Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్BJP historical mistakes: ఇది రాజకీయంగా తప్పటడుగు

BJP historical mistakes: ఇది రాజకీయంగా తప్పటడుగు

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒక కొత్త నినాదానికి శ్రీకారం చుట్టింది. ఇక కాంగ్రెస్ రహిత భారతదేశం కావాలంటూ అది ప్రచారం ప్రారంభించింది. గుజరాత్ ఎన్నికల్లో ఈ నినాదం బాగానే పనిచేసినట్టు కనిపించింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ నినాదం బాగానే పనిచేసి ఉండవచ్చు కానీ, అది అధికారంలోకి మాత్రం రాలేక పోయింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా బీజేపీ 52.56 శాతం ఓట్ల వాటాతో ఒక పెద్ద రికార్డే సృష్టించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాకర్ష ణకు ఇది ఒక రకంగా గీటురాయి అని చెప్పవచ్చు. ఆ పార్టీకి ఇది సంబరాలు చేసుకోవా ల్సిన సమయమే కానీ, ఆ పార్టీ కొద్దిగా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నినాదాన్ని చేపట్టడం రాజకీయంగా సరైన చర్యేనా అన్నది మొదటగా ఆలోచిం చాల్సి ఉంటుంది. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం వల్ల బీజేపీ మున్ముందు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? రాజకీయ రంగం నుంచి కాంగ్రెస్ మటుమాయం కావడం వల్ల బీజేపీ లబ్ధి పొందుతుందా? ఇది బీజేపీకి లాభమా, నష్టమా? సుమారు 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం దేశానికి మంచిదేనా?
అనేక రంగాల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైన మాట నిజమే. ఇందులో సందేహ మేమీ లేదు. అవినీతి, కుహనా లౌకికవాద విధానాలు, అసమర్థ పాలన వంటి ఎన్నో ప్రతి కూల అంశాలను ఈ పార్టీకి జోడిం చవచ్చు. ఈ అంశాలన్నిటితోనే బీజేపీ ఆ చరిత్రాత్మక పార్టీని జాతీయ స్థాయిలోనే కాక, అనేక రాష్ట్రాల లోనూ ఓడించింది. అయినప్పటికీ, ఆ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నాలు చేయడం దేని కో అర్థం కావడం లేదు. బీజేపీకి సంబంధించినంత వరకు ఈ లక్ష్యం ఎంతో ఉదాత్తమైనదిగా కనిపించవచ్చు. దేశవ్యాప్తంగా ఎదగాలన్న బీజేపీ ఆశయానికి ఇది ఆసరాగా ఉండవచ్చు. కానీ, ఈ సంద ర్భంగా బీజేపీ ఒక్క నగ్న సత్యాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంది. జాతీయ రాజకీయ రంగం నుంచి కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతే, ఒక పెద్ద శూన్యం ఏర్పడుతుంది. ప్రధాన ప్రతిపక్షం స్థానం నుంచి కాంగ్రెస్ నిష్క్రమించే పక్షంలో ఆ శూన్యాన్ని మరో పార్టీ భర్తీ చేస్తుంది. జాతీ య దృక్కోణం నుంచి అవలోకిస్తే, ఆ పార్టీ కాంగ్రెస్ కంటే ప్రమాదకారి, విషతుల్యం కావచ్చు. ఆ పార్టీ ఎటువంటిదో, ఎలా ఉండబోతుందో చెప్పలేం. పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందం అవుతుందేమో ఊహించలేం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలతో సహా కొన్ని రాష్ట్రాల లో ఇదే విధంగా జరిగింది. ఆ రాష్ట్రాలలో అధికారానికి వచ్చిన పార్టీలు ఓటర్లను, ప్రజల ను ఆకట్టుకోవడానికి యథేచ్ఛగా ఉచితాలను పంచిపెడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైపో తున్నా వాటికి పట్టడం లేదు.
సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఈ సమస్యతో మనకు సంబంధం ఏమిటని కొన్ని పార్టీలు ఆలోచిస్తే ఆలోచించవచ్చు. ఈ రకం పార్టీ లు వెనుకా ముందూ చూడకుండా, పర్యవసానాలను పట్టించుకోకుండా దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నాయి. ఉదాహరణకు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా వె రూపాయల చొప్పున ఇస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వాగ్దానం చేసింది. పంజాబ్లో ఆ
పార్టీ ఇదే వాగ్దానంతో అధికారంలోకి వచ్చింది. ఇలా నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడ మనేది లంచం కిందకే వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం పడుతుందో ఆ పార్టీ నాయకులు ఆలోచించినట్టు కనిపించడం లేదు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూ 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని, ఉచితంగా నీటి సరఫరా చేస్తామని కూడా ఆప్ ప్రకటించింది. ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయడం వల్ల 1,800 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం ఇప్పటికే 2.70 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. వార్షికాదాయంలో 20 శాతాన్ని వడ్డీ కింద జమకడుతోంది.
