అన్నపూర్ణగా కొనియాడుతున్న మన భారత దేశం ఆకలి కేకలతో అలసత్వపు దేహాలతో సమతు ల్యత లేని ఆహారాముతో అల్లాడుతోంది అంటే నమ్మసఖ్యం కాదేమో ,పొద్దు పొద్దున్నే దినసరి కులీనుండి ఆఫిసర్ క్యాడర్ వరకు సద్దిమూటలు కట్టుకొని బతుకు సమరానికి బయలు దేరక తప్పదాయె స్కూల్ పిల్లాడి నుండి మొదలు పండు ముసలి వరకు సంతులిత ఆహారం లేకుండానే ఆరగ్గిస్తున్నారు. సిరిదాన్యాల వాడకం ఉపందుకున్నాక జనాలకు కొంచెం సోయి వచ్చింది అని నానుడి, మంచి ఆహారం మన జీవిత కాలానికి కొలమానం అనేక తప్పదు ఆకలి కేకల బాధ భారతదేశంలో మరింతగా పెరిగింది అనిగ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో తేలిపింది. ఈ విషయంలో నాణ్యమైన ఆహారపు సప్లైలో భారత్ మరింత దిగజారింది. 121 దేశాల్లో భారత్ 107వ స్థానంలో నిలిచింది. కన్సర్న్ హంగర్, వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో శ్రీలంక, పాకిస్థాన్ కంటే ఇండియాలో ఎక్కువ ఆకలి బాధలున్నట్టు తేలింది. దీనిపై ప్రతిపక్షాలు స్పందించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిల దీశాయి. దీనిపై ప్రధాని మౌనం వీడాలని ప్రశ్నిస్తున్నాయి. దేశ భవిష్యత్తు మెరుగైన పౌర సమాజ నిర్మాణం తోనే సాధ్యం అలాంటిది జన్మతహః పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, పిల్లల మరణాలు ఈ దేశాన్ని శాశించేలా ఉన్నాయి సర్వేలో నివ్వెరపోయే విసయాలు బయట పడ్డాయి . మొత్తం 121 దేశాలను పరిగణలోకి తీసుకుని.. సర్వే జరగ్గా శ్రీలంక 64వ స్థానంలో, పాకిస్థాన్ 99 స్థానా ల్లో నిలిచాయి. నేపాల్ (81), బంగ్లాదేశ్ (84) తర్వాత భారత్ ర్యాంక్‌లో ఉంది. ఈ నివేదికల కోసం ఉపయో గించే డేటాను యూఎన్, యునిసెఫ్, ఫుడ్ అండ్ అగ్రి కల్చర్ ఆర్గనైజేషన్ మొదలైన ఇతర ఏజెన్సీల ద్వారా సేకరించారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ, ప్రాం తీయ మరియు జాతీయ స్థాయిలలో ఆకలిని నివేదించటా నికి నాలుగు ప్రధానమైన నాలుగు కంపోనెంట్ సూచికల ద్వారా సమగ్రంగా వివరించడం జరిగింది.
పిల్లల మరణాలు: పుట్టిన ఐదవ రోజుకు ముందే మరణించే పిల్లల వాటా, పాక్షికంగా పోషకాహారం మరియు సరిపోని వాతావరణాల యొక్క అనారోగ్యకర మైన ప్రాణాంతక మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది.
పిల్లల వృధా: ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయ స్సు ఉన్న పిల్లల వాటా వారి ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండకపోవటం, ఇది పోషకాహార లోపం కింద తీవ్రంగా ప్రతిబింబిస్తుంది.
చైల్డ్ స్టంటింగ్: దీర్ఘకాలిక పోషకాహార లోపాన్ని ప్రతిబింబిస్తూ, వారి వయస్సుకి తగిన ఎత్తు లేక తక్కువ ఎత్తు ఉన్న ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల వాటా.
పోషకాహార లోపం: తగినంత కేలరీల ఆహారాన్ని తీసుకోవడంతో విఫలమైన జనాభాలో వాటా.
