాడు. 1902లో బెర్న్‌ యొక్క పేటెంట్‌ కార్యాలయంలో ఉద్యోగం పొందాడు. అక్కడ చదవడానికి తగినంత ఖాళీ సమ యం లభించింది. 1905 సంవత్సరం ముఖ్యమైనది ఎందుకంటే అతను నాలుగు విప్లవాత్మక పత్రాలను ప్రచురిం చింది ఈ సంవత్సరంలోనే. ఈ పత్రాలలో ఫోటో ఎలెక్ట్రిక్‌ ప్రభావం, బ్రౌనియన్‌ చలనం, ద్రవ్యరాశి-శక్తి సమానత్వం మరియు ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం ఉన్నాయి. అతను జ్యూ రిచ్‌ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డిని చేశారు. ఐన్‌స్టీన్‌ 1916 నుండి 1918 వరకు జర్మన్‌ ఫిజికల్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశాడు. 1922లో, అతను సైద్ధాంతిక భౌతిక శాస్త్రానికి, ఫోటో ఎలెక్ట్రిక్‌ ఎఫెక్ట్‌ యొక్క చట్టాన్ని కనుగొన్నం దుకు గానూ 1921లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందు కున్నాడు. ఆయనకి పేరు తెచ్చిన సిద్ధాంతాలు అవగాడ్రో సంఖ్యపై ఐన్‌స్టీన్‌ చేసిన పని ఆవర్తన పట్టికలోని ప్రతి మూలకానికి పర మాణువు ద్రవ్యరాశి మరియు మోలార్‌ ద్రవ్య రాశిని నిర్ణయించడానికి పునాది వేసింది. బ్రౌనియన్‌ చలనం ఐన్‌ స్టీన్‌ యొక్క మరో ముఖ్యమైన సిద్ధాంతం. ఇది ద్రవం లేదా వాయువులోని కణాల యాదృచ్ఛిక కదలికను వివరిస్తుంది. ఈ సిద్ధాంతం అణువులు, పరమాణువుల ఉనికిని నిరూపించడంలో కీలక పాత్ర పోషించింది. 1905లో ఐన్‌స్టీన్‌ ప్రతి పాదించిన ఫోటోఎలెక్ట్రిక్‌ ప్రభావం అనేది విద్యుదయస్కాంత వికిరణాలను గ్రహిం చినప్పుడు పదార్థం విద్యుత్‌ చార్జ్‌ చేయ బడిన కణాలను విడుదల చేసే ఒక దృగ్వి షయం. లోహపు పలకపై కాంతి పడిన ప్పుడు వాటి నుండి వెలువడే ఎలక్ట్రాన్‌లను ఫోటో ఎలక్ట్రాన్‌లు అంటారు. ప్రత్యేక సాపేక్షత మరియు సాధారణ సాపేక్షత సిద్ధాంతాలతో ఐన్‌స్టీన్‌ మునుపటి భౌతిక సిద్ధాంతాలకు అంతర్లీనం గా ఉన్న అనేక ఊహలను పొందుపరిచారు. ఈ ప్రక్రి యలో స్థలం, సమయం, పదార్థం, శక్తి మరియు గురుత్వాకర్షణ యొక్క ప్రాథ మిక భావనల గురించి సరికొత్త భావనలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా క్వాంటం మెకానిక్స్‌తో పాటు ఆధునిక భౌతిక శాస్త్రంలో దీని ఉపయోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి సాపేక్షత విశ్వ ప్రక్రియలను మరియు విశ్వం యొక్క జ్యామితిని అర్థం చేసుకోవడానికి ఆధారాన్ని అందిస్తుంది . అంతా గణితమయం… జగమంతా గణిత మయం. గణితంలో అంకెలుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రపం చాన్నే శాసిస్తున్న ఎలక్ట్రానిక్‌ చిప్‌లును నడి పించేది రెండే రెండు డిజిట్లు. అవి ‘సున్న’ మరియు ‘ఒకటి’ మాత్రమే. వీటిని ఉప యోగించి కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా కొన్నింటి విలు వలు తెలియదు. అందులో ‘పై’ ఒకటి. ‘పై’ అనేది ఒక స్థిరాంకం. మనకందరుకూ వృత్తాకార వస్తువులు గురించి తెలుసు. ఇటువంటి వృత్తం చుట్టకొలతను వృత్త పరిధి అంటారు. వృత్త పరిధి మరియు వ్యాసానికి మధ్యగల నిష్పత్తినిపై అని పిలుస్తారు. ఇది ఒక; స్థిరాంకం. దీని విలువ అంతమూ కాదు. ఆవర్తనం కాదు. సుమారు 3.14. ఉంటుంది. అం దుకే మార్చి 14 వ తేదీని ‘పై డే’ గా పిలుస్తారు.

- Advertisement -

– జనక మోహన రావు దుంగ 8247045230

(ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ జన్మదినం, ‘పై‘ దినం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News