బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాలలో ప్రధానో పాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. పిల్లలతో కలసి పోయి వారి ఇష్టాలకు తమ అనుభవాలు జోడించు కుంటూ చాలా కధలు రాశారు. పిల్లల స్థాయికి కథలు రాయాలి. మనకధలు పిల్లలు ఆనందించేవిగా వుండాలి.పెద్ద వాళ్ళ మెప్పు కోసం కాదు అంటారు. ఈ కధలు చదివిన పెద్ద వాళ్లకు మూర్తి అనుభూతులు బాగా అర్ధం అవు తాయి. సరదా సమాధానాలు ప్రతీ కధలోనూ కనీసం ఒక ప్రశ్న – సమాధానం దొరుకుతూనే వుంటాయి.
ఈ కథల్లో బావమరదళ్ళ సరదా సంభాషణ, పద పూరణలు, అలవాటులో పొరపాటు,పెద్దవాళ్ళు కొడుకు కోడలుతో జీవించే విధానం, నిత్యజీవితంలో తప్పుడు లెక్క లు. భార్యాభర్తల మధ్య అవగాహన మొదలగు విషయాలు కొన్ని ప్రత్యక్షం గాను కొన్ని పరోక్షంగాను పిల్లలకు తెలి యజేస్తారు. అంతేకాదు, పదపూరణలు, నీతిబోధలు, లెవికి ప్రశ్తోపాటు రాజుల కధలు, కుటుంబ కథలూ కూడా ఉన్నాయి. ‘సరదా సమాధానాలు’ కథల సంపుటి లో మొత్తం 38 కథలు ఉన్నాయి. 2020లో ప్రచురింప బడింది. ఇది ఎన్.వి.ఆర్.సత్యనారాయణ స్వీయ ప్రచు రణ. ఈరోజు మనం ఈ సంపుటిలోని కొన్ని కథలను పరిశీలిద్దాం.
ఇవన్నీ హాస్య కథలే.!
ఎలా వచ్చావురా అని మామయ్య అడిగితే.. బస్సు మీద వచ్చేను అంటాడు. ఏం బస్సులో ఖాళీలేదా అని కొంటెగా ప్రశ్నిస్తుంది మరదలు. ఇలాంటి సంభాషణలతో సరదాగా సాగుతుంటాయి ‘సరదా సమాధానాలు’ కథల్లో. ప్రతి కథలోనూ చదవడం మొదలు పెట్టేప్పటి నుంచి తరు వాత ఎలా ఉంటుందో అనే ఉత్కంఠను కలిగించారు.
పిల్లలు తెలివిగా వేసే ప్రశ్నలు వింటూ ఉంటే వారి ఆలోచనాధోరణి ఎవరికైనా ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తూ ఉంటుంది. మీరు వేసే ప్రశ్నలకు జవాబులు అసంభవాలు కావాలి.. అని మాస్టారు అంటే… మెత్తని కత్తి ఇస్తే పీక కోసి.. ఇస్తాను అంటుంది పద్మిని.
తీపి వేపపిక్కను తెస్తే దానితో ఇనుమును బంగారం గా మార్చేస్తాను.. అంటాడు నాగార్జున. వినే చెవిటి వాడుం టే నా గొప్పలు వినిపిస్తాను.. అంటాడు శివ. ఇలా మరి కొన్ని ప్రశ్నలతో సాగుతుంది.. ఈ ‘సంభవాలు కాని అసం భవాలు’ కథ
మాస్టారు పిల్లలచేత తమాషాగా పదపూరణలు చేయిస్తారు. బురదలో జారి పడితే మక్క విరుగుతుంది అంటాడు ఒకడు. పరుపు మీద పడుకో బెడితే పిల్లవాడు పక్క తడుపుతాడు.. అని ఇంకొకరంటారు. వాడు తైతక్క లాడుతున్నాడు అంటాడు మరోడు. చివరిగా అలేఖ్య అనే అమ్మాయి ఆడవాళ్ళ పేర్లతో సందర్భానికి తగినట్లుగా కామక్క, సీతక్క, పాపక్క పేర్లు చెప్పడం తో ‘పక్క మక్క తక్క..’ అనే ఈ కథ ముగుస్తుంది
‘అలవాటులో పొర పాటు…’ కథలో కూరలు అమ్మే మనిషి సొరకాయలు, వంకాయలు, కేబేజీలు… అని అరు స్తూ వెలుతోంది.. ఒకామె పిలిచి సొరకాయలెంత.. అని అడిగితే.. లేవు అంది. రోజూ తెచ్చే అలవాటులో ఈ పొర పాటుగా అరిచినందుకు ఆడవాళ్లంతా నవ్వుకుంటారు. ఇదీ సారాంశం. అలవాటులో పొరపాటు ఎవరికైనా సహజమే కదా!
