ఎందరో అమరవీరుల, యోధుల త్యాగఫలమే మనకు ఈనాడు లభించిన ఈ స్వేచ్ఛ, స్వా తంత్య్రాలు .ప్రతి ఏడాది మన భారతీయులంతా ఎంతో ఘనంగా, అట్టహాసంగా జరుపుకునే పండుగే ఈ ఆగస్టు 15 జెండా పండుగ. బ్రిటిష్ వారి ద్రాస్య శృంఖలాల నుం చి, కబంద హస్తాల నుంచి మన భారతదేశాన్ని బంధ విముక్తులు గావించి చాలా సగర్వంగా భారతీయులు తమ స్వేచ్ఛ స్వాంతంత్య్రాలను సంపాదించుకున్నారు. అయితే ఈ శుభ సందర్భం కోసం, ఈ చారిత్రాత్మిక రోజు కోసం, భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ప్రసాదించేందుకు ఎందరో అమర వీరులు, స్వాంతంత్య్ర సమర యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, జైళ్లలో మగ్గి, బ్రిటిష్ పోలీసువారి లాఠీ దెబ్బలు తిని మరీ ఈ గొప్ప కార్యాన్ని, వెలకట్టలేని విజయాన్ని ఈ కోట్లాదిమంది భారతదేశ ప్రజా నీకానికి కట్టబెట్టడంతో కృత కృత్యులయ్యారు. ఈ చిరస్మర ణీయ,అసాధారణ విజయం వెనుక ప్రతి భారతీయుడు తమ వంతు పాత్రను అంతో ఇంతో పోషించారు. అనే మాట ఎవరు కాదనలేని వాస్తవం. ఈ జెండా పండుగ ప్రత్యేకత ఏమంటే కుల, వర్గ, జాతి మతాలకు అతీతమై నది. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు సోదరభావంతో కలిసి మెలిసి ఈ పర్వదినాన ఆనాటి మధుర శృతులను, స్వాతంత్య్ర సమరయోధుల పోరాటపటిమను, నిస్వార్థ సేవలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని భుజస్కందాలపై ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన జాతిపిత అహింసావాది స్వర్గీయ శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ సెలవిచ్చినట్లుగా ‘ప్రతి భారతీయ ్రస్రీ అర్ధరాత్రి నడిరోడ్డుపై స్వేచ్ఛగా నడ యాడినప్పుడే, సంచరించినప్పుడే నిజమైన స్వేచ్ఛ, స్వాతం త్య్రాలు మనకు లభించినట్లు’ అన్న ఎంతో అమూల్యమైన, విలువైన మాటలను ఒక్కసారి స్ఫూరణకు తెచ్చుకొని అలాంటి ఆరోగ్యకరమైన, సుభిక్షమైన వాతావరణాన్ని మన భారతదేశంలో కల్పించేందుకు ప్రతి ఒక్కరు ఓక సైని కునిలా, మడమ తిప్పని యోధునిలా పని చేయాల్సిన ఆవ శ్యకత, గురుతర బాధ్యత మన భుజస్కంధాలపై ఎంతైనా ఉంది. ఏదిఏమైనా ఆనాడు మనకు ఆ మహానుభావులు, అంచెలంచెల దేశభక్తే పరమావధిగా జీవించిన దార్శని కులు, గొప్ప వ్యక్తులు అందించిన ఈ సుమధుర ఫలాలే మనం ఈనాడు కోట్లాది మంది భారతీయులు స్వేచ్ఛగా జీవించేందుకు దోహదపడ్డాయి అనే నగ్న సత్యాన్ని ఏ ఒక్కరు మరువరాదు. ఇదే ఆ మహోన్నత దేశభక్తులకు త్యాగధనులకు మనమిచ్చే నిజమైన, ఘనమైన నివాళి, జైహింద్. జయహో భారతమాతాకి జై, హమారా భారత్ మహాన్!
జాతీయ జెండా నియమాలు
ఆగష్టు 15న 77 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను దేశ వ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగుర వేయడం జరు గుతూ వుంది. చాల వరకు ఈ రోజులలో జాతీయ జెండా నియమాలు తెలియని వారు ఎందరో వున్నారు..కావున ఈ నియమాలు అందరూ తెలుసుకుని పాటించుదాం. 2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి. జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలి యకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి. కాగా రాజ్యాం గా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది. జెండా కోడ్ ప్రకారం సెక్షన్ 5 రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో పూలు పెట్టి ఎగుర వేయవచ్చు.
జెండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య
1.విధాన నిర్ణాయక సంస్థలు, (బాధ్యులు ప్రధాని, ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ చైర్మెన్, గ్రామ సర్పంచు మొదలగు వారు).
2.కార్యనినిర్వహణ సంస్థలు.(రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ యం.పి.డి.ఓ,యం.ఆర్.ఓ, హెడ్ మాష్టర్ ప్రిన్సి పాల్) అనేవి ఈ విధంగా రెండు రకాలు.
