Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Girl child day: బాలిక విద్యకి ప్రాముఖ్యతనివ్వాలి

Girl child day: బాలిక విద్యకి ప్రాముఖ్యతనివ్వాలి

అంతర్జాతీయ బాలికా దినోత్సవం నేడే

బాలికలు పాఠశాలకి వెళ్ళే వయస్సులో బడికి పోకుండా ఇంటి పని, పొలం పనులులో నిమగ్నం కావడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వాలు బాలికా విద్యను నిర్లక్షం చేస్తు న్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పలకా బలపం పట్టే వయస్సులో పలుగు పార పడుతూవున్నారు. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరా స్యులు కావడం బాలిక విద్యకి అవరోధాలుగా వుంటున్నాయి. ఒక వైపు అంతర్జాతీయ స్థాయిలో బాలికలు తమ ప్రతి భను చాటుతూ బాలుర కన్నా ముందంజలో వున్నారు. బాలికా విద్యకు పెద్ద పీట వేయకపోవడం వల్ల కొన్ని ప్రాంతాలలో బాల్య వివాహాలు యధేచ్చగా సాగుతున్నాయని సర్వేల ప్రకారం తెలుస్తుంది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడు తోంది. బాలిక లపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి ప్రాథమిక హక్కులను తెలియజేసేందుకు ఐక్య రాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటిం చింది. అమెరికన్‌ పౌరహక్కుల కార్య కర్త ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌, 194 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్‌ అన్న పదా న్ని పీపుల్‌గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్‌ రూజ్‌ వెల్ట్‌ పుట్టిన రోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి గుర్తించింది. 2012, అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుప బడింది. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమా నతలు (విద్య, పోషణ, చట్టపర మైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం)పై, వివక్షతపై అవగా హన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. బాలికలు, యువతులు వారివారి రంగాలలో ప్రచారం, పరిశోధన లకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబిం చేలా ఈ దినో త్సవ వేడుకలు జరుగుతాయి. ప్రపంచ అభివృద్ధికి సంబం ధించిన అనేక ప్రణాళికలలో బాలికలను చేర్చడంగానీ, వారిని పరిగణించడంగానీ చేయడం లేదు, అలాగే వారి సమస్యలను కూడా పట్టించు కోవడంలేదు. వాషింగ్టన్‌ లోని యునైటెడ్‌ స్టేట్స్‌ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ 2021లో అందించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 129 మిలియన్లకు పైగా బాలికలకు విద్య అందడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు, అదే వయస్సు గల అబ్బాయిల కన్న గంటలకుపైగా ఇంటి పనుల కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రపం చవ్యాప్తంగా, నలుగురిలో బాలికల్లో ఒకరికి 18 ఏళ్ళకంటే ముందుగానే వివాహం జరుగుతోంది.
బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయ డమే కాకుండా, ఆ సమస్యలు పరిష్కరించబడినప్పుడు జరిగే పరి ణామాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం ఉపయోగ పడుతోంది. బాలికలను విద్యావంతు లను చేసి, బాల్య వివాహాలు తగ్గించడంలో, విద్య ను అభ్యసించిన బాలికలు అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందడంలో మార్గదర్శకంగా నిలవడం ద్వారా మహిళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ డానికి కూడా సహాయ పడుతోంది.
ఇటీవల కాలంలో వివిధ ప్రాం తాలలో బాలికల మీద అత్యా చారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా మార్పు లేదు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా వుండటం వల్ల బాలి కలు బడులకు దూరం అవుతూ వున్నారు. కొన్ని ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ పాటించకుండా వుండడం వల్ల ఒక వేళ అమ్మాయిలు జన్మించిన వారికి నాణ్యమయిన విద్య అందించడం లో తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. అబ్బాయి, అమ్మాయి లను ఒకే రకంగా చూడాలి. వివక్షత వుండకూడదు. గ్రామీణ, పట్టణ పరిధిలో వున్న బాలికలు అందరూ పాటశాల కు వెళ్లేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. ఉచిత హెల్త్‌ చెక్‌ అప్‌ చేసి బల హీనంగా వున్న వారికి మందులు, పౌష్ఠికాహారం అంద చేయాలి.
మహిళల విద్యలో పెట్టుబడులు పెట్టండి అవి డైమ్‌ండ మరియు ప్లాటినం కన్న విలువ అయినవి అవుతాయి. ఈ రోజే మీ బాలికను బడికి పంపండి. రేపటి దేశం యొక్క ఉజ్వల భవిష్యత్‌ కోసం ఆమెను సిద్ధం చేయండి.

- Advertisement -
  • కామిడి సతీష్‌ రెడ్డి
    9848445134.

(నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News