తల్లిని పిల్ల అసూయ అంటే ఏమిటి అని అడుగు తుంది. తండ్రి వచ్చి ఇద్దరు కూతుళ్లకు చెవిరింగులు చూపి అవి ఏవి ఎవరికో చెప్పాడు. తక్కువ వెలది తనకి ఇచ్చారని చెల్లెలు పేచీ పెడితే ఇదే అసూయ అని తల్లి చెపుతుంది. ఇవి మీకు కాదు. నాస్నేహితుడికి అని చెప్పడంతో కథ తమాషాగా ముగుస్తుంది. అసూయకి అర్ధం ప్రత్యక్షంగా తెలుస్తుంది. తెలియజేప్పిన విధానం బాగుంది.
పై కథ పేరు.. ‘అసూయ ’
తరువాత ‘ సరదా సమాధానాలు..’ కథలో బా. వ అంటే బారు వడ్డీ అని చ. వ అంటే చక్ర వడ్డీ అని నవ్విస్తూ పోగాలములో చేపలు పట్టేది గాలము అని పిల్లలచేత చెప్పిస్తారు మాస్టారు.
క్రికెట్ బాగా ఆడే వాడు క్రికెట్‌లో అవుట్ అయితే తినలేనిది తిన్నాడు.. అంటే కంగు తిన్నాడని పిల్లల చేత చెప్పిస్తారు. అలాగే వరుసగా పది అంకెల తరువాత జాకీ. రాణి. రాజు అని పిల్లలు చెపితే అవి తేలుసుకోవచ్చు కాని జూదం వల్ల చెడిపోతారని చెపుతారు. పై చదువులలో వీటి జ్ఞానం అవసరం అని పరోక్షంగా చెప్పినట్లే!
క్లాసులో ఇద్దరు పడితే వారికి శిక్ష వేశారంటే కబుర్ల లో పడ్డారని పిల్లలచేత చెప్పిస్తారు. ఇలా సరదా సమాధా నాలు సరదా, సరదాగ ఉంటాయి.
‘తప్పుడు లెక్కలు’ అనే కధలో..
నీకు పదిసార్లు చెప్పా ను, వందసార్లు చెప్పాను, లక్షసార్లు చెప్పాను.. అని అరు స్తూ వుంటారు కదా.. తీరుబడిగా ఆలోచిస్తే ఈ ‘తప్పుడు లెక్కలు’ నవ్వు పుట్టిస్తాయి.
అత్తకు నచ్చిన చీరే కోడలు కొనుక్కో నక్కరలేదు. అత్త సంగీత కచేరికి వెళితే కోడలుకు ఇష్టం లేకపోతే వెళ్ళ నక్కరలేదు. కొడుకు, కోడలు తమకు ఇష్టము వచ్చిన పని చేసుకుంటే నష్టం లేనపుడు జోక్యంచేసు కో కూడదు. అని ఇంటికి పెద్దాయన తనభార్యకి నచ్చచెపుతాడు. ఇది ‘అడ్డల్లో బిడ్డలు’ కథా సారాంశం.