విపత్తులు మరియు అత్యవసరాలు సమయాల్లో ఎక్కు వగా అనారోగ్యానికి, క్షోభకు గురయ్యేది. చిన్న పిల్లలే. కనుక, వీరిపై ప్రత్యేక శ్రద్ధ, సంరక్షణ చూప వలసిన అవ సరం ఉంది. ప్రపంచంలోని సుమారు 2.70 కోట్ల శరణా ర్థలు గూడు కోల్పోయిన సుమారు 3 కోట్ల మంది ప్రజల్లో 80 శాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. 1990 నుంచి 1999 మధ్య విపత్తుల కారణంగా సుమారు 200 కోట్ల మంది ప్రజలు బాధితులయ్యారు. విపత్తులు పేదవారినే నిర్ధాక్షిణ్యంగా కాటు వేస్తాయి. విపత్తు సంబంధమైన మరణాల్లో 90 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే సంభవిస్తాయి. గడిచిన దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణల కారణంగా చనిపోవటం, గాయపడటం, అనా ధలు కావటం లేదా తల్లిదండ్రుల నుంచి విడిపోయిన పిల్లల సంఖ్య సుమారు 90 లక్షల పోషకాహారం అనేది సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, శరీర ఆహార అవస రాలకు సంబంధించి పరిగణించబడుతుంది. మంచి పోష కాహారం- క్రమమైన శారీరక శ్రమతో కలిపి తగినంత, సమతుల్య ఆహారం – మంచి ఆరోగ్యానికి మూలస్తంభం. పేలవమైన పోషకాహారం రోగనిరోధక శక్తి తగ్గడానికి దారి తీస్తుంది, వ్యాధికి ఎక్కువ అవకాశం ఉంది, శారీరక మరి యు మానసిక అభివృద్ధి బలహీనపడుతుంది. మరియు ఉత్పాదకత తగ్గుతుంది. అని అనుభవజ్ఞుడైన నూట్రిస్నిస్ట్ చెప్పారు.
జాతీయ న్యూట్రిషన్ సంస్థ ఎంఐ యెన్మా నివేదికల ప్రకారం మానవులకు కావలసిన పోషకహార పదార్థాలు కూరగాయలలో పుష్కలంగా లభిస్తాయి. అందువలన మనం తీసుకొనే సమతుల ఆహారంలో కూరగాయలు ఎం తో ప్రదాన పాత్ర వహిస్తాయి. కూరగాయలు అతి తక్కువ ధరలలో లభ్యమవడమే కాకుండా వీటిలో ఉండే విట మిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు మానవుల ఆరో గ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో మేలు చేస్తాయి.తీగజాతి కూరగాయలు: బీర, కాకర, దొండ, పొట్ల, గుమ్మడి, బూడిద గుమ్మడి, దోస, కీర దోస, సోర. దుంపజాతి కూరగాయలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ఉల్లిగడ్డ, చిలగడ దుంప, కంద, చామ. చిక్కుళ్ళు: గోరు చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు(సన్న చిక్కుడు), సోయా చిక్కు డు, పందిరి చిక్కుడు. సంవత్సరం పొడవున దొరికేవి: బెండ, టోమాటో, వంగ, పచ్చి మిరప.
భారతదేశ ఆర్థిక భద్రత వ్యవసాయ రంగంపై అం చనా వేయబడుతూనే ఉంది మరియు భవిష్యత్తులోనూ పరిస్థితి మారే అవకాశం లేదు. ఇప్పుడు కూడా, వ్యవసా యం జనాభాలో 58% మందికి మద్దతు ఇస్తుంది, స్వాతం త్య్రం వచ్చినప్పుడు 75% మంది ఉన్నారు. అదే కాలంలో, స్థూల దేశీయోత్పత్తికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సహకారం 61 నుండి 19%కి పడిపోయింది. నేటికి, భారతదేశం ప్రపంచ జనాభాలో 16.8% ప్రపంచ నీటి వనరులలో 4.2% మరియు ప్రపంచ భూభాగంలో 2.3% మద్దతు ఇస్తుంది. మరియు ప్రపంచ సగటుతో పోల్చితే వనరుల లభ్యత దాదాపు 4 నుండి 6 రెట్లు తక్కు వ. పెరుగుతున్న జనాభా ఒత్తిడి మరియు తత్ఫలితంగా వ్యవసాయేతర అవసరాల కోసం భూమిని మళ్లించడం వల్ల ఇది మరింత తగ్గుతుంది.
ప్రపంచ సగటులో 11%తో పోలిస్తే భారతదేశ భౌగో ళిక ప్రాంతంలో 51% ఇప్పటికే సాగులో ఉంది. ప్రస్తుతం 136% ఉన్న పంటల తీవ్రత స్వాతంత్య్రం తర్వాత 25% మాత్రమే పెరిగింది. ఇంకా, మొత్తం నికర విత్తన విస్తీర్ణంలో వర్షాధార పొడి భూములు 65% ఉన్నాయి. భూమి (107 మిలియన్ హెక్టార్లు) మరియు భూగర్భజల వనరులు అపూర్వమైన క్షీణత కూడా ఉంది మరియు మొత్తం కారకాల ఉత్పాదకత వృద్ధి రేటులో కూడా పడిపోతుంది. 2050 నాటికి జనాభాలో పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి ఈ మందగమనాన్ని నిర్బంధించాలి మరియు వ్యవసాయ ఉత్పాదకతను రెట్టింపు చేయాలి. ఉత్పత్తిని పెం చడానికి ఉత్పాదకతలో సమర్థత-మధ్యవర్తిత్వ మెరుగుదల అత్యంత ఆచరణీయమైన ఎంపిక.
