Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Elections 2024: అందరి దృష్టీ ఎన్నికల పైనే

Elections 2024: అందరి దృష్టీ ఎన్నికల పైనే

వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాజకీయ రంగంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. కోపతాపాలు, ఆవేశకావేషాలు కూడా హద్దులు దాటిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు, ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2024 మేలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు ఈ తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలే రంగం సిద్ధం చేయబో తున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ఈ ఎన్నికలు రిహార్సల్‌గా భావించి, పాలక, ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే వ్యూహాలు, ఎత్తులు, పైయెత్తులకు దిగుతున్నాయి. ఒక విధంగా ఆలోచిస్తే, పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేతిలోనే ఎక్కువ సంఖ్యలో తురుపు ముక్కలున్నట్టు భావించాలి. అయో ధ్య రామ మందిర నిర్మాణం, కొత్త పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం, ప్రపంచ దేశాల నాయకులకు ఆతిథ్యం ఇస్తూ జి-20 సమావేశాలను నిర్వహించడం వంటి ప్రధాన కార్యక్రమాలతో ప్రతిపక్షాలకు మీ డియాలో తగినంత స్థానం లభించకపోవచ్చు.
భారత్‌ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాత్ర ఫిబ్రవరి నెల వరకూ కొనసాగుతుంది. ప్రజల సమస్యలకు, రాష్ట్ర సమస్యలకు ప్రాధాన్యమిస్తూ రాహుల్‌ చేస్తున్న ఈ యాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు చేయాల్సిం ది ఇంకా ఎంతో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఈ పార్టీ, ఇందులో రెండు రాష్ట్రాలలో జరగ బోయే లోక్సభ ఎన్నికలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక, కర్ణాటక, తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, నాగాలాండ్‌ త్రిపుర, మిజోరం, మేఘాలయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు దగ్గర పడుతు న్నాయి. అంతేకాక, జి-20 సమావేశాలు జరగడానికి ముందే కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
వెనుకబడిన ప్రతిపక్షాలు
ఎన్నికల ప్రచారానికి సంబంధించినంత వరకూ మోదీ ప్రభుత్వానికి అనుకూల మైన అంశాలు చాలానే ఉన్నాయి. జి.డి.పి విషయంలో ప్రపంచ దేశాలు నానా అవస్థలూ పడుతుండగా, భారత్‌లో మాత్రం అది నిలకడగా ముందుకు సాగుతుం డడం కూడా మోదీ ప్రభుత్వానికి అనుకూల అంశం కావచ్చు. బీజే పీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు తప్పనిసరిగా ఒకే తాటి పైకి రావాల్సి ఉంటుంది. మ్మడి వ్యూహంతో తప్ప మరే విధంగానూ మోదీ ప్రభుత్వాన్ని అవి అధికారం నుంచి దించలేవు. బీజేపీ మిత్రపక్షాలైన శివ సేన, జనతా దళ్‌ (ఐక్య) ప్రస్తుతం శత్రుపక్షాలుగా మారిపోయాయి. అంటే, మహాం రాష్ట్రలోనూ, బీహార్‌లోనూ ఆ పార్టీ పరిస్థితి ఏమంత సజావుగా ఉండకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాలలోన నా కలిపి 88 లోక్‌సభ స్థానాలు న్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ఉండవచ్చు. కానీ, శక్తివంతమైన మిత్రపక్షాలు లేకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం తేలికైన విషయం కాదు.
ఏతావతా, బీజేపీ కొన్ని కొత్త పార్టీలను మిత్రపక్షాలుగా మార్చుకోవాల్సి ఉం టుంది. కొత్త రాష్ట్రాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తమిళనాడులో అన్నా డి.ఎం.కెతో చేతులు కలపడానికి ప్రయత్నా లు సాగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో కలవడానికి అవకాశం లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ అధ్వాన మవుతున్న సమయంలో బీజేపీ ఇప్పటికే అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే కార్య క్రమం చేప ట్టింది. మొత్తం మీద, ఫిబ్రవరిలో భారత్‌ జోడో యాత్ర ముగిసి, రాహుల్‌ గాంధీ తిరిగి ఢిల్లీ చేరుకున్న తర్వాతే ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు ప్రయత్నాలు ప్రారం భమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా, 2023లో కూడా రాజకీయ సందడికి ఏమాత్రం కొరత ఉండకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News