Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Are Padayatras really useful?: పాదయాత్రల ఏమైనా ప్రయోజనం ఉందా?

Are Padayatras really useful?: పాదయాత్రల ఏమైనా ప్రయోజనం ఉందా?

ఎన్ని పాదయాత్రలు ఓట్లుగా మారాయి?

ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రయోజనాలను ఆశించి రాజకీయ నాయకులు చేపట్టే పాద యాత్రల వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? అవి నిజంగానే సంబంధిత పార్టీలను ఎన్నికల్లో గెలిపి స్తాయా? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాగూ పర్యటనలు, ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవ డానికి పాదయాత్రలు చేయడం జరుగుతుంది కదా? కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇప్పటికే ఒక పాదయాత్రను చేపట్టి రెండవ యాత్రను ప్రారంభించారు. మొదటి పాదయాత్రలో ప్రజలకు అన్ని విషయాలూ అర్థమయ్యాయి. కాంగ్రెస్‌ విధానాలు అర్థమ య్యాయి. రాహుల్‌ గాంధీకి కూడా ప్రజల మనోభావాలు మనసుకు పట్టాయి. ఇప్పుడు రెండవ యాత్ర అవసరమే మిటి? భారత్‌ జోడో న్యాయ యాత్ర జోరుగానే సాగుతు న్నట్టు కనిపిస్తోంది. ఆయన ఎక్కడికి వెడితే అక్కడ జనం పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూ చేుత్రున్నారు. మధ్య మధ్య ఆయన తన పాదయాత్రకు విరామం ప్రకటించి దారి పక్కన కూర్చుని ప్రజలతో ముచ్చటిస్తున్నారు. ఆయన చుట్టూ చేరుతున్నవారిలో ఎక్కువ మంది యువతీ యువ కులే ఉంటున్నారు. అందులోనూ జీన్స్‌ ప్యాంట్లు వేసుకున్న యువతులే ఎక్కువ మంది ఉంటున్నారు. స్వేచ్ఛా వాదు లు, ఉదారవాదులు ఆయనతో కూర్చుని సాధక బాధకా లను చర్చిస్తున్నారు. తనతో స్వేచ్ఛగా మాట్లాడడానికి ఆయన అవకాశం కల్పిస్తున్నారు కూడా.
అయితే, ఈ పాటలు, ఈ కబుర్లు, ఈ చర్చలు ఆయన కు ఎన్నికల్లో ఉపయోగపడబోతున్నాయా అన్నది ఇక్కడ ప్రశ్న. నిజానికి ఇవన్నీ కళాశాల ఎన్నికలకు పనికి వస్తాయే తప్ప సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా కనిపించడం లేదు. కొద్ది కాలం క్రితం ఆయన మొదటిసారి ఇటు వంటి పాదయాత్ర చేపట్టినప్పుడు కొద్దిపాటి ఆశావహ పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో తప్ప విజయం సాధించలేక పోయింది. ఆయన పాదయాత్ర చేసిన ప్రాంతాలన్నిటి లోనూ కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరిగిందంటూ రాహుల్‌ అనుకూల మీడియా ప్రతినిధులు పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు రాయడం జరిగింది కానీ, అందుకు సంఖ్యాపరంగా సరైన సాక్ష్యాధారాలు లభించలేదు. నడకకు, ఓట్లకు సంబంధం ఉన్నట్టు ఏ విధంగానూ రుజు వు కాలేదు. మొత్తం మీద పాదయాత్ర ప్రభావం ఎన్నికల మీద ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి.
సత్ఫలితాలు తక్కువే
అంతకన్నా విచిత్రమైన విషయమేమిటంటే, సార్వ త్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పాద యాత్ర వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన పాదయాత్ర బీహార్‌ లో ప్రవేశించినప్పుడు పెద్ద సంఖ్యలో జనం ఆయన సభలకు హాజరయ్యారు. ఆయనతో అడుగు కలిపి నడిచారు. అయితే, ఇదంతా ఒకపక్క జరుగుతుండ గానే మరొకపక్క బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రతిపక్ష కూటమి అయిన ‘ఇండియా కూటమి’ నుంచి విడిపోవడం, ముఖ్య మంత్రిగా రాజీనామా చేయడం, బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయింది. ఇదంతా మూడు రోజుల్లో మెరుపు వేగంతో పూర్తయిపోయింది. నిజానికి, ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర నిర్వహించింది నితీశ్‌ కుమారే.
బీజేపీకి బద్ధ శత్రువు అయినందువల్లే నితీశ్‌ కుమార్‌ పార్టీని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపించినా ప్రజలు మళ్లీ శాసనసభ ఎన్నికల వరకూ నిరీక్షించడం తప్ప ఆయనను చేసేదేమీ లేదు. ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర పశ్చిమ బెంగాల్‌ లో ప్రవేశించిందో లేదో తమ పార్టీకి, కాంగ్రెస్‌ పార్టీకి పొత్తు లేదని, సీట్లు పంచడం జరగదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత అయిన మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్‌, మార్క్సిస్టు పార్టీలు చేతులు కలిపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా యంటూ ఆమె ఆరోపించారు. ఆమె ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ పార్టీకి మరో మిత్రపక్షమనే విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది రాహుల్‌ గాంధీ ఇదే విధంగా కేరళ లో పర్యటిస్తున్నప్పుడు, స్థానిక ప్రాధాన్యాల కారణంగా పాలక మార్క్సిస్టు పార్టీ ఆయనను ఏమాత్రం పట్టించుకో లేదు. పైగా, రాహుల్‌ గాంధీ గనుక వెంటనే వాయనాడు నియోజక వర్గం నుంచి తప్పుకున్న పక్షంలో తమ పార్టీ అక్కడి నుంచి పోటీ చేస్తుందంటూ ఇటీవల ఒక ప్రకటన చేసింది. ప్రాంతీయ పార్టీలకు వేరే ప్రయోజనాలు, ఆసక్తు లు ఉంటాయన్న వాస్తవం అందరికీ తెలిసిన విషయమే.
