Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Balala Sathakam: సమాజాన్ని తట్టి లేపుతున్న బాలలశతకం-వినరాబిడ్డ!

Balala Sathakam: సమాజాన్ని తట్టి లేపుతున్న బాలలశతకం-వినరాబిడ్డ!

తెలుగులో 12వ శతాబ్దిలో శతకం ఆవిర్భవించింది. ఈ ఎనిమిది వందల సంవత్సరాలుగా తెలుగు శతకం శాఖోపశాఖలుగా ఆవిర్భవించి స్వభావంలోనూ స్వరూపంలోనూ ఎంతో మార్పు పొందింది.
భారతీయ భాషల్లో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులోవలె బహుముఖ వికాసాన్ని పొంది వైశిష్ఠ్యముపొందలేదు. డాక్టర్‌ గోపాలకష్ణ రావు గారు శతక లక్షణాలు సమగ్రంగా పరిశీలించి వివరించారు.

- Advertisement -
  1. సంఖ్యా నియమం
  2. మకుటం
  3. వత్తనియమం
  4. ముక్తక లక్షణం
  5. ఆత్మానుభూతి.
    పైనియమాలన్నీ పాటిస్తూ శ్రీపాద. రామచంద్రయ్య గారు వినరాబిడ్డ! అనే బాలల శతకాన్ని అత్యద్భుతంగా రచించాడు. కరోనా ప్రపంచాన్ని కలవర పెట్టిన తీరు ప్రపంచ యుద్ధం కంటే ఓ భయానక చిత్రాన్ని చిత్రించినట్లు అయ్యింది. కళ్ళముందే మత్యుభేరి మోగించినట్లు అయ్యింది. సైకిల్‌ ట్యూబులు పోయి పిల్లలు యూట్యూబ్‌ కు అత్తుకుపోయారు.
    బడి అంటే భవిష్యత్‌ తరానికి బంగారు బాట. అది నాలుగు గోడల బందిఖాన కాదు. పుస్తకం అంటే రెండు అట్టముక్కలకు పరిమితమైందనుకుంటే అది ఖచ్చితంగా అక్షరాలా అబద్ధం. చెడు ఏదో మంచి ఏదో ఎంపిక లో పొరపాటు పడ్డారు నవతరం విద్యార్థులు. కరోనా సమస్యలు చెప్పుకుంటే అక్షరాలతో సముద్ర అగాదాలను నింపేయవచ్చు. పదాలతో ఎవరెస్ట్‌ శిఖరం అంత ఎత్తుకు పేర్చవచ్చు. ఉత్తమ ఉపాధ్యాయులు సామాజిక సమస్యలకు సర్జరీ చేస్తారు . అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడి
    హదయాంతరాల నుంచి వచ్చిన అద్భుత కావ్యం వినరాబిడ్డ! అనే బాలల శతకం
    పిల్లలతో మాట్లాడకపోవడం పెద్ద నష్టమేమీ కాదు కానీ అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు.
    అప్రయత్నం నుంచి వచ్చిన ప్రయత్నాపూర్వక కవిత్వం రామచంద్రయ్య గారి కవిత్వం.
    కవిత్వం అంటే అక్షరాలు పోగు చేయడం కాదు. అనుబంధాలను అణువణువు నా నిభిడీకతం చేయటం.
    విశ్రాంతి ఎరగని అవిశ్రాంతకవి రామచంద్రయ్య గారు.
    అంతర్లీనంగా ఉన్న నిశ్శబ్దశబ్దము వారి అక్షరము.
    వారి కవిత్వం చిచ్చుబుడ్డిలో దాగి ఉన్న ఓ కాంతి వలయం. కవిత్వం అంటేనే ఓ అంతర్గత గాయం. ఏకాంతం నుంచి
    వచ్చిన వ్యధ వారి వాక్యం. అగాధ సాగరం నుంచి వచ్చిన
    అమతపు చుక్కలు వారి అనుభవాలు.
    రెక్కలు తొడిగిన భావాలు వారి కవితాక్షరాలు.
    వారి పదాలు పవిత్రాగ్ని.
    వారి హదయం వెన్నముద్ద .
    వారి వాక్యాలు నిజాల వెన్నెముక.
    వారి కన్నుల్లో ఎప్పుడు చూసినా పదసారాల ఆర్ద్రత.
    వారి శతకము భవిష్యత్‌ తరాలకి ఓ భద్రత.
    వారిది ఆశు కవిత్వం కాదు,
    అశ్రుబిందువుల కవిత్వం. సరదాగా తిరుగకుమా/
    నిరతము బడికిన్‌ వెడలుము నిష్టగా జదువన్‌/
    అనే పద్యంలో తన కలం నైపుణ్యాన్ని
    చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కవి చక్కగా
    అక్షరాలను చెక్కిన తీరు అద్భుతం వారి హదయ వేదనను భూగోళానికి, ఖగోళానికి వినిపించిన తీరు అమోఘం.
    ఉపాధ్యాయుడు సుద్ద ముక్క అని అనుకుంటే అది ఖచ్చితంగా అబద్ధం.
    వారు అణువణువునా దాగి ఉన్న ఓ అగ్ని కణం. కోతులవలె వర్తించుచు /
    నూతిలో కప్పవలె బతుకును గడుపుటేలా/
    అనే పద్యంలో ఈ కవి విద్యార్థులను సున్నితంగా హెచ్చరిస్తాడు . గూగుల్‌ గురువుగా మారినప్పటి నుండి
    గురువుకి దండం పెట్టే నాధుడే కరువయ్యాడు. విద్యార్థుల దష్టి కోణం మార్చిన దురదష్టకరమైన సంఘటన కరోనా. విద్యార్థులు మానవత్వాన్ని వింతగా చూస్తూ చెడును జూమ్‌ లో చూస్తూ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటున్నారో అని ఉపాధ్యాయుడిగా ఆవేదన సారమును వ్యక్తం చేస్తారు.
    రామచంద్రయ్య గారు కవితాసారం ఉన్న వ్యక్తి.
    అల్ప పదాలతో అనంతాన్ని చూపిస్తారు . పర్వతాన్ని గుండు సూదిగా చూపించే సంశ్లేషకులు. గుండుసూదిని పర్వతం గా విశ్లేషించే విశ్లేషకులు. పై పద్యంలో కోతుల్లా ప్రవర్తిస్తూ బావిలో కప్పల్లా బతుకుతూ నీతిని నేర్చుకోకుంటే అది జాతికి ప్రమాదం అంటారు రామచంద్రయ్య గారు. చిలికి చిలికి వెన్నముద్దను తీసినట్టుగా అంతర్మధనం నుంచి అమత వాక్కులు కురిపిస్తారు.

