ఆంధ్రప్రదేశ్‌లో రాజధానికి సంబంధించిన గందరగోళం రామ్ష్రాభివృద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రాష్ష్రానికి రాజధాని ఏదనే విషయం తేలిపోయి ఉంటే, ర్యాష్ట్రం ప్రగతి పథంలో ఉ౦దేది. అయితే, అమరావతి రాజధాని అవుతుందా లేక విశాఖపట్నం రాజధాని అవుతుందా అనే మీమాంస కారణంగా దాదాపు పాలన స్తంభించిపోయినట్టయింది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన వ్యవహారాల రాజధానిగా ఉంటాయని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని పాలక వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్ది శాసనసభ సాక్షిగా (ప్రకటించడం పాలనాపరంగా సమంజసమైన నిర్ణయమే కావచ్చు కానీ, అమరావతే రాజధానిగా ఉండాలన్న అభిప్రాయంతో కొందరు న్యాయస్థానాన్ని ఆతయించడం, చివరికి అది సుప్రీంకోర్టులో విచారణలో ఉండడం వగైరాల వల్ల నాలుగేళ్ల అమూల్యమైన కాలం వృథా అయిపోయింది. ఈ నెలాఖరులో సుప్రీంకోర్టు తీర్చు వెలువరిస్తుందని ఆశిస్తున్న సమయంలో ఇటీవల కేంద్ర (ప్రభుత్వం ఆంధ్ర (ప్రదేశ్‌కు అమరావతే రాజధాని అనీ ప్రకటించడం, మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించలేదని వెల్లడించడ౦ మరింత గందరగోళానికి ఆస్మారం కల్పించింది.
రాజధాని ఏదన్నది స్పష్టంగా తేలేవరకు అభివృద్ధికి అవకాశం ఉండకపోవచ్చు. విశాఖపట్నమా లేక అమరావతా అన్నది తేలిపోవడం అత్యవసరంగా కనిపిస్తోంది. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేస్తున్న సమయంలో రాజధాని విషయంలో గందరగోళం నెలకొని ఉ౦డడం అసలు ప్రయోజనాన్ని దెబ్బ తీస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే రాష్టంలో పెట్టుబడి వాతావరణం బాగా దెబ్బతిని ఉంది. సంక్షమానికి, ఉచితాలకు తప్ప మరే అభివృద్ధి కార్యక్రమానికీ ప్రాధాన్యం ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉంది. 2015 ఏప్రిల్‌లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా (ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర౦లో రాజధాని విషయంపై కనీ వినీ ఎరుగని గందరగోళం నెలకొంది. కేంద్రం అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఇక అమరావతి రాజధానిగా ఉండబోతోందా లేక ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నట్టు విశాఖపట్నం రాజధాని కాబోతోందా అన్నది అంతుబట్టడం లేదు. ఇన్నేళ్ల పాటు రాజధాని ఏదన్నది తేలకపోవడం ర్యాష్ట్ర ప్రగతికి ఏమాత్రం శుభ సూచకం కాదు. రాష్ట్ర పాలనాపరంగా, అభివృద్ధిపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బ తింటుంది. ఆ ఛాయలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
ఈ అయోమయావస్థ వల్ల అనేక అవకాశాలు చేజారిపోతున్నాయి. పెట్టుబడి వాతావరణం మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. రాజకీయాలనే సరికి పాలక పక్షాన్ని పని చేయనివ్వకపోవడమే (ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తుంటాయి. ఈ ధోరణి ఆంధ్ర ప్రదేశ్‌కు కొత్త కాదు. ప్రతి సమస్యా వివాదాస్పదంగా మారడం, న్యాయన్థానాల వరకూ వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. కొద్ది రోజుల్లో విశాఖ నగరమే ఆంధ్ర ప్రదేశ్‌కు రాజధాని కాబోతోందంటూ ముఖ్యమంత్రి ప్రకటించడం, కేంద్రం సాంకేతిక కారణాలను చూపించి ఇందుకు పూర్తి విరుద్దంగా ప్రకటన చేయడం వగైరాల వల్ల పాలన మీద వీటి ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చినప్పటికీ, దానికి పార్టీలన్నీ ఒదంబడి ఉందడం వల్ల ఈ గందరగోళం తొలగిపోయి, రాష్ట్రం మళ్లీ పట్టాలు ఎక్కడానికి అవకాశం ఏర్పడుతుంది. విశాఖపట్న ౦లో జరగబోయే పెట్టుబడిదారుల సదస్సుకు ఒక సార్ధకత చేకూరుతుంది.