పోషకాహార లోపం మరియు ఆకలి కారణంగా సం వత్సరానికి 3.1 మిలియన్ల పిల్లలు మరణిస్తున్నారు. ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలలో దాదాపు సగం. వారి శరీరంలో ప్రాథమిక పోషకాలు లేకపోవడం వల్ల పిల్లలు చనిపోతారు. అంతే కాకుండా, మన దేశంలో ఆకలి మరియు పోషకాహార లోపం కారణంగా ప్రతిరోజూ దాదాపు 4500 మంది ఐదే ళ్లలోపు పిల్లలు చనిపోతున్నారని, ఆకలితో పిల్లలు మాత్ర మే ప్రతి సంవత్సరం మూడు లక్షలకు పైగా మరణి స్తున్నారు. అయితే దేశంలో అభాగ్యులు అన్నార్థులు ఆకలికి డొక్కలెండుతుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవా త్మక కార్యక్రమాలు : ఈట్ రైట్ ఇండియా మూవ్‌మెంట్: పౌరులు సరైన ఆహారాన్ని తీసుకోవడానికి వారిని ప్రోత్స హించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నిర్వహించిన ఔట్‌రీచ్ యాక్టి విటీ. పోషణ్ అభియాన్: మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2018లో ప్రారంభించింది, ఇదిమహిళా కుంగుబాటు, పోషకాహార లోపం, రక్తహీనత (చిన్న పిల్ల లు, మహిళలు మరియు కౌమారదశలో ఉన్న బాలిక లలో) తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన: మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన కేంద్ర ప్రాయోజిత పథకం, ప్రసూతి ప్రయోజన కార్య క్రమం 1 జనవరి, 2017 నుండి దేశంలోని అన్నిజిల్లాల్లో అమలు చేయబడుతోంది.
ఫుడ్ ఫోర్టిఫికేషన్: ఫుడ్ ఫోర్టిఫికేషన్ లేదా ఫుడ్ ఎన్‌రిచ్‌మెంట్ అనేది కీలకమైన విటమిన్లు మరియు ఐరన్, అయోడిన్, జింక్, విటమిన్ ఎ అండ్ డి వంటి ఖనిజాలను బియ్యం, పాలు మరియు ఉప్పు వంటి ప్రధాన ఆహారాలకు వాటి పోషకాలను మెరుగుపరచడానికి జోడించడం. జాతీ య ఆహార భద్రతా చట్టం, 2013: ఇది 75% గ్రామీణ జనాభాకు మరియు 50% పట్టణ జనాభాకు టార్గెటె్‌డ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సబ్సిడీ ఆహార ధాన్యా లను పొందేందుకు చట్టబద్ధంగా హక్కును కల్పించింది. మిషన్ ఇంద్రధనుష్: ఇది 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను 12 టీకా-నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు వేయడా నికి లక్ష్యంగా పెట్టుకుంది.
మిషన్ ఇంద్రధనుష్: ఇది 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను 12 టీకా-నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు వేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది.నేషనల్ హెల్త్ మిషన్, సేవ్ ఫుడ్ షేర్ ఫుడ్ మారియో ఫుడ్ ప్రాసెసింగ్ సేఫ్టీ ఇతర పథకాలతో కలయిక: ఆర్థిక, ఆరోగ్యం, నీరు, పారిశుధ్యం, లింగ దృక్పథాలు మరియు సామాజిక నిబంధనలు మెరు గైన పోషకాహారానికి దోహదపడే పోషకాహారం కేవలం ఆహారానికి సంబందించే కాదు కులం, మతము లింగ విద్వేషాలు లేకుండా ఈ పథకాలన్నీ సరిగ్గా అమలు చేయ డం ద్వారా కొంతయినా ఏ ఆకలి బాధలను అరికట్టొచ్చు అని ప్రజలు నమ్ముతున్న మాట.
ఈ రోజుల్లో కూడా దృఢసంకల్పంతో అకుంఠిత దీక్షతో సమిష్టి సంఘాల సమన్వయము తో ఈ ఆకలి ని జయించడం పెద్ద సమస్యేమీ కాదేమో ఆలోచంచి ఏ డిజి టల్ యుగంలో ఆన్ లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఆకలి చావులంటే ఆచర్యమే కాదు, ప్రస్తుతం 44 దేశాలు తీవ్రమైన లేదా ‘ఆం దోళన కలిగించే’ ఆకలి స్థాయిలను కలిగి ఉన్నాయి మరియు ‘పెద్ద మార్పు లేకుండా, ప్రపంచం మొత్తం లేదా దాదాపు 46 దేశాలు 2030 నాటికి జీహెచ్‌ఐ నివేదికల ఆధారంగా తక్కువ సమయంలో ఆకలిని అధిగమించగల మని అంచనా వేస్తున్నారు.
డాక్టర్ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్ & ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
- 9705890045