Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Can TDP gain back in Telangana: తెలంగాణ కోటలో టీడీపీ పాగా వేస్తుందా?

Can TDP gain back in Telangana: తెలంగాణ కోటలో టీడీపీ పాగా వేస్తుందా?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందా? ఏవైనా ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరుస్తుందా? పూర్వ వైభవం సంతరించుకుంటుందా? ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నగరంలో అడుగుపెట్టినప్పుడు చాలామంది మనసుల్లో రేకెత్తిన ప్రశ్నలివి. ఆయన ఇక్కడకు వచ్చినప్పుడు నగర వాతావరణం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. బేగంపేట విమానాశ్రయంలో ఆయన దిగినప్పటి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లే వరకు వేలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా తెలుగుదేశం పార్టీ బ్యానర్లు, జెండాలు, పోస్టర్లు వెల్లువెత్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన ఉత్సాహభరిత వాతావరణం మళ్లీ ఇప్పుడు కనిపించింది. నగరంలో పలు చోట్ల వాహనాల రాకపోకలు స్తంభించిపోవడమే కాకుండా, నగర జీవితం కూడా స్తంభించిపోయినట్టనిపించింది. బహుశా చంద్రబాబు నాయుడుకు కూడా వెనుకటి రోజులు గుర్తుకు వచ్చి ఉంటాయి. తన హయాంలోనే నగరం ఐ.టి రంగంలోనే కాక ఇతరత్రా కూడా అభివృద్ధి చెంది నందువల్ల తనకు మళ్లీ తెలంగాణలో అవకాశం ఉందా అని కూడా ఆయన ఆలోచించి ఉంటారు.
తనకు అత్యంత సన్నిహితుడైన రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం, తనకు రాజకీయంగా బద్ధ శత్రువైన కె. చంద్రశేఖర్‌ రావు చప్పగా చతికిలబడిపోయి ఉండడం, తనను జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించినప్పుడు నగరంలోనే కాక, తెలంగాణ వ్యాప్తంగా అభిమానం, సానుభూతి, మద్దతు వెల్లువెత్తడం వంటి కార ణాలు ఆయనలో కొత్త ఉత్తేజాన్ని నింపినట్టు, తెలంగాణ విషయంలో ఆయనకు సానుకూలతలు పెంచినట్టు కనిపి స్తోంది. ఓటుకు నోటు కేసుతో తనను జైలు పాలు చేసిన చంద్రశేఖర్‌ రావు మీద పగ సాధించడానికి తపించి పోతున్న రేవంత్‌ రెడ్డి ద్వారా తెలంగాణలో అడుగు పెట్టడా నికి ఆయన అవకాశాలను అన్వేషించే అవకాశం ఉంది. చంద్రశేఖర్‌ రావు మీద చంద్రబాబు నాయుడుకు కూడా మనసులో ఆగ్రహా వేశాలు రగులుతూనే ఉన్నాయి. తనను ఇబ్బందుల పాలు చేసిన చంద్రశేఖర్‌ రావు మీద ఆయనకు ఎటువంటి సానుభూతీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా జగన్మోహన్‌రెడ్డితో కలిసి చంద్రశేఖర్‌ రావు ఆంధ్రప్రదేశ్‌ లో తనను ఓడించిన విషయం కూడా ఆయన మరచిపోలేదు. తనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న చంద్రశేఖర్‌ రావుకు తానే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని చంద్రబాబు తపించి పోతున్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ముఖ్య మంత్రులుగా ఒక వెలుగు వెలుగు తుండగా, చంద్రశేఖర్‌ రావు తన పార్టీని కాపాడుకోవడానికి అవస్థలు పడడం జరుగుతోంది.
అనుకూల పరిస్థితులు
చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నగరంలో ఉన్నప్పుడు, అంతవరకూ బోసిపోయి ఉన్న ఎన్‌.టి.ఆర్‌ భవన్‌ లో ఒక్కసారిగా సందడి పెరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయ మైన ఎన్‌.టి.ఆర్‌ భవన్‌ గత పదే ళ్లుగా దాదాపు నిర్మానుష్యంగా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మళ్లీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అది కార్యకర్తలు, నాయకులు, సందర్శకులతో కళకళలాడు తోంది. 2023లో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చంద్రబాబు సిద్ధపడక పోవడంతో ఇక్కడ సందడి తగ్గిపోయింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, తెలంగాణలో బి.ఆర్‌.ఎస్‌ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడానికి రేవంత్‌ రెడ్డి కంకణం కట్టుకోవడం, ఆయన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రే అయిన ప్పటికీ, చంద్రబాబుకు పూర్తిగా అనుకూలంగా ఉండడం వంటి కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నట్టు పార్టీ నాయ కుల్లో ఒక భావన ఏర్పడింది.
అయితే, దాదాపు పదేళ్లుగా తెలంగాణలో ఐ.సి.యు లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జెండా ఎగరేయడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. తెలంగాణలో పార్టీ బలం పుంజుకోవాలన్న పక్షంలో ఆయన మళ్లీ పునాదుల స్థాయి నుంచి ప్రయత్నాలు ప్రారం భించాలి. హైదరాబాద్‌ లో 2025లో జరగబోయే నగర పాలక సంస్థ ఎన్నికల్లో పాల్గొనాలని పార్టీ నాయకులు పలువురు భావిస్తున్నారు. చంద్ర బాబు పార్టీ గనుక ఈ ఎన్నికల్లో పాల్గొనే పక్షంలో ఆయన పార్టీకి ఇక్కడ ఉన్న బలం ఏమిటనేది బయటపడుతుంది. అయితే, దశాబ్దం క్రితం తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన చంద్ర బాబు నాయుడును ఇక్కడి ప్రజలు అంత తేలికగా మరచి పోతారా అన్నది కీలక ప్రశ్న. చంద్రబాబు తెలంగాణ వ్యతి రేకి అని, ఆయన తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకో లేదని అప్పట్లో బి.ఆర్‌.ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌ రావు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు.
