మార్చి23న ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వాతావరణ సంస్థ మార్చ్19 నాడు స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ నివేదిక విడుదల చేయబడింది. ప్రపంచ వాతావరణ సంస్థ అనేది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. కోపెన్‌హాగన్లో మార్చి 21-22 తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాతావరణ నాయకులు మరియు మంత్రులు కాప్( COP) 28 తర్వాత మొదటిసారిగా సమావేశమవుతారు. వాతావరణ సంక్షోభం అనేది మానవాళి ఎదుర్కొంటున్న సవాలు, అసమానత సంక్షోభంతో ముడిపడి ఉంది పెరుగుతున్న ఆహార అభద్రత, జనాభా స్థానభ్రంశం, జీవవైవిధ్య నష్టం వంటివి వీటికి నిదర్శనాలు. వీటిని పరిశీలిద్దాం.
2023 రికార్డుల బ్రేకింగ్ సంవత్సరం:
భూవాతావరణాన్ని వేడెక్కించే కార్బన్డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అనే మూడు ప్రధాన గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రతలు 2022లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పారిశ్రామికీకరణ కాలం (1850-1900 ) ముందరి కంటే 50% ఎక్కువకు చేరుకున్నాయి. 2023 లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.45 డిగ్రీల సెల్సియస్ అనేది పారిశ్రామికీకరణ కాలం ముందరి సగటు కంటే ఎక్కువగా ఉంది. 2016లో సగటు 1.29 డిగ్రీల, 2020లో 1.27 డిగ్రీల సెల్సియస్గా ఉన్న మునుపటి వెచ్చని సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. పదేళ్ల ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 1.20 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. 174 సంవత్సరాల పరిశీలనా రికార్డులో 2023 అత్యంత వెచ్చని సంవత్సరం. సెప్టెంబరు 2023లో మునుపటి ప్రపంచ రికార్డును విస్తృత మార్జిన్‌తో (0.46 డిగ్రీల సెల్సియస్ నుండి 0.54 డిగ్రీల సెల్సియస్ )అధిగమించింది. ఇది 2023 మధ్యలో లానినా నుండి ఎల్ నినో పరిస్థితులకు మారడం 2022 నుండి 2023 వరకు ఉష్ణోగ్రత వేగంగా పెరగడానికి దోహదపడింది. గ్లోబల్ సగటు సముద్ర-ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగి ముందరి రికార్డును బద్దలుకొట్టింది. 2023లో సముద్రపు వేడి అత్యధిక స్థాయికి చేరుకుంది. గత రెండు దశాబ్దాల్లో వార్మింగ్ రేట్లు కంటే పెరుగుదలను చూపుతున్నాయి. కార్బన్డయాక్సైడ్ను గ్రహించడం వల్ల సముద్రపు ఆమ్లీకరణ పెరిగింది. 2023లో ప్రపంచ సగటు సముద్ర మట్టం ఉపగ్రహ రికార్డులో (1993- 2002) రికార్డు స్థాయికి చేరుకుంది. నిరంతర సముద్ర వేడికి హిమానీనదాలు, మంచు పలకల కరుగుతాయి. గత పదేళ్లలో (2014–2023) ప్రపంచ సగటు సముద్ర మట్టం పెరుగుదల రేటు ఉపగ్రహ రికార్డు మొదటి దశాబ్దంలో సముద్ర మట్టం పెరుగుదల రేటు కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. గ్రీన్‌ల్యాండ్ ఐస్ షీట్ , అంటార్కిటిక్ ఐస్ షీట్ అనేవి రెండు ప్రధాన మంచు పలకలు కరిగాయి. 1992-1996 నుండి 2016-2020 వరకు సంవత్సరానికి వరుసగా 105 నుండి 372 గిగాటన్‌లకు సామూహిక నష్టం యొక్క సగటు రేట్లు పెరిగాయి. 2022-2023 హైడ్రోలాజికల్ సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా హిమానీనదాలు వాటి మిగిలిన పరిమాణంలో 10% కోల్పోయాయి. పశ్చిమ ఉత్తర అమెరికా 2023లో రికార్డు స్థాయిలో హిమానీనద ద్రవ్యరాశి నష్టాన్ని చవిచూసింది. యూరోపియన్ ఆల్ప్స్ , స్విట్జర్లాండ్‌లో హిమానీనదాలు గతం కంటే ఎక్కువగా కరిగాయి. ఇది 2000-2019 మధ్య కాలంలో కొలిచిన రేట్ల కంటే ఐదు రెట్లు ఎక్కువ. పశ్చిమ ఉత్తర అమెరికాలోని హిమానీనదాలు 2020-2023 కాలంలో వాటి 2020 వాల్యూమ్‌లో 9% కోల్పోయాయి. విపరీత వాతావరణం మరియు వాతావరణ సంఘటనలు:
