ప్రార్థనా మందిరాల స్థాయిని, స్థితిగతులను మార్చే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది.జ్ఞానవాపి మసీదు విషయంలో హైకోర్టు సరైన తీర్పు ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు దగ్గర ఉన్న దేవతలను ప్రార్థన చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అయిదుగురు మహిళలు పెట్టుకున్న పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తూ, ఇక్కడ పూజలు, ప్రార్థనలు చేసుకోవడానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ లేదని తేల్చి చెప్పింది. జిల్లా కోర్టు కూడా గతంలో ఇదే విధమైన తీర్పు ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. పిటిషన్‌దార్లు ఈ మసీదు దగ్గరున్న తమ దేవతలను పూజ చేసుకునే విషయం మాత్రమే తమ పిటిషన్లలో ప్రస్తావించారని, మసీదును ఆలయంగా మార్చాలని వారేమీ కోరలేదని న్యాయమూర్తి జె.జె. మునీర్ ఈపిటిషన్లపై తీర్పు ఇస్తూ వ్యాఖ్యానించారు. 1947 ఆగస్టు 15 నాటికి అది ఏ పరిస్థితుల్లో ఉందే అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుందని ఆయన ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ (స్పెషల్ ప్రొవిషన్స్) యాక్ట్ (1991)ని ఉటంకిస్తూ వివరించారు. అది అప్పుడు మసీదుగానే ఉన్నందువల్ల ఇప్పుడు కూడా మసీదు గానే కొనసాగుతుందని, అయితే, హిందువులు ఆ జ్ఞానవాపి కింద ఉన్న ఆలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదని ఆయన స్పష్టం చేశారు.
హిందూ మహిళల పిటిషన్‌ల విషయంలో వారణాసిలోని అంజుమన్ ఇంతెజామియా మసీద్ మేనేజ్‌మెంట్ కమిటీ, ఉత్తర ప్రదేశ్ వక్ఫ్ బోర్డు తదితర సంస్థలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చారు. 1991 చట్టం ప్రకారం ఈ మసీదుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం కుదరదని ఆ సంస్థలు వాదించాయి.కాశీ విశ్వనాథ ఆలయ చట్టాన్ని (1983) కూడా అవి ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. వెనుకటికిముస్లిం రాజులుహిందూ ఆలయాలను ధ్వంసం చేసి, అక్కడ మసీదులు నిర్మించారని, అందువల్ల ఆ మసీదుల స్థానంలో మందిరాలు నిర్మించడానికి తమకు అభ్యంతరం ఉండరాదని కొన్ని హిందూ సంస్థలు వాదిస్తున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కొద్దిగా ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పుడు జ్ఞానవాపి మసీదులో ముస్లింలు, దాని కిందనే ఉన్న ఆలయంలో హిందువులు తమ తమ ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడడమే కాకుండా, జ్ఞానవాపి మసీదు ఒక మసీదుగానే కొనసాగడానికి కూడాఅవకాశం ఏర్పడింది. భవిష్యత్తులో దీనిపై హిందువులు పెత్తనం సాగించడం కూడా ఇక సాధ్యం కాదు.
పిటిషన్‌దార్లు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు మొదట్లోనే తిరస్కరిస్తూ, ఈ వివాదాస్పంద అంశం ఎక్కువ కాలం కొనసాగకుండా, దరిమిలా విద్వేషాలు రేగకుండా అడ్డుకోగలిగింది. కాగా, 1947 ఆగస్టు 15కు ముందు, ఆ తర్వాత కూడా జ్ఞానవాపిలో హిందూ దేవతలకు ప్రార్థనలు జరుగుతూ వచ్చాయి.1990లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత నుంచి ఇక్కడ పూజలు ఆగిపోయాయి.1993 నుంచి ఇక్కడ ఏడాదికి ఒక్కసారే పూజ జరుపుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.పిటిషనర్ల పిటిషన్‌లు కేవలం పూజకు మాత్రమే పరిమితమా లేక దీని వెనుక మరేదైనా వ్యవహారం ఉందా అన్నది తెలియడం లేదు. దీనిని మసీదు స్థాయి నుంచి ప్రార్థనా మందిరంగా మార్చడానికే వారు పిటిషన్లు వేయడం జరిగిందని ప్రతివాది తరఫు న్యాయవాదులు వాదించడం జరిగింది. నిజానికి, ఈ మసీదును వక్ఫ్ స్థలంలో నిర్మించారా లేక హిందువుల ప్రార్థనా స్థలంలో నిర్మించారా అన్నది తేలవలసి ఉంది.
Gyanvapi: జ్ఞానవాపిపై సరైన తీర్పు
జ్ఞానవాపి కింద ఉన్న ఆలయంలో హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదన్న సుప్రీంకోర్టు