బూటకపు వార్తలు, నకిలీ వార్తలు, దుష్ప్రచారాలు సమాజానికి చేటు తెస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే, ఇటీవల ఐ.టి నిబంధనల్లో చేసిన మార్పులు, చేర్పులు కొద్దిగా ఆందోళక కలిగిస్తున్నాయి. కేం(ద్ర ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి నకిలీ వార్తలను, బూటకపు వార్తలను, దుష్ర్రచారాలను ప్రచురించడం గానీ, ఫార్వర్డ్ చేయడం గానీ, స్వీకరించడం గానీ చేయకుండా సంబంధిత వ్యక్తులు జాగ్రత్త పడాల్సి ఉంటుందని తాజా సవరణలు సూచిస్తున్నాయి. ఈ కొత్త సవరణల్లో ఉపయోగించిన పదజాలం ఏవిధంగా ఉందంటే, నకిలీ వార్తలు, బూటకపు వార్తలు, దుష్ప్రచారాలన్న పేరుతో ప్రభుత్యానికి నచ్చని, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వార్తలను ప్రభుత్వం అడ్డుకోవడానికి ఈ సవరణలు అవకాశం కల్పిస్తున్నాయి. నకిలీ వార్తలను సోషల్ మీడియాలో (ప్రచారానికి పెట్టినప్పుడు ప్రభుత్వం వాటిని తొలగించదు కానీ, వాటి మీద న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
ఏదైనా వార్త వాస్తవమా, అవాస్తవమా, నకిలీయా, బూటకమా, దుష్ర్రచారమా అని నిర్ణయించే హక్కు, అధికారం ఏకపక్షంగా ప్రభుత్వానికి మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ విధానాలు, చర్యలు, నిర్ణయాలపై ఎవరైనా ప్రతికూల వార్తలు రాసినా, విమర్శలు చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినా ప్రభుత్వం వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం ఒక బిజినెస్ మేగజైన్‌కు చెందిన విలేఖరి రాసిన వార్తా కథనం ఇందుకు సరైన ఉదాహరణ. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రతి ఏటా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేరుతో దేశంలోని నిరుద్యోగ సమస్య గురించి ఒక నివేదికను ప్రచురిస్తూ ఉంటుంది. అది ఒక సంవత్సరం అటువంటి నివేదికను ప్రచురించలేదు. దేశంలో నిరుద్యోగ సమస్య మరీ దారుణంగా ఉండడం వల్లే ఆ సర్వే నివేదికను ప్రచురించలేదంటూ ఆ విలేఖరి వార్త రాశారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఆ విలేఖరిని, ఆ బిజినెస్ మేగజైన్ యాజమాన్యాన్ని వేధించడం ప్రారంభించింది. ఈ వార్త నకిలీ వార్త అని ఆరోపించింది. ఆ తర్వాత అది ఎప్పటి మాదిరిగానే ఆ సర్వే నివేదికను విడుదల చేసింది. ఆ విలేఖరి రాసిన వార్త వాస్తవమని తేలి౦ది.
ఇది నకిలీ వార్తగా భావించి దాన్ని తొలగించి ఉంటే ఏమయి ఉండేది? నిజానికి, కొత్త ఐ.టి నిబంధనల్లో ప్రభుత్వం నకిలీ, బూటకపు, అసత్య, దుష్ప్రచార వార్తలను స్పష్టం గా నిర్వచించింది. అయినప్పటికీ, తనకు నచ్చని, తనకు సరిపడని, తనకు ఇబ్బంది కలిగించే ఏ వార్తనై నా ప్రభుత్వం నకిలీ వార్తగా పరిగణించడానికి అవకాశం ఉంది. పాలక పక్షాన్ని సానుకూలంగా చూపించే వార్తలు మాత్రమే వాస్తవ వార్తలని, మిగిలినవన్నీ అవాస్తవ, దుష్ప్రచార వార్తలని భావించడానికి అవకాశాలు లేకపోలేదు. బూటకపు వార్తలు ప్రచురించినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు, వాటిని స్వీకరించినందుకు ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవడంపెద్ద సమస్యేమీ కాదు. కానీ, ఎన్ని సంస్థలు లేదా ఎన్ని (గ్రూపులు న్యాయపరంగా పోరాడగల స్థితిలో ఉన్నాయి? ఒక స్థితిలో ఈ కొత్త నిబంధనలు భావ వ్యక్రీకరణకు, పత్రికా స్వేచ్ళకు, వాక్ స్వాతంత్ర్యానికి అవరోధాలు అయ్యే అవకాశం లేకపోలేదు.
అంతేకాదు, పత్రికలు గానీ, వార్తా ఛానల్స్ గానీ, సోషల్ మీడియా గానీ నకిలీ వార్తలు, బూటకపు వార్తలు, అసత్య వార్తలు, దుప్ర్రచార వార్తలు రాసినప్పుడు ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే అవకాశం ఉంది. పరుపు నష్టం దావా వేయడానికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ చట్టాలను ఇప్పటికే తరచూ ఉపయోగించుకుంటోంది. కొత్త నిబంధనలను తీసుకు రావడాన్ని బట్టి, ప్ర
భుత్వం తమపై వార్తాముఖంగా కొద్దిపాటి విమర్శలు వచ్చినా తట్టుకోని స్థితిలో ఉందనే భావన కలుగుతోంది. ప్రభుత్వ ఉద్దేశం సరైనదే కావచ్చు. సోషల్ మీడియాలో మతాలకు, కులాలకు మధ్య చిచ్చు పెట్టే వార్తలు అనేకం వస్తున్నాయి. దేశ నాయకులను అప్రతిష్టపాలు చేసే కథనాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇటువంటివి వ్యాపించే పక్షంలో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.
పత్రికా స్వేచ్చ విషయంలో ప్రభుత్వం సంయమనం పాటించాలని ఏ విధంగా కోరుతున్నామో, ప్రభుత్వ ఉద్దేశాలను ఏ విధంగా శంకిస్తున్నామో, పత్రికలు, కొన్ని సోషల్ మీడియా వర్గాల విషయంలో బాధ్యత కలిగిన పౌరులు అదే విధమైన సంయమనాన్ని ఆశించాల్సి ఉంటుంది. సమాచార సాధనాలు కూడా తప్పనిసరిగా దేశ సమగ్రతను, సమైక్యతను, సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని వార్తలను స్వీకరించడం, ఫార్వర్డ్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది.