Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Farmers: ఆర్భాటం కాదు, చిత్తశుద్ధి కావాలి

Farmers: ఆర్భాటం కాదు, చిత్తశుద్ధి కావాలి

‘కల్లాల్లో వేలాది టన్నుల ధాన్యం తడిసింది.. అకాల వర్షాలకు నీట మునిగిన లక్షలాది ఎకరాల పంట.. వడగళ్ల వానకు నేల రాలిన పండ్ల తోట లు.. నష్టపోయిన పంటను చూసి కన్నీరు మునీనరవుతున్న రైతు.. ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలై వరదలో కొట్టుకపోతుంటే చూడలేక రైతు పొలంలోనే గుండె ఆగి మరణించాడు.. మార్కెట్లో అమ్మకానికి ఉంచిన పంట తడిసి కొట్టుకుపోతుంటే చూడలేని రైతు విలవిల్లా డాడు… ధాన్యం రాసిపైనే పాణాలు వదిలిన రైతు..
పత్రికలో ఇలాంటి వార్తలు కనిపిస్తే చాలు..
రైతు కన్నా ముందే ప్రతిపక్ష పార్టీలు, నాయకులు జండాలు కట్టుకొని, కండువలు వేసుకొని పొలంలో వాటిని పరిశీలిస్తున్నట్లు ఫోజులిస్తూ పేపర్లు, ఎలక్ట్రానిక్‌ మీడియా ముందు గొంతు చించుకొని మాట్లాడుతుం టారు. అకాల వర్షంతో రైతు నష్టపోయిండని, తక్షణమే రైతును ఆదుకోవాలని, రోడ్ల పైన, వ్యవసాయ మార్కెట్ల వద్ద రకరకాల వింత వేషాలతో ధర్నాలు, ఆందోళనలు చేయడంతో పాటు అవసరమైతే వ్యవసాయ అధికారులపై చిందులు వేస్తుంటారు.
మరోపక్క అధికారంలో ఉన్న పార్టీ నిమ్మకు నీరెత్తి నట్లు పంటంతా కొట్టుకపోయిన తర్వాత తాపీగా లెక్కలేసు కుంటూ నామ్‌ కే వాస్తేగా నష్టపరిహార ప్యాకేజీని ప్రక టించి చేతులు దులుపుకుంటుంది. అది కూడా వెంటనే రైతుకు ఇవ్వదు. రైతు చేతికి అందేసరికి నెలలు, నెలలు పడుతుంది. ఈలోగా అకాల వర్షాలతో బాధపడ్డ రైతులు, వారి దగ్గర నాటకాలు వేసే విపక్ష పార్టీలు, రైతులకు కంటి తుడుపు ప్రకటనలు చేసే అధికార పార్టీ, అధికా రులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా స్థాయిల్లో ఉండే రాజకీయ నాయకులు చెప్పే ప్రకటనలతో ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా హెడ్‌ లైన్లో వార్తలు ‘కలర్‌ ఫుల్‌’గా వస్తుంటాయి.
ఈ అకాల వర్షాలు, రాజకీయ నాయకులు ఆడే నాటకాలు, ప్రభుత్వం చేసే వింత ప్రకటనలు, మీడియాకి ఓ పెద్ద వార్త లేదా వారు హంగామా చేయటానికి రైతాంగ అంశం వారికి ఒక అవకాశం. ఇదంతా మనమెందుకు మాట్లాడుతున్నామంటే.. పం టలు వేయటం సహజమే. అదే విధంగా అకాల వర్షాలా? సకాల వర్షాలా? ప్రకృతి వర్షించటం అదీ మరింత సహ జమే. అనేక సంవత్సరాల నుండి ఈ వాస్తవం మనందరికీ తెలిసిందే. కానీ, ఈ సంవత్సరం మాత్రమే వర్షాలు వచ్చి నట్టు.. పంటలు నష్టపోయినట్లు వార్తలు రాయడం, రైతులకి తామేదో చేస్తున్నట్లు అధికారంలో ఉన్న పార్టీ హంగామా చేయడం, అధికారంలో లేనటువంటి గతంలో అధికారం వెలగబెట్టినటువంటి పార్టీల నాయకులు రక రకాల విన్యాసాలు చూపటం, ప్రతి వ్యవసాయ సీజన్లో జరిగే తంతే. అంటే రైతులు, వ్యవసాయ అంశాలు రాజ కీయ పార్టీలకు ఒక అవకాశం. వారు తమ రాజకీయాలకు రైతులను పావులుగా వాడుకుంటున్నారు. అయితే, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లేదా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రతి పార్టీ మాట్లాడేది రైతు రాజ్యం, రైతు సంక్షేమం గురించే. రైతే వెన్నెముక అంటూ రకరకాల పథకాలు మేనిఫెస్టోలు ప్రకటిస్తుం టాయి. నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతు రక్షణ, సంక్షేమం కోసం కార్యాచరణ ఎందుకు చేపట్టలేదు?
