Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Droght Again: వర్షాభావ పరిస్థితులపై తీవ్ర ఆందోళన

Droght Again: వర్షాభావ పరిస్థితులపై తీవ్ర ఆందోళన

ఇటీవల స్కైమెట్‌ వెదర్‌ ఇచ్చిన వాతావరణ నివేదిక నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది సాధార ణ వర్షపాతం కంటే దాదాపు 94 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కాబోతోందంటే వ్యవసాయ రంగం ఏం కాబోతోందోనన్న ఆందోళన ఏర్పడుతోంది. ఎల్‌ నినో ప్రభావం కారణంగా సగటు వర్షపాతం సాధారణం కంటే బాగా తక్కువ కాబోతోందని వ్యవసాయ నిపుణులు ఇప్పటి నుంచే ఆవేదన చెందు తున్నారు. అధికారిక ఇండియన్‌ మెటీరియోలాజికల్‌ డిపార్ట్మెంట్‌ (ఐ.ఎం.డి) కూడా ఈ ఏడాది వర్షపా తం బాగా తక్కువగా ఉండబోతోందనే ప్రకటించింది. పసిఫిక్‌ మహాసముద్ర భూమధ్య రేఖ ప్రాంతంలో సముద్రం ఉపరితల మీద వేడి గాలులు చేరడాన్ని ఎస్‌ నీనో ప్రభావంగా పరిగణించడం జరుగుతోంది. ఈ కారణంగా భారతదేశ ఉపఖండం మీద రుతు పవనాలు బలహీనపడడం, వేడి ఆవిర్లతో కూడిన గాలులు వీచడం జరుగుతుంది. వర్షాభావం ఏర్పడడానికి 40 శాతానికి పైగానే అవకాశాలున్నాయని స్కైమెట్‌ చాలా కాలం క్రితమే వెల్లడించింది.
ఇక ఈ ఎల్‌ నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు బాగా తగ్గడంతో పాటు మే నెల నుంచి వడగాడ్పులు తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. వర్షాకాలంలో కూడా ఎండలు మండిపోయే ప్రమాదం ఉందని స్కైమెట్‌ ఇప్పటి నుంచే హెచ్చరికలు జారీ చేస్తోంది. భారతదేశపు అన్నపూర్ణలుగా, ధాన్యాగారా లుగా ప్రసిద్ధి చెందిన పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో వర్షాకాల ద్వితీయార్థంలో మాత్రమే కొద్దిగా వర్షాలు పడే అవకాశం ఉంది. భూగోళం వేడెక్కుతున్న ఫలితంగా ఇతర ప్రపంచ దేశా లతో పాటు భారతదేశంలో కూడా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకస్మా త్తుగా వర్షాలు పడడం, వాతావరణం వేడెక్కిపోవడం, పర్యావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసు కోవడం వంటివి తరచూ సంభవించడం ఈ కారణంగానే జరుగుతోంది. ఈ మార్పుల వల్ల పంటల ది గుబడి దారుణంగా దెబ్బతింటోంది. వర్షాకాల వర్షాల వల్ల సుమారు 60 శాతం పంట పొలాలకు నీరం దుతుండగా, మిగిలిన 40 నీరు భూగర్భ జలాల వల్ల అందుతోంది.
సక్రమంగా వర్షాలు పడే పక్షంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి, ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు శక్తి కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అంతేకా దు, దీనివల్ల నగరాలు, పట్టణాల్లో కూడా వినిమయ వస్తువుల కొనుగోలు పెరిగి, మార్కెట్‌ వ్యవస్థ బలోపేతం అవుతుంది. వినిమయ వస్తువుల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఫలితంగా, పరిశ్రమలు అభి వృద్ధి చెంది, ఉపాధి రంగం మెరుగుపడుతుంది. అనేక పర్యాయాలు వాతావరణ నివేదికలు, వాతావరణ ఫలితాలు విఫలం అయిన మాట నిజమే కానీ, ఎల్‌ నినో ప్రభావం గురించిన అంచనాలు మాత్రం నిజ మయ్యే అవకాశాలున్నాయి. వర్షాభావం ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలు కూడా ఎంతగానో కలవర ప రుస్తున్నాయి.
అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వాతావరణ నివేదికలను సీరియస్‌ గానే తీసుకుంటోంది. ప్ర భుత్వం సంక్షోభ నివారణ పధకానికి ఇప్పటికే రూపుదిద్దింది. వర్షాభావం వల్ల బాగా దెబ్బతినే జిల్లాలు, గ్రామాలను గుర్తించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ముందుగానే స ంక్షోభ నివారణ చర్యలు చేపట్టడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి నిపుణులను, సిబ్బందిని సిద్ధం చేసి ఉంచింది. ఆర్థికంగా దెబ్బతిన్నవారిని సకాలంగా ఆదుకోవడానికి నిధులను కూడా సిద్ధంగా ఉంచుకుం ది. దుర్భిక్షం చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రత్యామ్నాయ సాగు పద్ధతులకు అవ కాశం కల్పించడంతో పాటు, వర్షాకాల అనంతరం దుర్భిక్ష బాధితులకు ఆహార ధాన్యాలను అందజేయ డానికి కూడా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు, జిల్లా కలెక్టర్లకు వర్తమానం పం పించడం కూడా జరిగింది. అంతేకాదు, వర్షాభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత ఎక్కువగా, మరింత వేగంగా, మరింత విస్తారంగా అమలు చేయడానికి కూడా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 15 కోట్లకు మందికి పైగా గ్రామీణులు తమ పేర్లను నమోదు చేసు కోవడం జరిగింది. పేదరికం కారణంగా అవస్థలు పడుతున్న గ్రామీణ వ్యవసాయ కూలీలకు వంద రో జులకు పైగా ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని, కూలీలకు తప్పనిసరిగా ఉపాధి లభించేటట్టు చూడాలని జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేయడం జరిగింది. వీటితో పాటే ప్రత్యామ్నాయ సాగు పద్ధతుల గురించి, నీటి నిల్వలను పెంచడం గురించి, నదీ జలాల స ద్వినియోగం గురించి కేంద్రం జిల్లా యంత్రాంగాలకు సూచనలు ఇవ్వడం జరిగిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News