Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Jai Jawan Jai Kisan: జై జవాన్‌..జై కిసాన్‌..

Jai Jawan Jai Kisan: జై జవాన్‌..జై కిసాన్‌..

జై జవాన్ జై కిసాన్ కేవలం నినాదం కాదు మన జాతి పురోగతికి చోదకశక్తి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్క పౌరుడు తప్పని సరిగా ఇద్దరు గురించి తెలుసుకోవాలి. వారే మన దేశ ప్రజలుని రక్షించే జవాన్‌. ప్రజల ఆకలిని తీర్చే కిసాన్‌. ఈ ఇద్దరూ ఎండలో, వానలో, చలిలో పని చేస్తారు. ముందుగా రైతులు గురించి చెప్పాలంటే రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు. అందరి కడుపులు నింపేవాడు. వ్యవసాయం తప్ప ఇంకో పని ఎరుగని వాడు.తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. నిత్య కృషీవలుడు. పండించడం మాత్రమే తెలిసిన అమాయకుడు. రైతులు జాతికి ఆత్మ. భారతదేశంలో దాదాపు మూడింట రెండొంతుల మంది ఉపాధి పొం దే ఏకైక మార్గం వ్యవసాయం. ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే పంటలు, పప్పులు, కూరగాయలు రైతులు పండిస్తున్నారు. వారు చాలా కష్టపడి పని చేస్తారు, కాబట్టి మనం ప్రతిరోజూ ఆహారం తీసుకుంటున్నాం. కాబట్టి, మనం భోజనం చేసినప్పుడల్లా, ఆహారం తిన్నప్పుడల్లా రైతుకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ప్రధానమైన రంగం వ్యవసాయరంగం. దీనిలో రైతులదే కీలక పాత్ర. మన దేశంలోని మొత్తం జనాభాలో 72.8% మంది ఇప్పటికీ గ్రామంలోనే నివసిస్తున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం లేదా దాని సంబంధిత వ్యవసాయ పరిశ్రమ నుండి జీవనోపాధి పొందు తున్నారు. వ్యవసాయం తరచుగా గ్రామీణ సమాజాలకు వెన్నెముక. గ్రామీణ ప్రాంతాలను ఉత్సాహంగా మరియు అభివృద్ధి చెందడంలో రైతులు కీలక పాత్ర పోషిస్తారు. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జి. డి.పి)కి తోడ్పడటంలో అన్నదాతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఒక భారతీయ రైతు చాలా కష్టపడి పనిచేస్తాడు. తెల్లవారుజామున లేచి, తన నాగలిని తీసుకొని, పగటిపూట కూడా తన పశువులతో తన పొలానికి వెళ్తాడు. వాతావరణ కష్టాలను పట్టించుకోకుండా రోజంతా అక్కడే పని చేస్తాడు. చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షమైనా అతనికి ఒకటే. అతను తన పొలంలో విత్తడం, దున్నడం లేదా కోయ డం. చలిలో అలాగే వేడి గాలులు లేదా వేసవిలో పని చేస్తారు. రైతుల పండించే పద్ధతులు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపు తాయి. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు సహజ వనరులను సంరక్షించ డానికి, గ్రీన్హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మరియు, జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఉపాధి మరియు ఉత్ప త్తి పరంగా ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ప్రధాన దోహదపడుతుంది. రైతులు వారి ఉత్పాదకత, లాభదాయకత మరియు జీవన నాణ్యతకు ఆటంకం కలిగించే అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
విద్యార్హత లేకపోవడంతో చాలా మంది రైతులు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతు న్నారు. వీరు పండించే పంటలను విక్రయించడానికి ఇప్పటికీ దళా రులపైనే ఆధారపడుతున్నారు. వీరు రైతులను మోసం చేస్తున్నారు.
మంచి పంటకు మంచి విత్తనాలు ఉండటం చాలా అవసరం. కానీ ఇప్పటికీ కొంత మంది వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తు న్నారు. తక్కువ ధరకి వస్తున్నాయనో లేదా అరువుగా ఇస్తున్నారనో, అవగాహనా లోపంతోనో చాలామంది రైతులు ఇటువంటి వ్యాపా రుల దగ్గర విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలే కాకుండా ఎరువుల విషయంలో కూడా ఇలానే జరగడం వలన, సరైన పంట ఉత్పత్తి కాక రైతులు ఉసురూ మంటున్నారు. ఇంకా ప్రకృతి కూడా వీరికి సహకరించాలి. దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం వర్షా ధారం పైనే ఆధారపడివుంది. ఋతు పవనాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఇవి ఏమైనా తేడా చసాయో రైతు పని గోవిందా..! ఒక్కో సారి ఎండలు అధికంగా ఉండం, పంటకు నీరు అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడం లేదా నీరు అవసరం లేనప్పుడు ఎక్కువ వర్షాలు కురవడమో జరుగుతుంది. ఈ విధమైన అతివృష్టి, అనా వృష్టి, పంట ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ఇంకా చీడ పురుగులు దాడి చేసే అవకాశం ఉంది. వీటిని నివారించడానికి పురుగు మం దులు అవసరం. ఇక్కడ కూడా మరలా నకిలీలతో మోసపోతున్నాడు. అందరూ స్వంత వ్యవసాయ కమతాలు కలిగి ఉండరు. ఇంకో పెద్ద రైతు దగ్గర వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకు తీసుకుంటారు. పంట సరిగా పండకపోతే వీరు మరింత పేదరికంలోనికి నెట్టబడుతున్నారు.
ఇక సైనికులు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే…. దేశంలో మనంతా ధైర్యంగా, స్వేచ్ఛగా, రాత్రిళ్ళు హాయిగా నిద్ర పోతూ జీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను కంటికి రెప్పలా కాపాడు తోన్న వారే సైనికులు. ముఖ్యంగా, మంచు కొండల్లో, గడ్డ కట్టే చలి, ఏడారులు, లోయల్లో నిద్రాహారాలు మానుకుని మనకు భద్రత కల్పిస్తున్నారు. అందుకే …. జై జవాన్‌….. జై కిసాన్‌…!!!

  • డిజె మోహనరావు
    టీచర్‌
    9440485824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News