‘నేను చీకట్లో కూర్చొని, చీకటిని తిట్టుకోవడం కన్నా, చిన్నదీపం వెలిగించే ప్రయత్నం చేస్తాను. విజయం నన్ను తప్పక వరిస్తుందనే‘ విషయాన్ని నమ్మి, తన కష్టాలను లెక్క చేయకుండా ఎంతో శ్రమపడి,నేడు ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా పేరుగాంచిన ‘సర్ ఐజాక్ న్యూటన్’ వర్ధంతి సందర్భంగా వారిని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.
ప్రపంచానికి విశ్వ రహస్యాలను విప్పిచెప్పిన ‘సర్ ఐజాక్ న్యూటన్’ ఒక భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్తే కాకుండా ఒక తత్వవేత్త కూడా. ప్రకృతి సిద్ధమైన తత్వ శాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను ‘సైన్సు పితామహుడు’ అని అంది.
1643వ సంవత్సరంలో జనవరి 4వ తేదీన నవ మాసాలు నిండకుండానే జన్మించిన చిన్నబాలుడు, పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చు కుంటారని ఆ రొజు ఎవరు ఊహించలేదు. ఆ బక్క చిక్కిన చిన్నబ్బాయే ‘సర్ ఐజాక్ న్యూటన్’.
ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో వెలుచున్న, శాస్త్ర పరిజ్ఞానంలో అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నా మంటే అందుకు ముఖ్యంగా ‘న్యూటన్ గమన నియమాలు’ ఆధారం. అలాంటి ఉన్నత ప్రయోగాలతో ప్రపం చం మరవని వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ‘ఉల్‌తోప్’ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. న్యూటన్ జన్మించిన సమయంలో అతను నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా బరువు తక్కువగాను, బలహీనంగాను ఉండేవాడు. చూసిన వాళ్లంతా అసలీ శిశువు బ్రతుకుతాడా లేదా అనుకున్నారు. న్యూటన్ తండ్రి, న్యూటన్ జననానికి మూడు నెలల ముం దు మరణించడం, తల్లి కొద్ది రోజులకే రెండవ వివాహం చేసుకోవడం వల్ల న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లి దండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగవలసి వచ్చింది. తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించక, చాలా తక్కువగా మాట్లాడుచు, ఎక్కువగా ఆలోచించే వాడు. న్యూటన్ చిన్న ప్పుడు తరగతి గది చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయడం, చిన్న చిన్న మిషన్లు రూపొందించడం, నీటి గడియారం, ఎండ గడియారం లాంటివి తయారు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టేవాడు.
ఉన్నత చదువుల కొరకు స్కాలర్షిప్ అవసరమని గ్రహించిన న్యూటన్, స్కాలర్ షిప్ కోసం ఎంత ప్రయత్నించినా, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ పొందలేక పోయాడు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యులు ఆయనకు నాలుగు సంవత్సరముల వరకు స్కాలర్షిప్ ఇచ్చి, తనకు నచ్చిన అంశాలపై పరిశోధించడం కోసం ప్రోత్సాహం అందించడం విశేషం.
ఈ వచ్చిన అవకాశాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకొని, పూర్తి సమయం ‘లెక్కలు మరియు భౌతిక శాస్త్రం’ అభ్యాసానికే వినియోగించాడు.
న్యూటన్ 1661లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో చేరి గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై ఉన్న మక్కువతో అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. 1667లో ‘పరావర్తన దూరదర్శినిని’ నిర్మించి సంచలనం సృష్టించి, చిన్నతనంలో చెట్టు నుంచిరాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో ‘గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని’ ప్రతి పాదించి, ‘న్యూటన్ మూడు గమన నియమాలుగా’ ప్రసిద్ధి గాంచిన గొప్ప విషయాలను కూడా ప్రపంచానికి అం దించి, భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ ‘ప్రిన్సిపియా మేథమేటికా’ అనే గ్రంథాన్ని కూడా రచించాడు.
న్యూటన్ 1969లో ట్రినిటీ కాలేజిలో ఉండే సమ యంలో తన ఆలోచనలను రాసుకున్న పుస్తకాలను పరిశీ లిస్తే, ఆ పుస్తకాలు ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవిగా గుర్తిం చబడ్డాయి. న్యూటన్ 1665లో ‘కేంబ్రిడ్జి యూనివర్సిటీ’ నుండి ‘బాచిలర్ డిగ్రీ’ పొంది, ప్లేగు వ్యాధి వలన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం రెండు సంవత్సరాల పాటు మూసివేసి నందున, న్యూటన్ ‘ఊల్స్ తోర్ప్’కు తిరిగి వచ్చి భౌతిక మరియు గణిత శాస్త్ర అధ్యయనంలో రెండు సంవత్సరాల కాలం గడిపారు. ఈ కాలంలో, రకరకాల పరిశోధనలు చేశాడు. అదే సంవత్సరంలో న్యూటన్ ‘ప్రిన్సిపియా’ అని ఒక సంకలనం తయారు చేశారు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687లో ప్రచురించబడినది. ఆ న్యూటన్‌కు 1672లో ‘రాయల్ సొసైటీ ఫెలోషిప్’ లభిం చింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను ‘భౌతిక శాస్త్ర పితామహుడు’ అంటారు.1705లో బ్రిటిష్ ప్రభుత్వం ‘సర్’ అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటి నుంచి ఐజాక్ న్యూటన్, ‘సర్ ఐజాక్ న్యూటన్‌గా‘ మారిపోయారు.రాయల్ సొసైటీ అధ్యక్షుడు ‘రాబర్ట్ హ్క్” 1703లో మరణించినందున న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ మరియు అశాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. ప్రొఫెసర్ న్యూటన్ జీవి తం మొత్తం భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్ర సేవలకే అంకితం చేశారు. లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చిన మార్గం మరియు గమ్యం మార్చకూడదనే నియమాన్ని నమ్మి,నేడు విశ్వవ్యాప్తంగా వెలుగొందుచున్న సర్ ఐజాక్ న్యూటన్ ‘మార్చి 20, 1727‘ రోజున మరణించాడు. న్యూటన్ జీవితం, న్యూటన్ ప్రయోగాలు మానవ మనుగడ ఉన్నన్నాళ్లు సజీవం మరియు ఆదర్శం.
- గడప రఘుపతిరావు
9963499282