Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Godavarikhani: బొగ్గు బ్లాకుల వేలం అపాలి, సింగరేణికే బొగ్గు బ్లాకులను  అప్పగించాలి

Godavarikhani: బొగ్గు బ్లాకుల వేలం అపాలి, సింగరేణికే బొగ్గు బ్లాకులను  అప్పగించాలి

కేంద్ర రాష్ట ప్రభుత్వాల  కుట్రలు

సింగరేణి సంస్థ ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకుల వేలంకు బీ.జే.పి కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నరని సింగరేణి సంస్ధపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తో సింగరేణి అస్తిత్వం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని, సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్  డిమాండ్ చేసారు. శనివారం రామగుండం రిజీయన్ 1 జిఎం కార్యాలయం ఎదుట సింగరేణి సంస్ద బొగ్గు బ్లాకుల వెలంలకు నిరసనగా టి.బి.జి.కె.ఎస్ బీ.ఆర్.ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ…  సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకులను సర్వేలు తో ప్రాసెసింగ్  చేసి బొగ్గు వెలికితీసే సాంప్రదాయం ఉందన్నారు.2011 సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ M.M.D.R  యాక్ట్ తీసుకువచ్చారని 2017 లో బిజెపి ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. బిజెపి హయాంలో MMDR  యాక్ట్ బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టిన సమయంలో నాడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పూర్తిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. మాజీ సిఎం కెసిఆర్  హయాంలో బిజేపి ప్రభుత్వం సింగరేణి సంస్దకు చెంది   బొగ్గు బ్లాకులను వేలం వేస్తామని  కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే వేలం జరగకుండా అడ్డుకున్నామని బొగ్గు బ్లాకుల వేయడానికి నిరసనగా పోరాటం చేశామన్నారు. బొగ్గు బ్లాకులను వేలం వేస్తే బొగ్గు పొరలోని  పెడదామని నాడు  హెచ్చరించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం  విక్రమార్క కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలం జరిపి సింగరేణి సంస్దను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు  పన్నుతున్నారని బొగ్గు బ్లాకుల వేలం ఆపివేయాలని బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేసేదాకా పోరాటం చేస్తామని చెప్పారు. అనంతరం జిఎంకు వినతిపత్రం అందజేసారు.


ఈ కార్యక్రమం లో టిబిజికెఏస్ నాయకులు నూనె  కోమురయ్య, మాదాసు రామమూర్తి,వడ్డెపల్లి శంకర్, పర్లపల్లి రవి, వెంకటేష్, గుండు శ్రావణ్ , చెలకలపల్లి శ్రీనివాస్, పోలాడి శ్రీనివాస్ రావు, శేషగిరి జోషప్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణదాసు, మారుతి, నూతి తిరుపతి, తోకల రమేష్ ,తిమెాతి ఇరుగురాళ్ల శ్రావణ్, సాయి కుమార్, కిరణ్, జీ కనుకయ్య తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News