ప్రతికూల అంశాలు
పైగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడుగు పెట్టడం వల్ల బి.ఆర్‌.ఎస్‌ మళ్లీ జవజీవాలు కూడ గట్టుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చే పక్షంలో తెలంగాణమీద మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ నాయకుల పెత్తనం పెరుగుతుందని, తెలంగాణలో 2014 ముందు నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని చంద్రశేఖర్‌ రావు ప్రచారం చేసి ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. తెలంగాణ జిల్లాలకు చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందనే ప్రచారంతోనే చంద్రశేఖర్‌ రావు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆం ధ్రాకు వ్యతిరేకంగానే ఆయన తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకుని, చివరికి ముఖ్యమంత్రిగా కూడా అధి కారంలోకి రావడం జరిగింది. అయితే, తెలంగాణ ఏర్ప డిన మొదటి దశాబ్దంలో ఉన్నంత తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. తెలంగాణ సెంటి మెంటు ఇంకా అదే స్థాయిలో ఉండి ఉంటే చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం గత డిసెంబర్‌ శాసనసభ ఎన్నికల్లో అపజయం పాలయ్యేది కాదు.
నిజానికి 2023 డిసెంబర్‌ ఎన్నికల నాటి పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణలో లేదనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు కానీ, పవన్‌ కల్యాణ్‌కు చెందిన జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి దెబ్బతిన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ కూటమికి మద్దతు నివ్వడం జరిగింది. అయితే, ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయ కుల్లో ఆశావహ పరిస్థితి ఏర్పడింది. వారిలో ఆశలు చిగు రించాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరోసారి ప్ర యత్నించడం మంచిదన్న అభిప్రాయం కలిగింది. ఆంధ్ర ప్రదేశ్‌లో మాదిరిగానే తెలంగాణలో కూడా బీజేపీ, జన సేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ఉప యోగం ఉంటుందనే అభిప్రాయం కూడా తెలంగాణ తెలు గుదేశం పార్టీ నాయకులకు కలుగుతోంది. ఇటీవల చంద్ర బాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లో సమావేశం కావడం కూడా ఇదే ఉద్దేశంతోనే అని బి.ఆర్‌.ఎస్‌ నాయ కులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు సమస్యల పరిష్కారానికి కమిటీలను నియమించ డంతో చేతులు దులుపుకున్న ఈ ఇద్దరు నాయకులు బి.ఆర్‌.ఎస్‌ పార్టీకి పోటీగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునరు ద్ధరించాలన్న ఆలోచన చేసినట్టు బి.ఆర్‌.ఎస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి కష్టమే!
తెలంగాణలో బి.ఆర్‌.ఎస్‌ పార్టీని మట్టుబెట్టి తెలుగు దేశం పార్టీని అభివృద్ధి చేసే పక్షంలో ఇక్కడ త్రికోణ పోటీ లు ఏర్పడి తాము లబ్ధి పొందే అవకాశం ఉంటుందని, ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరు తుందని రేవంత్‌ రెడ్డి భావి స్తున్నారు. పైగా, బి.ఆర్‌.ఎస్‌తో ఉన్నంత సమస్య తమకు తెలుగుదేశం పార్టీతో ఉండే అవకాశం లేదని, తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చడానికి ఉపయోగపడుతుందే తప్ప అధి కారానికి వచ్చే అవకాశం లేదనేది కూడా కాంగ్రెస్‌ అభిప్రా యంగా కనిపిస్తోంది. బి.ఆర్‌.ఎస్‌ అధికారంలో ఉండగా, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులనే తమ పార్టీలోకి లాక్కో వడం జరిగింది. ఇప్పుడు ఆ నాయకు లంతా బి.ఆర్‌.ఎస్‌ నుంచి బయటపడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, దీనివల్ల బి.ఆర్‌.ఎస్‌ మరింతగా బలహీనపడుతుందని కూడా కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బి.ఆర్‌.ఎస్‌ పార్టీలో పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ మూలాలు కలిగినవారే. వారు కాంగ్రెస్‌లో చేరినా, తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చినా బి.ఆర్‌.ఎస్‌ పార్టీ కుప్పకూలడం తథ్యం.
ఇక 2014 ముందునాటి మాదిరిగా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో బద్ధ శత్రువులేమీ కాదు. కాంగ్రెస్‌ వ్యతిరేకతతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓ మిత్రపక్షంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం బలం లేనట్టే, ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం బలం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బలపడడానికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడడా నికి, ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.ఆర్‌.సి.పిని బలహీనపరచ డానికి, తెలంగాణలో బి.ఆర్‌.ఎస్‌ ను బలహీనపరచడానికి రేవంత్‌ రెడ్డి, చంద్రబాబుల స్నేహం అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయే ముందు, విడిపో యిన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లు తనకు రెండు కళ్లలాంటివని చెబుతుండేవారు. ప్రస్తుతం ఆయన ఈ రెండు రాష్ట్రాల మీదా రెండు కళ్లు వేసి ఉంచారు.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News