బలపడుతున్న ప్రత్యర్థులు
రాహుల్‌ యాత్ర గురించి ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యక్తం చేస్తున్న అభిప్రాయా లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలుజరగబోతున్న సమయంలో రాహుల్‌ గాంధీ ఢిల్లీలో ఉండాలి తప్ప గల్లీల్లో ఉండకూడ దని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పడం జరిగింది. ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంటూ, వ్యూహాలను రూపొం దించడం, ఇతర పార్టీలతో సంప్రదింపులు జరపడం, రాజకీయ సమీకరణాలు చర్చించడం, సంస్థాగత నిర్ణయా లు తీసుకోవడం వంటివి చేయాల్సి ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. కాగా, ఇటువంటి విషయాలపై నిర్ణ యాలు తీసుకోవడం, చర్యలు చేపట్టడంవంటివి పార్టీ అధ్యక్షడు మల్లికార్జున్‌ ఖర్గే చేయాల్సి ఉంటుందని రాహుల్‌ గాంధీ చాలా కాలం క్రితమే పార్టీ అధ్యక్ష ఎన్నికల తర్వాత చెప్పడం జరిగింది. పైగా తాను పర్యటనలుచేయాల్సి ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది తప్పుడు వ్యూహమేమీ కాదు. రాహుల్‌ గాంధీకి తన పరిమితులు తెలుసు. ఆయన ఇటువంటి చర్చలు, సంప్రదింపులకు తగిన వ్యక్తి కారు.
అయితే, ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే, ఆయన పాదయాత్రలేవీ ఓట్లుగా మారడం లేదు. ఆయన పర్యటనల వల్ల పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు కాంగ్రెస్‌ ప్రయోజనాలకు భిన్నంగా ఉంటు న్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పాలక పక్షాలు కలిసే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా కాం గ్రెస్‌ పార్టీతోనే అక్కడ కలహాల కాపురం కొనసాగుతోంది. అక్కడ కాంగ్రెస్‌ను బతికించడమంటే ప్రాంతీయ పార్టీలు జవసత్వాలు కోల్పోవడమే అవుతుంది. పొత్తులు కుదిరిన ప్పుడల్లా కాంగ్రెస్‌ పార్టీకి అది సదవకాశంగానూ, ప్రాం తీయ పార్టీలకు ముప్పుగానూ మారుతోంది. నరేంద్ర మోదీ ని ఓడించడానికి తామెంతుకు బలి కావాలని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి? కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్న కారణంగానే మమతా బెనర్జీ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతోంది. జాతీయ స్థాయిలో మోదీ హవా కొన సాగుతున్నంత వరకు తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. కేం ద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న పక్షంలో ఈ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకంగా మారేది. రాష్ట్రాల సమాఖ్య మీద మోదీకి నమ్మకం ఉన్నం తగా కాంగ్రెస్‌ పార్టీ నాయ కత్వానికి లేదు.
ఆత్మవిమర్శ అవసరం
రాహుల్‌ గాంధీ ఈ యాత్రను ప్రారంభించడం జరిగి పోయింది కనుక ఇక దాన్ని కొనసాగించకుండా విడిచి పెట్టే అవకాశం లేదు. మార్చి చివరి వారం వరకూ ఆయన ఢిల్లీకి వచ్చే అవకాశం లేదు. ఢిల్లీకి వచ్చిన తర్వాతనైనా ఆయన వ్యర్థ ప్రసంగాలు, ప్రకటనలు చేయకపోవడం మంచిది. అధికారంలో కొనసాగాలన్న పక్షంలో ప్రజల్లో భయాన్ని పెంచాలే తప్ప రాహుల్‌ గాంధీ మాదిరిగా అవ సరమున్నా లేకపోయినా ప్రేమ వచనాలు వల్లించి ప్రయోజనం లేదు. మోదీకి ఆ విషయంగా క్షుణ్ణంగా తెలుసు. రాహుల్‌ గాంధీకి గానీ, పార్టీలోని ఇతర నాయకు లకు గానీ ఆర్థికాభివృద్ధి విషయంలో స్పష్టమైన విధాన మంటూ ఏదీ లేనందువల్ల ఇటువంటి ప్రేమ వచనాలు వల్లించడం ప్రారంభించారేమో తెలియదు. ఈ ప్రేమ వచనాల వల్ల తమ ఓట్లు తమకు పడడమే ఒక గొప్ప విషయం. కాంగ్రెస్‌ పార్టీ కారణంగానే దేశం ఏకపక్ష ప్రజాస్వామ్యంగా మారుతోంది. ఈ పార్టీలో దూరదృష్టి, విజన్‌ కొరవడడమే బీజేపీ బలానికి దోహదం చేస్తోంది. కాంగ్రెస్‌ ఎంత పరివర్తన చెందితే అంత మంచిది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News