అలా జరిగినట్లయితే ఈ రోజుకి జరిగే నష్టం చాలా తగ్గేది కదా. రైతు కంట కన్నీరు కారని రైతాంగ వ్యవస్థ ఏర్పడేది. కానీ అది జరగటం లేదు. ఎందుకు? ఆలోచిం చాల్సిన సమయం ఇది. ప్రజలారా వర్షాలు, వరదలు, కష్టాలు, నష్టాలు, పంట కొట్టుకుపోవడం, పంట నేల రాలిపోవడం, వడగండ్ల వానకి మామిడికాయలన్నీ పగిలి పోవడం ఇవన్నీ ప్రతి రైతుకు తెలిసిన సత్యమే! బాధే కానీ ఎందుకు ప్రతిసారి ఇలా జరుగుతుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది మనం ఆలోచించాలి. ఎందుకు అంటు న్నామంటే తెలంగాణనే తీసుకున్నట్లయితే 2014లో ప్రతేయక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతురాజ్యమే తమ విధానం అని (ఈనాటి) భారత రాష్ట్ర సమితి పేర్కొంది. రైతుల కోసం తాము ఎంతో చేస్తున్నామని, రైతు సంక్షే మమే తమ లక్ష్యమని అంటోంది. ఈ తెలంగాణలో సాధించిన ప్రగతి స్ఫూర్తితో భారత దేశంలో తెలంగాణ రైతాంగ విధానాన్ని అమలు చేస్తామని చెబుతోంది. అయితే, ఇప్పుడు తెలంగాణలో రైతులు కన్నీరు ఎందుకు పెడుతున్నారు? రైతు ప్రభుత్వమే ఉంటే రైతు ఇంట్లో హాయిగా కుటుంబంతో గడుపుతాడు కదా. పొలాల్లో లేదా పంట కల్లాలపైన ప్రాణాలు ఎందుకు వదులుతున్నాడు? ఇది ఆలోచించాలి.
మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ రకరకాల రాజ కీయాలు చేస్తుంది. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కదా. రైతాంగ ఈ అకాల వర్షాల బాధకు పరి ష్కారం ఏం చూపించారు? అది ఎంతవరకు వచ్చింది? మీరు కరెక్ట్‌గా చేసినట్లయితే ఇంత సమస్య ఎందుకుం టది? కేంద్రంలో అధికార బీజేపీ నాయకులు కూడా రకరకాల వేషాలు వేస్తున్నారు. నిజంగా బీజేపీ నేతలు రైతు ప్రేమికులే అయితే ఈ నష్టం నుంచి రైతులను ఎలా కాపాడాలి? లేదా జరిగిన నష్ట నివారణకు గానీ, నష్టం సంభవించాక గానీ ఎలాంటి విధానం అమలు చేయాలి? రైతు పాలసీని వీరు ఎందుకు పాటించటం లేదు? కేంద్రం లో అధికారంలో ఉన్నది బీజేపీకదా మరి వ్యవసాయ రంగ సంక్షోభ నివారణకు వీరిచ్చినటువంటి సూచనలు ఏమిటి? ఇది ప్రజలందరూ.. మరీ ముఖ్యంగా రైతాంగం ఆలోచిం చాల్సిన విషయం. ఎందుకు అంటున్నామంటే, రైతులను రాజకీయ పార్టీలు తమ రాజకీయాలకు పావులుగా వాడు కుంటున్నాయి. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరు తిడతారు. వీరే అధికారంలోకి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి పార్టీ నేతలు విమర్శ చేస్తుంటారు. కానీ, రైతాంగ సమస్య పరిష్కారానికి ఎవరు ముందుకొచ్చినటు వంటి దాఖలాలు లేవు. పై పూతలుగా రకరకాల ఆకర్షక పథకాలు చూపి ఓట్లు వేయించేసుకొని గద్దెనెకికన తర్వాత తమ తమ విధానాలే కొనసాగిస్తున్నాయి. ఈ పార్టీ, అ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీలదీ దే తీరు.
రైతులారా ఆలోచించండి.. ప్రతి గ్రామంలో సంవత్స రానికి కొన్ని కల్లాలు నిర్మించుకుంటూ వచ్చినా ఇప్పటికీ రాష్ట్రంలోని ప్రతి పంటను తడవకుండా చేసే సౌకర్యాలు సమకూరేవి. అదే విధంగా ప్రతి వ్యవసాయ మార్కెట్లో సంవత్సరానికి కొన్నిషెడ్డులు నిర్మించినా ఇంత పంట తడిచే అవకాశం ఉండదు. చాలా వరకు పంట నష్టం నివారణ జరిగేది. అదేవిధంగా పొలాల్లోనే కోయకుండా ఉన్న పంట వర్షాలకి కొట్టక పోవడం అనివార్యం. దాని నివారణకి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అని సందేహాత్ములు కొందరు అడగవచ్చు. పంట నష్టానికి బీమా ఉన్నట్లయితే ఒకవేళ కొట్టుకుపోయిన నష్టానికి తగ్గ పరిహారము రైతుకు వస్తున్నట్లయితే రైతు గుండె పగిలి మరణించిల్సిన పని ఉండదు. ఇలా తడిసిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వమే కొంట దనే నమ్మకం రైతులకు ఉంటే తడిసే ధాన్యం గురించి దిగులు చెందాల్సిన పని రైతుకు ఉండదు. కానీ, ఇది ఈ రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదు. దీంతో ప్రతి పంట సీజనులో వర్షాలు రావడంతో పత్రికలకు, మీడియాకు, ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి రైతు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. రైతు కన్నీటిని వారి అవసరాలకు వాడు కుంటున్నారు. అందుకే రైతాంగం సావధానంగా ఆలోచిం చాల్సిన సమయం ఇది. ఎందుకంటే మానవ సమాజానికి కావాల్సిన ఆహారం వ్యవసాయం ద్వారా లభిస్తుంది. అదే విధంగా వ్యవసాయం అంటే రైతు. కానీ రాజకీయ పార్టీలు ఈ రైతాంగ వ్యవస్థను వాడుకుంటున్నాయి తప్ప రైతు రఓణ కోసం పెద్దగా చేసిందేమీ లేదనే చెప్పాలి.
