Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Can PM Modi achieve all the targets?: నరేంద్ర మోదీ అనుకున్నవి సాధించగలరా?

Can PM Modi achieve all the targets?: నరేంద్ర మోదీ అనుకున్నవి సాధించగలరా?

భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది, ఎలా పాలించబోతోంది, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందా అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల నా వ్యవహారాల్లో మార్పులు తీసుకు వస్తారా, ప్రజలకు ఇచ్చిన హామీలను, చేసిన వాగ్దానాలు నెరవేర్చగలరా అన్న ది ప్రశ్నార్థకమైంది. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం తేలికే కానీ, అవే చివరికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఒక విధమైన సంక్షోభాన్ని సృష్టిస్తాయి. వాగ్దానాలు నెరవేర్చిన ప్పుడు ప్రజల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తాయి. వాటిని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు నిరాశా నిస్పృహలు ఆవరి స్తాయి. తమ పట్ల ప్రజల దృష్టి కోణం ఎప్పటికప్పుడు మార డాన్ని పాలకులు తప్పనిసరిగా అంచనా వేస్తూనే ఉండాలి. తదుపరి ఎన్నికల్లో గెలుస్తామా లేక ఓడిపోతామా అన్నది అదే నిర్ణయిస్తుంది. వాగ్దానాలు చేయడమంటూ జరిగిన ప్పుడు వాటిని తప్పకుండా నెరవేర్చడమే మంచిది.
మోదీ నాయకత్వంలో బీజేపీ కొన్ని సంచలనాలు సృష్టించింది. కేరళలో ఖాతా తెరవడంతో పాటు, ఒడిశాలో అధికారానికి వచ్చింది. ఇప్పుడిక మోదీ తాను ఎన్నికల ప్ర చారంలో ప్రకటించిన గ్యారంటీలను నెరవేర్చాలని ఆయన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, శత్రువులు వెయ్యి కళ్లతో ఎదురు చూడడం సహజం. తాను ప్రకటించిన గ్యారంటీల్లో ఒక్కదాన్ని సవ్యంగా, సంతృప్తికరంగా నెరవేర్చినా ప్రజలకు ఆయన పట్ల అభిమానం పెరిగే అవకాశం ఉంటుంది. 2014 నుంచి మోదీ ప్రాధాన్యం, ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయిదు అగ్ర స్థాయి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కూడా ఒకటి. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇది. ఆవిష్కా రాల్లోనూ, టెక్నాలజీలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అంతర్జాతీయంగా ఏ సమస్య గురించి చర్చించాలన్నా, ఏ అంశం మీద సదస్సు జరిగినా భారతదేశం తప్పకుండా అందులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటినీ నిల బెట్టుకోవాలన్న పక్షంలో మోదీ తన ప్రాబల్యాన్ని మరిం తగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
విమర్శలకు సమాధానం
ఊకదంపుడు ఉపన్యాసాలకు, శుష్కప్రియాలు, శూన్యహస్తాలకు ఇది సమయం కాదు. తన పదేళ్ల పాలనా కాలంలో ఆయన కుహానా లౌకికవాదాన్ని ప్రజలకు విప్పి చెప్పడంలో కృతకృత్యులయ్యారు. ఇది ఎన్నికల్లో ఆయనకు అత్యధిక ప్రయోజనాలను సంపాదించిపెట్టింది. దాదాపు సగం దేశం ఆయన వాదనను అర్థం చేసుకుని, కాషాయా నికే పట్టం కట్టింది. అయితే, హిందుత్వ విషయంలో ఇక పంతాలు, పట్టింపులు పెట్టుకోవద్దని ఆయన సహచరులు, సన్నిహితులు ఆయన నచ్చజెప్పడం ప్రారంభం అయింది. ఆయన ఇక తాను ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చ డం మీద దృష్టి పెట్టడం మంచిది. తనకు నమ్మకస్తులైన మంత్రులు, అధికారులతో వాటిని ఎంత వీలైతే అంత అమలు చేయించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్‌, గరిష్ఠ పాలన-కనిష్ఠ ప్రభుత్వం వంటి హామీలు ఇప్పటికే దేశ రాజకీయాలను చాలావరకు మార్చేశాయి. వాటిని వంద శాతం స్థాయికి తీసుకు వెళ్లడం మీద దృష్టి పెట్టడం మంచిది. అభివృద్ధి పథంలో దూసుకు పోతున్న భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా మారలేకపోతున్న ఉన్నతాధికా రుల దృష్టి కోణాన్ని మార్చడం మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
నిజానికి, ఈ కీలక అంశాల మీద మోదీ ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోయారు. కొద్దిగా కూడా వీటిని పర్యవేక్షించ లేకపోయారు. ‘వ్యాపారాలు చేయాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు. పాలన ఎక్కువగా ఉండాలి. ప్రభుత్వ ప్రమే యం తక్కువగా ఉండాలి. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పటికీ, పాలన మాత్రం అంతంత మాత్రంగా ఉంటూ వస్తోంది. ప్రభుత్వ పరిమాణం గురించి ఆలోచిం చడమే జరిగింది తప్ప, నాణ్యత గురించి ఆలోచించడం జరగలేదు’ అని మోదీ ఒక సందర్భంలో అన్నారు. అయితే, ఈ పదేళ్ల కాలంలో ఆయన ప్రభుత్వ పరిణామం కూడా పెరిగిపోయింది. జీడీపీ కంటే వ్యయం పెరిగి పోతోంది. ఇక 2023లో రూ. 2.80 లక్షల కోట్లున్న జీత భత్యాలు 2025 నాటికి రూ. 3.00 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా 31 లక్షల నుంచి 35 లక్షలకు పెరిగిపోయింది. మరొక విచిత్రమైన అంశం ఏమిటంటే, టెక్నాలజీలో భార తదేశం ఇతర అనేక టెక్నాలజీ దేశాలతో పోటీ పడు తున్నప్పటికీ, భారత ప్రభుత్వం తనకు అవసరమైన టెక్నా లజీని దిగుమతి చేసుకుంటోంది. టెక్నాలజీ సంబంధమైన పనులు చేయడానికి ప్రభుత్వం ఇతరుల సేవలను విని యోగించుకోవడం జరుగుతోంది.