రాజు రమానాధుడు, మంత్రి దేవి ప్రియుడు.. మారు వేషం లోవెళ్ళినప్పుడు ఒకయువతి తనస్నేహితురాలు ఒక శవాన్ని చూసి ఎవరో పోయినట్లుంది అంటే ఎక్కడికి పోతారు రాత్రి పగలు అంటుంది ఆ యువతి. అ మాట లకు అర్ధం తెలియక అందరినీ విచారించి చివరికి ఆ యువతి ద్వారా జననం.. మరణం.. రాత్రిపగలు లాగేవచ్చి పోతూఉంటాయని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయిని పేరు అడిగితే మీరాజు,, మంత్రుల పేర్లులో మొదటి రెండు అక్షరాలు చూడమంటుంది. రమాదేవి ఆపేరు అని తెలుసు కుని ఆమెని సత్కరిస్తాడు రాజు. ఇది ‘తెలివికి సత్కారం’ అనే కథ.
86 మంది పిల్లలున్న తరగతిలో మీలో 20 మందికి ఇరవై దెయ్యం దెబ్బలు అని మాస్టారు చెపితే.. అల్లరి పిల్లలను శిక్షిస్తా రేమోనని పిల్లలు భయపడుతూ ఉంటారు. కాని తెలుగులో మంచి మార్కులు తెచ్చుకున్న మొదటి 20 మందికి ‘దెయ్యం దెబ్బ’ అనేకథల పుస్తకాలు పంచడంతో పిల్లల సరదాతో కధముగుస్తుంది. కధ పేరు.. ‘ఇరవై దెయ్యం దెబ్బలు’.
మరోకథ నవ్వించిన వెంకీ..
పిల్లలు పెద్దలకు తెలియ కుండా సెల్ ఫోన్లు తీస్తారు. చింటూ వాళ్ళ మామయ్య ఫోన్లో వెంకీ అనేపేరు చూసి వెంకీ పాటలనుకుని ఆన్ చేస్తే ఎవరో వ్యక్తి హలో అంటే చింటూ ఆపేస్తాడు.. అవతలి నుండి మూర్తికి ఫోన్ వచ్చి నువ్వు ఫోన్ చేసేవాఅని మిత్రుడు అడిగితే విషయం అర్ధమైఅందరు నవ్వుకుం టారు. నేటి పిల్లల సెల్ ఫోన్ సరదా తెలియజేసే కథ.
తరువాత కథ… రోగం ఒకటే.. ఏమిటి తేడా.. కష్టపడి పనిచేసుకుంటూ, చెడు అలవాట్లు లేనివానికి రోగానిరోధక శక్తీ ఉండి వేగంగా తగ్గవచ్చును రోగం. అదే ధన వంతు దైనా సిగరెట్లు త్రాగుతూ, తాగుడు అలవాటు ఉన్నవానికి,, వై ద్యుడు సూచించించిన నియమాలు పాటించని వానికి రోగం వేగంగా తగ్గదు. తనను ప్రశ్నించిన వైద్యుని ద్వారా ఈ విషయాలు తెలుసుకుని బుద్ధితెచ్చుకున్న వాని కథ ఇది.
తరువాత కథ నాకేమిటి తొందర..
దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలంటారు. ఒక ధనవంతుడు వ్యాపారంచేస్తూ దానధర్మాలు చెయ్యడు. ఒకసాధువు యాచనకు వస్తే ధనవంతుడై నవ్యాపారి ఇవ్వ దు. పక్కదుకాణం వాడు ఇస్తాడు.
కొంతసేపట్లో ప్రక్కదుకాణం వాడు గుండెపోటు వచ్చి చనిపోతాడు. అందరూ గుమిగూడి. పుణ్యాత్ముడు అనిత నిని పొగుడుతూవుంటారు. ఇది చూసిన దానధర్మాలు చేయని వానిలో మార్పు వచ్చి ఆరోజు నుండి తన సంపాదనలో కొంత దాన ధర్మాలకు వినియోగిస్తూ ఉంటాడు.