3.పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాల్లో 15 ఆగష్టు, 26 జనవరి నందు ప్రధా నోపాధ్యాయులే. జాతీయ జెండాను ఎగుర వేయాలి.
సాధారణ నియమాలు
1.జాతీయ జెండా చేనేత ఖాది, కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి.
- జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300x 4200 మి.మీ. నుండి 150×100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది.
- ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు.
4.పై నుండి కిందకు 3 రంగులు సమానంగా ఉండాలి. - జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు.
- జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రిం టింగులు ఉండరాదు.
- జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి.కిందికి వంచకూడదు.
- జెండాను వడిగా, (వేగంగా) ఎగురవేయాలి.
- జెండాను ఎగురవేయడం, మరియు దించడం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపున చేయాలి.
- జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకు లుండాలి.
- జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు. అది నేరం..దానిని కాల్చివేయాలి. ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు.
12.ఒకవేల వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వచ్చినచో జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి.
13.జెండాను ఎగుర వేయునపుడు జాతీయ నాయ కుల ఫోటోలు ఉంచాలి.
14.జెండాను ముందుగా 1,2 సార్లు పరిశీలించు కోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయ రాదు.
15.జెండా పోల్ నిటారుగా ఉండాలి. వంకరగా ఉండరాదు. కొన్ని సార్లు విరిగిన సందర్భాలు జరిగినవి. జాగ్రత్త వహించాలి.
16.విద్యార్థుల జేబులకు ఉంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడ వేయనీయరాదు. వాటిని తొక్క నీయరాదు. వాటిని వీలయితే అన్ని ఏరి కాల్చి వేయాలి. పిల్లలకు తప్పని సరిగా జెండా నియమాలు చెప్పి పాటింప చేయాలి. జాతీయ గేయం పాడునపుడు పాటించే నియ మాలు చెప్పాలి.
17.వీలైనంత వరకు పురికోసలకు కట్టే పరారలకు త్రివర్ణ పతాకాలను (చిన్నవి) అతికించరాదు. రంగు రం గుల కాగితాలు మాత్రమే అతికించాలి. రెడీమేడ్ ప్లాస్టిక్ వి త్రివర్ణ పతాకాలు కడుతున్నాం వాటిని కూడా వాడరాదు.
భారత జాతీయ పతాకంలో గల అశోక చక్రం దాని వివరాలు
అశోకచక్రం, ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు. అశోక చక్రవర్తి (273 – 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్థంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటు చేసుకు న్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు. ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్‌లో ‘నీలి ఊదా’ రంగు లో గలదు. ప్రఖ్యాత ’సాండ్‌స్టోన్’ (ఇసుకరాయి)లో చెక్క బడి ‘నాలుగు సింహాల’ చిహ్నం. సారనాథ్ సంగ్రహాల యంలో గలదు. ఇది అశోక స్థంభం పైభాగాన గలదు. దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగినది. భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది. డిజైను వెనుక గల చరిత్ర మరియు కారణాలు.
ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మింపబడినది.
చక్ర అనేది సంస్కృత పదము, దీనికి ఇంకో అర్థం, స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తి చేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది ’గుర్రం’ ఖచ్చి తత్వానికీ మరియు ‘ఎద్దు’ కృషికి చిహ్నాలు.
ఈ చక్రంలో గల_
24 ఆకులు (స్పోక్స్), 24 భావాలను సూచిస్తాయి. - ప్రేమ, 2. ధైర్యము, 3. సహనం, 4. శాంతి, 5. కరుణ, 6. మంచి, 7. విశ్వాసం, 8. మృదుస్వభావం, 9. సంయమనం, 10. త్యాగనిరతి, 11. ఆత్మార్పణ, 12. నిజాయితీ, 13. సచ్ఛీలత, 14. న్యాయం, 15. దయ, 16. హుందాతనం, 17. వినమ్రత, 18. దయ, 19. జాలి, 20. దివ్యజ్ఞానం, 21. ఈశ్వర జ్ఞానం, 22. దైవనీతి (దివ్యనీతి), 23. దైవభీతి (దైవభక్తి), 24. దైవంపై ఆశ/ నమ్మకం/ విశ్వాసం
ఈ ఇరవైనాలుగు ఆకులు (స్పోక్స్), 24 గంటలూ భారత ప్రగతిని సూచిస్తాయి. ఈ నియమాలను ఖచ్చి తంగా అందరం పాటించుదాం. స్వాతంత్ర దినోత్సవ వేడు కలను నిర్వహించుకుందాం. దేశ భక్తి ని చాటుకుందాం. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి అమరులయిన జాతీయ నాయకులను, వారి త్యాగాలను స్మరించు కుందాం. జై హింద్, జై భారత్.
- కామిడి సతీష్ రెడ్డి,
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
9848445134.