రైతుకు మేలు చేయాలనే చిత్తశుద్ధి గల రాజకీయ పార్టీలు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి రైతును ప్రభుత్వంలో భాగస్వామిగా చేయాలి. రైతు తన పొలంలో అధికారిగా ఉంటూ పంటను పండిస్తూ కనీస లాభాన్ని పొందే విధానాలు రావాలి. అప్పుడే రైతు ఆత్మహత్యలు లేని వ్యవసాయ రంగం ఆవిష్కృతమవుతుంది. ఇటు వైపుగా రాజకీయ పార్టీలు ఆలోచించే విధంగా వారిని వత్తిడి చేయాల్సిన బాధ్యత రైతాంగానిదేనని చెప్పాలి. ఒక పార్టీ ఉన్నత ఆలోచనలు చేపడితే తదుపరి అధికారంలోకి వచ్చే పార్టీలు మరింత మెరుగైన పాలసీలను రూపొంది స్తాయి. ఇక్కడ రైతు అంటే ఎవరో పరాయి వ్యక్తి కాదు. మన కుటుంబ వ్యక్తి. తెలంగాణను ఒక కుటుంబంగా భావించినట్లయితే తెలంగాణలో వ్యవసాయ సంక్షోభంలో ఉన్న రైతుని కాపాడటానికి ఉన్నత ఆలోచనలు, ఉన్నత పాలసీలు రూపొందించి కొంత మెరుగైన వ్యవస్థను రూపొందించినట్లయితే ఈ రైతు గోస ఉండదు కదా. అందుకనే రైతులారా మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ తాము రైతుల కోసం అనేకం చేశామని మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకెం తో చేస్తామని చెబుతుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తామొస్తే స్వర్గాన్ని దించుతామనంటూ రైతు ల్నిమభ్యపెట్టే అవకాశాలున్నాయి. మరి వీరు ఇన్నేళ్లు వారు చేసింది ఏమిటి అని రైతులు ప్రశ్నించాలి? మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతు రాజ్యం తీసు కొస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి మీ ఓట్లు రాబట్టుకునే యత్నాలు చేస్తుంది. ఇక్కడ ఈ మూడు పార్టీలు ఏదో ఒక సమయంలో ప్రజా పాలనాలో ఉన్నాయి. 75 ఏళ్లుగా రైతు సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ తగ్గింది లేదు. ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసు కుంటున్నారు. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కానీ ఈ రాజకీయ పార్టీలు మాత్రం రైతులని తమ అధికారం కోసం వాడుకునే వస్తువులుగానే చూస్తున్నాయి. అందుకే మేలు చేసే రైతు విధానాల కోసం పార్టీలను నిలదీయండి. మీరు కోరుకునేటటువంటి సరైన రాజకీయ పక్షమే లేదని మీరు భావిసేత మీరే రాజ్యాధికారం వైపు కదలండి. ఓ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయండి. రైతు సమాజాన్ని నిర్మించండి. అంతేగాని, ఎన్నికల ముందు అర్థం లేని వాగ్దానాలు చేసి తమ పబ్బం గడుపుకునే పార్టీలను నమ్మి ఓటు వేసినట్లయితే ప్రతి సంవత్సరం.. ప్రతి పంట సమయంలో వర్షాలు వస్తూనే ఉంటాయి.. పంట తడుస్తూనే ఉంటుంది.. .రాలిపోతూనే ఉంటుంది.. రైతులు పంట కల్లాల్లో కన్నీరు కారుస్తూనే ఉంటారు. గుండెపోట్లు వస్తూనే ఉంటాయి. కుటుంబాలు రోడ్డు పాలవుతూనే ఉంటాయి. రైతాంగ సంక్షోభం కొనసాగు తూనే ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త. నోరు విప్పండి మీ డిమాండ్‌ వినిపించండి. మీరే స్వయంగా పరిపాలకులుగా మారే అవకాశాలను వాడుకునేటందుకు సిద్ధం కండి. మీ రాజ్యం మీరే తెచ్చుకోండి.
కాసాని శ్రీనివాసరావు గౌడ్‌
జాతీయ అధ్యక్షుడు జై స్వరాజ్‌ పార్టీ

  • 9492034203
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News