మానవ జీవితంలో గురుశిష్యుల బంధం చాలా పవిత్రమైనదే కాక విలువైనది. విద్య, వివేకం నేర్పుతూ సకల విషయాలపట్ల అవగాహన కలిగేలా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, చైతన్యపరిచేవాడే గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించే వాడు సద్గురువు. హిందూ సంస్కృతి గురువులకు సము న్నత స్థానం కల్పించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చాటుతూ తల్లిదండ్రుల తరువాత స్థానం ఇచ్చి గౌరవించింది. గురుబ్రహ్మ, గురువిష్ణుః గురు దేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ అని స్తుతిస్తూ గురువును బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో పోల్చిన సంప్రదా యం మనది. అందుకే గురువును తల్లిదండ్రుల కంటే మిన్నగా గౌరవించి పూజించాలి విద్యార్థులు అంటారు కేం ద్రసాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వర రావు.
గురు బలముంటే శిష్యుడు ఎలాంటి కష్డతర కార్య మైనా, సులువుగా చేయగలడు. గురువు అడగకముందే అతని అవసరాలు గుర్తించి శిష్యుడు సేవ చేసుకోవాలి. ఇతను నా శిష్యుడని గురువు గర్వంగా చెప్పుకోవాలి. గురు శిష్యుల కథలు మన బాలసాహితీవేత్తలు అనేకం రాసి మెప్పించారు. ప్రముఖ బాలసాహితీవేత్త, నేటి బాలసాహితీ వేత్తలకు మార్గదర్శులు, గురు సమానులు ఎన్.వి.ఆర్.సత్య నారాయణమూర్తి గురుశిష్యుల కథలు అనేకం రాశారు. ఈ వారం ఎన్.వి.ఆర్ రాసిన కొన్ని కథలను పరిశీలిద్దాం.
ఎవరు గొప్ప? ఈ కథ 1981 మార్చి చందమామలో ప్రచురించారు ఇది ఉపాధ్యాయుని ప్రాముఖ్యతను చాటి చెప్పే కథ. అంబాపురం గ్రామపెద్ద పరంధామయ్య ఇంట్లో ప్రతి ఆదివారం ఊరి ముఖ్యలు సమావేశమై చర్చలు జరిపే వారు. ఒకసారి వీళ్లు వైద్యుడు గొప్పవాడు అని ఒకరంటే.. కాదుకాదు న్యాయాధి కారి గొప్పవాడని ఇంకొకదంటాడు. మరొకాయన రక్షక భటాధి కారి గొప్పవాడని చెపుతాడు. వీరి గొప్పతనానికి కారణాలు కూడా చెప్పుకుంటారు. అక్కడే ఉన్న నౌకరు సూరయ్య బడిపంతులు రామప్ప పం తులు అందరికంటే గొప్ప అని సహేతుకంగా చెప్పి అంద రిని ఒప్పిస్తాడు. పంతులుకు వచ్చే ఉగాదికి సన్మానం చేద్దా మనే వారి నిర్ణయంతో కథ ముగుస్తుంది.
ఇంకో కథ గురుదక్షిణ గురుకుల గురువు ఆనందుల వారు పదిమంది గ్రామస్తులను తమ తమ పెంపుడు కుక్కల ను తీసుకుని రమ్మని కబురు చేసి వారు రాగానే వాటిని ఒకమారువిడిచి పెట్టమంటారు. అవి ఒక్కసారిగా వచ్చిన స్వేచ్ఛతో అటుఇటు పరుగులు పెట్టి తిరిగి యజమానుల వద్దకువస్తాయి. ఒకదానినోట చింపిరి గుడ్డ ఉంటుంది, ఇంకొక దాని నోట ఎముకముక్కవుంటుంది, మరోదాని నోట కొబ్బరి చిప్ప ఉంటుంది. ఇలాగ ఒక్కొక్కటి ఎదో ఒక పనికి రాని దానిని తెస్తాయి. వాటిని చూడగానే అందరికీ విస్మయం కలుగుతుంది. అవి మల్లీ వాటికోసం ఒకదానితో ఒకటి కాట్లాడుకుంటూ ఉంటాయి.
అప్పుడు గురువు గారు మళ్ళీ వాటిని కట్టమని చెపు తారు. ఆ తరువాత ఆయన, చూసారా వాటికి యజమా నులు మంచి తిండిపెట్టినా స్వేచ్ఛ వచ్చే సరికి విచక్షణ లేకుండా వుంటున్నాయి. వెనుకటి గుణమే. మనిషికి విచ క్షణా జ్ఞానం వుంది. మీరు ఇక్కడి కట్టుబాటుల నుండి చదువు పూర్తి చేసుకువెళ్ళాక నీతిగా, సజ్జనులుగా, పరోప కారులుగా ఉండాలి. ఇదే నేను మీ నుండి కోరే గురు దక్షిణ. అందుకే ఈ కుక్కల ద్వారా సందేశం అనే సారాం శంతో కథ ముగుస్తుంది.
అసలైన విద్య: ఇంకో కథ. గురుకుల గురువు రామ దాసు శిష్యునితో యాత్రలకు వెళుతుంటే దారిలో చలమయ్య అనే ధనవంతుడు కలుస్తాడు. శిష్యులకు వ్యాయామం కూడా నేర్పించుచున్నానని గురువు చెపితే కుర్రాళ్లకి చదువు ముఖ్యం బస్కిలు వ్యాయామం దేనికని నవ్వుతాడు ధనవంతుడు.
ఇవి అనవసరం అని వాదిస్తాడు కూడా. దారిలో దొంగలు ఆటకాయిస్తే శిష్యుడు వాళ్ళని తరిమి ధనవంతుని డబ్బు పోకుండా కాపాడుతాడు. ధైర్యసాహసాలు కూడా చదువుతో పాటు నేర్పాలని ధనవంతుడు అంగీకరిం చడంతో కథ ముగుస్తుంది.
మరోకథ.. మూడోదేవుడు… పదవీవిరమణ చేసిన ఊపాధ్యాయుడు వెంకటరామం సికిందరాబాద్ స్టేషన్‌లో రైలు దిగగానే అల్లుడు వస్తాడు. వారు వెళుతూ ఉంటే ఒకత ను మాస్టారూ నేనండీ కర్రా వాళ్ళ కుర్రా అని పిలిచేవారు గుర్తు పట్టేరా.. అన్నాడు. మాస్టారు అతని ముఖంలోకి చూస్తూ నీపేరు సురేష్ కదూ అన్నారు. మాఇంటికి తీసు కుని వెళతాను రండి అన్నాడు. మాస్టారు తమల్లుడిని పరి చయం చేసి ఆదివారం వస్తానులే నీకు సెలవు కదా అన్నారు. అనుకున్నట్టు ముందే అడ్రస్ తీసుకున్న సురేష్ కారు తీసుకు వస్తాడు. దారిలో ట్రాఫిక్ జామ్ వల్లకారు ఆగినప్పుడు మాస్టారూ మీవల్లే నేను నూరు శాతం లెక్క లలో మార్కులు తెచ్చుకోగాలిగాను. ఇక్కడ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను అంటాడు. గుర్తుకు వచ్చింది నువ్వుబొమ్మలు కూడా బాగా వేశావాడివి కదూ అంటారు మాస్టారు. అల్లుడు కూడా వస్తున్నాడు.
మాస్టారూ ఆరోజులలో లెక్కలతో పాటు నీతీ నిజాయితీగా ఉండమని చెప్పేవారు. మీ వల్లనే నేను ఇంతటి వాడిని కాగలిగాను అన్నాడు సురేష్. అతనింటికి చేరాక అతను, రేఖా మా మూడో దేవుడిని వెంటపెట్టుకుని వచ్చాను అని పిలిచాడు. తనవారిని పరిచయం చేసాడు. అక్కడ గోడమీద మూడు ఫోటోలుంటాయి. రెండు అతని తల్లిదండ్రులవి మూడోది సుమారు పాతికేళ్ళ క్రిందటి తన రూపమేనని మాస్టారు పోల్చుకుంటారు. తనమామ గారికి మంచి పేరు ఎలాగ వచ్చిందో అల్లుడికి అర్ధమవుతుంది. విందు గురుసత్కరాలు మామూలే కదా ఆ తరువాత.
మరో కథ…. పిడికెడులో పరమార్ధం..
ఒకస్కూల్లో ఇన్‌స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది. స్కూలంతా అన్ని హంగులతోనూ అలంకరించబడి ఉంటుంది. డిఇఓ గారు తెలుగు మాస్టారి క్లాస్‌కి వెళతారు. ఆయన కుచేలుడు పాఠం బోధిస్తూ పిల్లలకు పిడికిలి బిగించి చూపి ఈ పరిమాణంలో ఏమిటుంటుందని సైన్స్ మాస్టారు చెప్పారు అనిడిగితే, గుండె అంటే హృదయం అన్నారు పిల్లలు. చూసారా కుచేలుడు హృదయపూర్వకంగా పిడికెడు అటుకులు భగవంతునికి సమర్పించాడు. అందుకే దేవుడు భోగ భాగ్యాలు ఇచ్చాడు అనేటప్పటి డిఇఓ గారు తెలుగు మాస్టారిని మెచ్చుకుని ఇలాగ ఎప్పుడూ నేను వినలేదు గొప్పగా చెప్పారు అంటారు. ప్రతిభగల వాని బోధనకు ఇదో నిదర్శనం.
అభిరుచులు… అనే కథ బాలచంద్రికలో ప్రచురింపబడింది. ముగ్గురు తండ్రులు తమకొడుకులను తీసుకుని ఒకగురువుగారివద్దకు వచ్చి తమపిల్లలు ఫలానా విధంగ చదవాలనుకుంటున్నాం. అనిచెపుతారు. గురువు ఆ పిల్లలను తన దగ్గర 15రోజులు ఉంచి.. తరువాత రమ్మంటాడు. అలాగే వాళ్ళు వచ్చినప్పుడు ఆ పిల్లల అభిరుచులు తండ్రులకు తెలియజేసి ఆవిధంగా వారు చదివించ కునేటట్లు ఒప్పిస్తాడు. ఇదీ సారాంశం. మనపిల్లలు మన ము అనుకునేటట్లు అందరూ చదవలేకపోవచ్చు. మనం మొండి పట్టు పట్టకుండా వారికి ఇష్టమయ్యేటట్లు చదువు కునే అవకాశం పేరేంట్స్ కలిగించాలి.
ఇలా బాలసాహిత్యంలో ఎన్.వి.ఆర్.సద్యనారాయణ మూర్తి అనేకం గురుశిష్యుల కథలు రాశారు. మనకూ మన గురువులతో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగుంటాయి. వాటిని కథలుగా రాసే ప్రయత్నం చేద్దాం.
(వచ్చే వారం బాలసాహిత్య రచనలో శైలి – శిల్పం గురించి తెలుసుకుందాం)
- పైడిమర్రి రామకృష్ణ
92475 64699.