‘ఒకే లాంటి ఆలోచన’ కథలో
రంగడు మాంసాహారము సంపాదించాలని అడవికి వెళ్లి ఒకముని నుండి జంతువులు, పక్షుల భాష మాట్లాడ గలిగే శక్తి సంపాదిస్తాడు. దొరికిన కుందేలును బ్రతిమా లినా విడిచిపెట్టడు. ముందుకువెళ్లి పులికి ఎదురౌ తాడు. దానిని దయ చూపమంటే నీవు కుందేలుమీద దయ చుపాలి కదా,, నాఆహారం నేనువదులు కుంటానా, మీ భగవద్గీ తలో ఎవరిధర్మం వాళ్ళు పాటించాలి అన్నారు. కదా అని అతనిని పంజా తోకొట్టింది. చెట్టు మీద చిలకలు పులి వీడికి బాగాబుద్ధి చెప్పింది అనే మాటలు చనిపోతూ విన్నాడు. పక్షి భాష అతనికి అక్కరకు రాని విద్య అయిం ది. ఆహార విషయంలో ఇద్దరిదీ ఒకే లాంటి ఆలోచన.’
‘చేగోడీలు కోరినదెయ్యం’ కథలో
పార్వతమ్మ పిల్లలు పడుకున్నాక రాత్రి చేగోడీలు చేస్తూ ఉంటే దెయ్యం వచ్చింది. భయపడే పార్వతమ్మను భయపడకు నాకు పాతిక ఇస్తే తిని వెళతాను.. అని పనిలో సాయం చేసింది. అవిరుచి లేకుండా పార్వతమ్మ మోసం చేసింది. అయినాదెయ్యం, ‘ఆడినవాళ్లకు పెట్టడం మానవ ధర్మం. నీకు నేను పాతిక బంగారు నాణాలు ఇద్దాం అను కున్నాను. నువ్వుమోసం చేసినా క్షమిస్తున్నాను. అని ఒక నాణెం ఆమెముందు పడేసి మాయ మైంది. 24 నాణా లు నష్టం వచ్చింది అని బాధపాడుతూవుంటే ఆమెభర్త.. నీకు హాని కలిగించ కుండా హితబోధ చేసి వెళ్ళింది.. మంచి దెయ్యం లాగుంది. సంతోషించు.’ అన్నాడు.
ఆ తరువాత కథ.. మొక్కుబడి రహస్యం..
హనుమంతరావు బావమరిది రామం. రామానికి జ్వరం వచ్చి నప్పుడు భద్రాచలం మొక్కు పెట్టుకున్నానని చెప్పి అతని డబ్బులతో తనసరదా తీర్చుకుంటాడు హను మంతరావు.
మళ్ళీ రామంకి ప్రమోషన్ వచ్చి నప్పుడు తిరుపతి వెళ్లాలని మొక్కు కున్నానంటాడు హనుమంతరావు. ఈ రహస్యం తెలుసుకున్న రామం భార్యలక్ష్మి తిరుపతి వెళ్ళా క అన్నయ్యగారూ మీరు నడిచి కొండమీదికి వస్తారని మొక్కు కున్నాను అంటుంది. తేలుకుట్టిన దొంగలాగ చచ్చినట్లు నడిచి వచ్చి బుద్ధితెచ్చుకుంటాడు హనుమంత రావు.
‘సందిగ్ధం’ కథలో
ఒక అమ్మాయి తనచెల్లి తో 86ను తిరగేస్తే వచ్చే ఇంటిలో గాంధీ నగర్లో నాస్నేహితు రాలువుంది. ఆమెను అడిగి నోట్స్ పట్టుకు రమ్మంటుంది. చెల్లి వెళ్లి వాళ్ళు ఆయింట్లో లేరు అని తిరిగొచ్చి చెప్పింది. అసలు విషయం ఏమిటంటే 86ను తిరగేసి పట్టుకుని 98అనుకుంది చెల్లెలు. తిరగె య్యడం అంటే 68అని అక్క ఉద్దేశం.సూచనలో స్పష్టత లేకపోతే ఇలాంటివి జరుగుతాయి అని ఈతమాషా కధలో సందేశం ఉంటుంది.