ఈ పరిస్థితికి ఇకనైనా అడ్డుకట్ట వేయని పక్షంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాల వడం ఖాయం. దా దాపు ప్రతి ప్రభుత్వమూ పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తూ, అప్పులు చేస్తూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థితికి చేరుకుంటుందో ఆలోచించాలి. గుజరాత్ ఎన్ని కలతో తన ఓట్ల వాటాను 13 శాతానికి పెంచుకు ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరిం చింది. ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్ ఓట్ల వాటా 6 శాతాన్ని మించిపోయింది. పైగా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతున్నందు వల్ల, ఆ స్థానా న్ని తాము భర్తీ చేయబోతున్నామని కూడా ఆ పార్టీ చెప్పుకుంటోంది. దీని పర్యవసానాలు ఎలా ఉండబో తున్నాయో, జాతీయ స్థాయిలో ఏం జరగబోతోందో బీజేపీ లోతుగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాల్సి న అవసరం ఉంది. ఆ పార్టీలో నెహ్రూ-గాంధీల ప్రాభవం, ప్రాధాన్యం, ప్రాబల్యం తగ్గుతున్న స్థితిలో, వెనుకటి తరం నాయకులంతా వెనుకడుగు వేస్తున్న పరిస్థితిలో బీజేపీ పునరాలోచన చేయడం మంచిది.
కాంగ్రెసుకు గుణపాఠం ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆ పార్టీ కూడా ఒకటి రెండు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. మూడు రా ష్ట్రాలలో ఎన్నికలు జరిగే ముందు కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా నెహ్రూ-గాంధీ వంశం బయట నుంచి ఓ వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారు. గత అక్టోబర్లో మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్షుడయిన తర్వాతే మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. మరో ముఖ్యమైన విష యమేమిటంటే, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన నాయకులు ఎవరూ ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. ‘భారత్ జోడో యాత్ర’లో ఉన్న రాహుల్ గాం ఢీ ఒకే ఒకసారి గుజరాత్లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్లో ఒకటి రెండు సభల్లో మాత్రమే పాల్గొన్నారు. అంతే తప్ప, ఎన్నికల ప్రచారానికి సారథులుగా వ్యవహరిం చలేదు. ఈ రాష్ట్రాలలో స్థానిక నాయకులు వ రాత్రమే స్థానిక సమస్యలతో ప్రచారం నిర్వహించారు. సావర్కార్ గురించో, ఆరెస్సెస్ గురించో ఎవరూ మాట్లాడలేదు. పార్టీ జాతీయ స్థాయి నాయకులెవరూ ఆ ప్రచారంలో పాల్గొనకుండా, పూర్తిగా రాష్ట్ర నాయకు లకే ప్రచార బాధ్యతను అప్పగించడం గమనించాల్సిన విషయం.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినంత వరకూ, ఈ పార్టీ యథేచ్ఛగా ఉచితాలు ప్రకటించి, వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చే ప్రయత్నం చేసింది. జాతీయ స్థాయి ఆర్థిక ఆ పార్టీకి ఏమీ పట్టలేదు. కొన్ని ప్రచార సభల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి వ్యవస్థ గురించి అరవింద్ కేజ్రివాల్ ‘సొంత డబ్బా కొట్టుకోవడం ఆయనలోని అహంకారానికి, మిడిసి పాటుకీ అద్దం పట్టింది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లకు మించి రావని ఆయన ఓ టీవీ షోలో ప్రకటించారు. అదే విషయాన్ని ఓ కాగితం మీద రాసి, య ూంకర్కి అందించారు కూడా. తీరా ఆ ఎన్నికల్లో బీజేపీకి 104 స్థానాలు లభించాయి. ఆయన పార్టీ 134 సీట్లతో అధికారం చేపట్టింది. మరొక టీవీ షోలో ఆయన గుజరాత్లో తమ పార్టీ అధికారానికి వస్తుంద ని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయనకు వాస్తవ పరిస్థితులతో సంబంధం లేదని, గొప్పలు చెప్పుకోవడం, మిడిసిపడడం ఆయనకు బాగా అలవాటని వీటిని బట్టి అర్థమవుతోంది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News