బడి వయసు బాలలారా!/
బడి లోనే చదువుడోయి పనులకు వలదో!/
నిజమేగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి లేదా సమాజం ఉండటం ఆ దేశానికి ఓ గొప్ప వరం. నేడు సాంకేతిక విప్లవం వలన అందరు విద్యావంతులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు కూడా బడి వయసు పిల్లల్ని
బడిలోనే ఉంచాలి అనే
నినాదం ఇచ్చింది.
‘‘ఎక్కడైతే బడులు పెచ్చులూడిన పైకప్పులతో,
బీటలు వారిన గదులతో వుండి, ప్రార్థన స్థలాలు స్వర్ణ భూషితంగా వెలుగుతాయో, అది వ్యవస్థకు ప్రమాదం.’’
అని ప్లేటో అన్న మాటలు అక్షర సత్యాలు. విద్య ఆవశ్యకత
గురించి పురాతన కాలంలోనే గుర్తించారు. అందుకే విద్య ఆవశ్యకత గురించి చెప్పే పద్యాలు చదువుతుంటే
గురువు యొక్క గురుతర బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. అంతకంటే ఎక్కువ విద్యార్థి యొక్క విధిని ,విద్య యొక్క విలువను తెలియజేస్తున్నట్టే వుంటాయి. సంపదలెన్నియు నున్నను /
ఇంపుగ శోభించు విద్య నెరుగని బతుకున్‌ /
అనే పద్యం చదువుతుంటే అక్షరాలు పక్షుల్లా స్వేచ్ఛా విహారం చేస్తున్నట్టు,అర్థం పక్కనే కూర్చొని హితబోధ చేస్తున్నట్టు, ఆనందాశ్చర్యాలకు గురి చేస్తున్నట్టు అనిపిస్తుంది.
నిజంగా విద్య ను మించిన సంపద ఏమి ఉంటుంది.
కోట్లు కొలమానాలు కావు. ెదాలు జారిపడే రోజులు ఉంటాయి. అందుకే వ్యక్తికి నిరంతరం శక్తినిచ్చేది విద్య ఒక్కటే.

                            శ్రీపాద రామచంద్రయ్య గారు

కేవలం తెలుగు పండిట్‌ అని అనుకుంటే పొరపాటు పడ్డట్లే.
వారు సమాజంలో ఉన్న వెలితిని నింపే అక్షర అక్షయపాత్ర.
వారు ఈ సమాజానికి పద్యాలతో నాడీ వైద్యం చేస్తారు. ఈ శతకానికి మరింత శోభనిచ్చింది డా బీ కూరెళ్ళ. విఠలాచార్యగారి ముందుమాట. దాసోజు జ్ఞానేశ్వర్‌ గారి అక్షరాలు అమతప్రాయంగా ఉన్నాయి.
పుస్తక ముద్రణా దాతలు అయిన శ్రీమతి %డ%శ్రీ మల్లాది
విమల కుమారి – కష్ణ కుమార్‌ గార్లు వత్తి రీత్యా ఉపాధ్యాయులు. శ్రీపాద రామచంద్రయ్య గారు ప్రముఖ సినీ నటుడు ఆర్యన్‌ రాజేష్‌ తో నటించిన అనుభవం కూడా కలదు. ఎన్నో వచన కవితలు
అభ్యుదయ గేయాలు , వ్యాసాలు, నాటికలు చెప్పుకుంటూ పోతే అది మరో పుస్తకం అవుతుంది. వారు అందుకున్న అవార్డులు వారింటి అల్మార లో నిండుగా వుంటాయి. డాక్టర్‌ శ్రీ నారాయణ రెడ్డిగారి తో మరియు పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు
గారి తో సత్కరించబడ్డారు.
వీరు రచించిన శతకం ప్రతి ఒక్కరి మనో మందిరంలో ఉండవలసిన పుస్తకం.

                                        సాదే. సురేష్‌
                                  9441692519.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News