‘ఆటలో ఏకాగ్రత’ కథలో
వార్షికోత్సవ సందర్బంగా పాఠాలు లేకుంటే.. మూర్తి గారు 9వతరగతికి వెళ్లారు. కొందరూపిల్లలు అలంకరణ, నాటికల అభ్యాసం, పాటల అభ్యాసం కోసం వెళ్లారు. మిగినవారితో మూర్తి లక్ష్య సాధనకు ఏ కాగ్రత కావాలని, అది సాధన వలన వస్తుందని చెబుతారు. ఉదాహరణగా అర్జునుడు గురించి చెపుతారు.
మీ ముత్తాత మాతాత మాతాత మీముత్తాత గబగబా పలకమని వాళ్లకు ఆటలాగా తోచేటట్లు చేస్తే.. ఒక అమ్మాయి… తానొకటి చెపుతుంది. గరజాల గిరిబాల ఉంగరాలు.. ఉంగరాల లింగరాజు గరజాలు అని గబగబా తడబడ కుందాచెప్పాలి. ఏవో పాతవే కాకుండా కొత్తగా ఇలాచెప్పగలిగిన ఆ అమ్మాయి సృజనాత్మక శక్తిని మెచ్చుకుంటారు.
‘ఉన్నవి… లేనివి’ కథలో
తిరుపతినుండి వచ్చి టీవీ చూస్తున్న తాతయ్య, మనవడితో, ఒరేయ్ టీవీ లో పాడేవాడికీ వుండి నాకులేనివి రెండు చెప్పు అంటాడు. వాడికి నోటిలో పండ్లు,బుర్రమీద జుత్తు తాతయ్యా అంటాడు. ఈసారి మనవడు, తాత య్యా.. మీయిద్దరికీ వుండి వ్యతిరేకంగా అనిపించేవేమిటో చెప్పు అంటే తాత చెప్పలేడు. అప్పుడు మనవడు కను బొమ్మలు తాతయ్యా వాడికి నలుపు వెంట్రుకలు నీకు తెలుపు. వ్యతిరేకమే కదా అంటాడు. ఇది పిల్లల పరిశీలనా విధానాన్ని తెలియ జేస్తుంది.
‘అప్పయ్యమ్మ.. ఉపాయం’ కథరో
రాజకుమార్తె జుత్తు సంరక్ష కులలో ఒకామె మరణి స్తుంది. ఆస్థానం లో పనిచెయ్యడానికి అప్పయ్యమ్మ అనే పల్లెటూరు మనిషి ఎంపికలో పాల్గొనాలని వస్తుంది. వేష భాషలు చూసి ఆమెను చూసినవారు నవ్వుకుంటారు. కాని అందరికంటే ఎక్కువపేలు అప్పయ్యమ్మే తనకు అప్పచెప్పిన పిల్ల తలలోనుండి తీసి ఆపని సంపాదిస్తుంది. మిగతావాళ్లు సాందర్యసాదనాలు వాడితే అప్పయ్యమ్మ వేప నూనె వాడింది. రాణీ వేపచెట్టు ఉపయోగాలు అందరికి చెప్పి ఆపనికి వచ్చిన మిగిలిన వాళ్ళను పంపించేస్తుంది. తరు వాత అప్పయ్యమ్మ నెల లోపే మంచి భాష మాట్లాడటం, అక్కడ మసలుకొనే విధానం నేర్చుకుని మంచి పనిమంతు రాలు అనిపించుకుంటుంది. చెట్లు ప్రకృతి మనకి ప్రసాదిం చిన వరం.. అని రాణీ మాటలద్వారా సందేశం పైకథ ద్వారా అందుతుంది
‘కోడలి సమాధానం’ కథలో
వ్యాపారి కనకయ్యకు అతని భార్య కళావతికి కొత్త కోడలు గంగామణి. ఆహార విషయంలో అత్తమామల అలవాట్లువేరు. వీరు తనకి ఒకసమస్య అనుకున్నా తెలివి గా వ్యవహరించుతుంది కోడలు. అది చూచి అందరూ ఉండగా మామగారు, మీ అత్త నేను ఏమిటి చెపితే దానికి సరేనని ఇద్దరికి చెపుతున్నావు. అంటే దానికి తగిన సమాధానం చెప్పి వారిని ఆనంద పడేటట్లు చేస్తుంది.