విపరీతమైన వాతావరణ సంఘటనలు అన్ని జనావాస ఖండాలపై ప్రధాన సామాజిక-ఆర్థిక ప్రభావాలను చూపాయి. వీటిలో పెద్ద వరదలు, ఉష్ణమండల తుఫానులు, తీవ్రమైన వేడి, కరువు, అడవి మంటలు ఉన్నాయి. మధ్యధరా తుఫాను వలన డేనియల్ గ్రీస్, బల్గేరియా, టర్కియే, లిబియాలలో వరదలు వచ్చాయి. లిబియాలో భారీ ప్రాణనష్టం జరిగింది. ట్రాపికల్ సైక్లోన్ మోచా శ్రీలంక, మయన్మార్, భారతదేశం, బంగ్లాదేశ్ లలో 1.7 మిలియన్ల స్థానభ్రంశాలను కలిగించడమే కాక తీవ్రమైన ఆహార అభద్రతను మరింత దిగజార్చింది. ఇటలీ, ట్యునీషియా, అగాదిర్ (మొరాకో), అల్జీర్స్ (అల్జీరియా)లలో వరుసగా 48.2 డిగ్రీల, 49.0 డిగ్రీల, 50.4 డిగ్రీల 49.2 డిగ్రీల సెల్సియస్ల రికార్డు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పు వలన సముద్రపు వెచ్చదనం, హిమానీనదం తిరోగమనం, అంటార్కిటిక్ సముద్రపు మంచు నష్టం వంటివి ప్రత్యేక ఆందోళన కలిగిస్తున్నాయి. 2023లో సగటున ఒక రోజున ప్రపంచ మహాసముద్రంలో దాదాపు మూడింట ఒక వంతు సముద్రపు హీట్‌వేవ్‌లో చిక్కుకుంది. ఇది ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలు మరియు ఆహార వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. 2023 చివరి నాటికి, సముద్రంలోని 90% పైగా సంవత్సరంలో ఏదో ఒక సమయంలో హీట్‌వేవ్ పరిస్థితులను ఎదుర్కొంది. కోవిడ్-19 ముందు 149 మిలియన్ల ప్రజల నుండి 2023 నాటికి 333 మిలియన్ల మందికి ( ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా పర్యవేక్షించబడే 78 దేశాలలో ) ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆహార భద్రత లేని వారి సంఖ్య రెండింతలు పెరిగింది. వీటికి వాతావరణం, వాతావరణ తీవ్రతలు మూల కారణం కాకపోవచ్చు కానీ అవి తీవ్రతరం చేసే కారకాలు. ఆర్థిక మాంద్యం, అధిక ఆహార ధరలు, సంఘర్షణల కారణంగా వ్యవసాయ వ్యయాలు పెరిగాయి. వాతావరణ తీవ్రతల ప్రభావాల వల్ల ఇది తీవ్రతరం అవుతుంది. వరదలు విస్తారమైన వ్యవసాయ ప్రాంతాలను ముంచెత్తాయి. పంటలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర నష్టాన్ని కలిగించాయి.తీవ్రమైన వాతావరణం సామాజిక-ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది.
ఊరటనిచ్చే అంశాలు:
పునరుత్పాదక శక్తి వనరులైన సూర్యరశ్మి, గాలి, నీరు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే గణనీయమైన శక్తి పరివర్తన జరుగుతోంది. 2023లో పునరుత్పాదక సామర్థ్యం జోడింపులు 2022 నుండి 510 గిగావాట్లు అనగా దాదాపు 50% పెరిగాయి. ఇటువంటి వృద్ధి గత రెండు దశాబ్దాలలో గమనించిన అత్యధిక రేటును సూచిస్తుంది మరియు కాప్(COP) 28 వద్ద నిర్దేశించబడిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాన్ని 2030 నాటికి 11,000 గిగావాట్లుకు చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా మూడు రెట్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.
జనక మోహన రావు దుంగ
8247045230