పాత పాలనకు చెల్లు చీటీ
అతి పెద్ద ప్రభుత్వం ఉండడమనేది మోదీ హయాంలో క్రమంగా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సంకీర్ణ ప్రభు త్వంలో కూడా దీని పరిమాణం తగ్గలేదు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో 30 మంది క్యాబినెట్‌ మంత్రులున్నారు. అయిదుమంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మం త్రులున్నారు. మరో 41 మంది సహాయ మంత్రులున్నారు. వీరి జీతభత్యాలు కాకుండా, ఒక్కొక్కరి సిబ్బంది మీదే అద నంగా నెలకు కోటి రూపాయలకు పైగా వ్యయం అవు తోంది. కేంద్రంలో మొత్తం 53 మంత్రిత్వ శాఖలు, 80 విభాగాలు పనిచేస్తున్నాయి. విచిత్రమేమిటంటే, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, చిన్న పరిశ్రమల మంత్రిత్వ శాఖ, విద్యుత్‌ శాఖ, రెన్యూ వబుల్‌ ఎనర్జీ శాఖ, విద్యాశాఖ, నైపుణ్యాల అభివృద్ధి శాఖ అంటూ ఒకే అంశానికి సంబంధించి మూడు నాలుగు మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి. కొందరు మంత్రులకు అనేక శాఖలుండడం కూడా జరుగుతోంది. ఈ శాఖలన్నిటికీ కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యద ర్శులు, ఇతర సిబ్బంది ఉంటారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో కేంద్రంలో ఒక సామ్రాజ్యమే ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో కార్యదర్శి స్థాయి అధికారుల సంఖ్య యాభై శాతానికి పైగా పెరిగిపోయింది.
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మోదీ చాలా ఏళ్ల క్రితం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్ర మానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా సినిమా తారలను, పారి శ్రామికవేత్తలను, క్రికెటర్లను, వాణిజ్య వేత్తలను, ఇతర ప్రముఖులను ఎంపిక చేయడం జరిగింది. వీరందరి మీద ఊహించని స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ ప్రము ఖులంతా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్‌ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. భారత్‌ స్వచ్ఛమైన, పరిశుద్ధమైన దేశమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి ప్రధాని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, ఈ ప్రముఖులెవరికీ దీని పట్ల ఆశించిన ఆసక్తి లేదని కొద్ది కాలంలోనే తేలిపోయింది. చివరికి ప్రభుత్వానికి కూడా దీని మీద ఆసక్తి సన్నగిలినట్టు కనిపిస్తోంది. ఇటువంటి కార్యక్రమంలో స్థానిక సంస్థలకు, ప్రజా ప్రతినిధులకు, పురపాలక సంఘాలకు ప్రమేయం కల్పించడంలో ప్రభు త్వం విఫలమైనట్టు ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది.
నినాదాలకు తిలోదకాలు
ఇక దేశంలోని అనేక నగర పాలక సంస్థలు అవినీతికి నిలయాలుగా మారిపోయాయి. ఇవి సాలీనా సమర్పించే బడ్జెట్లు రాష్ట్రాల బడ్జెట్‌ మొత్తాలకంటే ఎక్కువగా ఉంటు న్నాయి. నగర పాలక సంస్థల్లోని ప్రజా ప్రతినిధులు, అధి కారులు, పారిశుద్ధ్య అధికారులంతా కుమ్మక్కయి, స్వచ్ఛ భారత్‌ నిధులను భారీ స్థాయిలో దుర్వినియోగం చేస్తు న్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. చెత్తను తొలగిం చడం, దాన్ని రీసైక్లింగ్‌ చేయడం వంటివి పారిశుద్ధ్యాన్ని పెంచడంతో పాటు వ్యాపార పరంగా కూడా ప్రజలకు ఉపయోగపడాల్సింది. నిజానికి దీనివల్ల ఉపాధి అవకా శాలు పెరుగు తాయి. కొత్త టెక్నాలజీ ప్రవేశించడానికి అవకాశం ఉండేది. దీని మీద పెట్టుబడులు పెరగడానికి కూడా అవకాశం ఉండేది. అయితే, అటువంటిదేమీ జరగ లేదు. పారిశుద్ధ్యం పరిస్థితి యథాతథం గానే ఉంది కానీ, నయా సంపన్నులు మాత్రం పుట్టుకొచ్చారు.
బీజేపీ నాలుగవ పర్యాయం అధికారంలోకి రావా లన్న పక్షంలో మోదీ ఈసారి కొత్త అవతారం ఎత్తాలి. ఇప్పటి వాగ్దానాలు, నినాదాలతో జనం మొహం మొత్తి పోయినట్టు కనిపిస్తోంది. అయిదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కృషి చేస్తున్న భారతదేశంలో ఆశిం చిన మార్పులు జరగాలన్న పక్షంలో మోదీ మనస్తత్వం, మోదీ దృష్టి కోణం తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది. మోదీ తన గ్యారంటీలను నెరవేర్చడంతో పాటు, గత రెండు ఎన్నికల్లో తాను చేసిన ఇతర వాగ్దానాలను కూడా సాధ్యమైనంత త్వరలో నెరవేర్చడం మంచిది.

  • వి.వి. రామానుజం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News