అమ్మాయీనీ తెలివి ఎటువంటిదో మేము పరీక్షిం చాము. అన్నిటికి గంగిరెద్దులా తల వూపుతూ వున్నట్లు నీవు నడుస్తున్నావు. ఏ పనిచేసినా ఎలాగ సమర్థించాలో నీకు బాగాతెలుసు. అన్నాడు మామగారు ఆనందం తో. ఇది అత్తమామల పరీక్షనా సమస్య తనతెలివి వల్ల పరిష్కరింపబడినందుకు సంతోషించింది గంగామణి.
‘తెలివైన చెలికత్తె’ కథలో
రాజు ఇంద్ర సేనుడి భార్య రోహిణీ దేవి. చెలికత్తెలు ఎవరు ఎటువంటివారో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఒక బల్లమీద.. ఒకరాయి, కొన్ని సన్నని పుల్లలు, దారం ముక్క ఉంచింది.వీటిని చూస్తే ఏమి ఆలోచన వస్తుందో సమాజానికి పనికివచ్చేటట్లు చెప్పమంటుంది.
పద్మిని అనేది.. పుల్లతోరాతిని ఎత్తితే పుల్ల విరిగి పోతుంది.. అన్నిపుల్లలు కలిస్తే రాతిని ఎత్తగలవు. ఒంటరిగాకంటే, ఐకమత్యంతో వుంటే పని దారం లాగ తేలికవుతుంది అంటుంది. ఆమెను మెచ్చుకుని ఒక ఉం గరం బహుమానం గాయిస్తుంది రోహిణీదేవి.
రాణీ ద్వారా తరువాత విషయం విన్నరాజు.. రాయి రాయి కలిస్తే పొయ్యి, కట్టెలు వేస్తే పొయ్యిలో మంట, మంట మండితేనే వంట. కట్టెలు విడిగా నెత్తిని పెట్టుకుంటే జారుతాయి. తాడుతో ముడివేస్తే నెత్తికి ఎత్తు కోవచ్చు. ఇదీ సంకేతం అని రోహిణిదేవిని నవ్విస్తాడు.
ఇలా చెప్పుకుంటూపోతే ఈ సంపుటిలోని 38 కథలు వేటికవే భిన్నంగా ఉండి చదివే పాఠకులను నవ్విస్తాయి. గిలిగింతలుపెడతాయి. బాలసాహిత్యంలో ఎన్.వి.ఆర్. సత్య నారాయణమూర్తి పుస్తకం ‘పొట్టివాడు’ (పిల్లల హాస్యకథలు)కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయ సాహితీ పురస్కారం లభించింది. ‘రిఫరెన్స్ ఆసియా’ (1990), ‘ఇండో-అమెరికన్ హూ ఈజ్ హూ‘ (1994), బాలసాహిత్య నిర్మాతలు (1990), ‘అందరూ మహాను భావులే’, బాలసాహితీశిల్పులు మొదలగు పుస్తకాలలో వీరి పరిచయం చోటు చేసుకుంది.
(వచ్చేవారం మరో బాలసాహితీవేత్త రచనల గురించి పరిశీలిద్దాం)
- పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
92475 64699.