Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Jayashankar Sir Jayanthi: తెలంగాణ జాతి పిత, ఉద్యమ కెరటం ఆచార్య జయశంకర్‌ సార్‌

Jayashankar Sir Jayanthi: తెలంగాణ జాతి పిత, ఉద్యమ కెరటం ఆచార్య జయశంకర్‌ సార్‌

తెలంగాణ రాష్ట్రం నష్ట పొయిందని ఉద్యమించిన సార్

తెలంగాణ ఉద్యమ నేతగా, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, నియామకాలలో తెలంగాణ రాష్ట్రం నష్ట పొయింది అంటూ పలు సమావేశాలలో తన గొంతుకని వినిపించిన తెలంగాణ ఉద్యమ మాష్టారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌. వీరు 1934వ సంవత్సరము ఆగస్ట్‌ 6వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూర్‌ మండలం అక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి, లక్ష్మికాంతా రావు దంపతులకి జన్మించాడు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల, హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం గల జయశంకర్‌ తెలంగాన ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. వీరు విశ్వ బ్రామ్మన కులంలో జన్మించారు. బెనారస్‌ యూని వర్శిటీ నుండి ఆర్ధిక శాస్త్రంలో పట్ట పుచ్చుకున్న వీరు ఉస్మానియా విశ్వవిద్యా లయంలో పి.హెచ్‌.డి పూర్తి చేసారు.1975 నుండి 1979 వరకు సి.కే.ఎం కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 1979 నుండి 91 వరకు కాకతీయ విశ్వ విద్యాలయం రిజిస్టార్‌గా,1991 నుండి 1994 వరకు కాకతీయ విశ్వ విద్యాలయం ఉప కులపతిగా సేవలు అందించారు. 1969 లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినారు.తరవాత 1995 మలి దశ ఉద్యమంలో మార్గ నిర్దేశకుడిగా, వెన్నెముకగా నిలిచారు. తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినది. ప్రతి పల్లె, పట్టణం తిరిగారు. ఊరూరా తెలంగాణ నినాదాన్ని విశ్వవ్యాప్తం చేశా రు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు.
2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్ర ఏర్పాటుకు సరి అయిన నాయకుడిగా కేసిఆర్‌ను గుర్తించి పార్టీలకి అతీ తంగా ముందుకు వెళ్ళాలని కోరిన వ్యక్తి జయశంకర్‌ మాత్రమే. 2009 నవంబరు 29 న కేసిఆర్‌ ఆమరణ దీక్ష, 2009 డిసెంబర్‌ 4న శ్రీకాంత చారి ఆత్మాహుతి, ఈ ప్రాంత ప్రజలను కలచి వేసింది. ఉద్యమం వైపు పరుగులు పెట్టించింది.2009 డిసెంబరు 9న అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేయడం తర్వాత ఆంధ్రా వారి ఒత్తిడులకు తలొ గ్గి 2009 డిసెంబరు 23 న శాసన సభ తీర్మాణం ద్వార రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణలో ఆందోళ నలు ప్రారంభం అయినాయి. ఈ విషయంలో జయశంకర్‌ సర్‌ తీవ్ర స్థాయి లో మనస్తాపం చెందినారు. పల్లె, పట్టణంను ఉద్యమం వైపు మళ్లించి సామా జిక రాజీనామాలు, ఛలో అసెంబ్లీ ఉద్యమ కార్యక్రమాలకు కేంద్ర బిందువు గా నిలిచారు. తెలంగాణ మేధావులతో చర్చించి, కవులు, కళాకారులు, రచ యితలు, ఉపాధ్యాయ ఉద్యోగులు, జర్నలిస్టులు, వివిధ పార్టీల ప్రతినిధులు, అన్ని కుల సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకి తీసుకు పోయారు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకు అంతా దేశానిధి అని చెప్పిన కాళోజీ మాటను నిజం చేసి బతుకు అంతా తెలంగాణాధి అని చెప్పినారు. మా తెలంగాణ మాకు కావాలే,50 యెల్లుగా ఇదె మా ఆకాంక్ష.ఇదే శ్వాస,స్వప్నం,ఇదే జీవితం అని చెప్పిన మడమ తిప్పని యోధులు వీరు. తెలంగాన రాష్ట్రం రావాలి అప్పుడే నేను మరణిస్తా అని చెప్పిన త్యాగశీలి వీరు. అమరుల త్యాగాలు, బలిధానాలు, ఉద్యమ భావాలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2014 మార్చి 4న ఒక విడుదల చేసింది. జూన్‌ 2 ,2014 నుండి రాష్ట్ర ఆవతరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలం గాణ రాష్ట్రానికి చూడకుండానే జయశంకర్‌ సార్‌ గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతూ 2011 జూన్‌ 21వ తేదీన కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం జయశంకర్‌ గారి సేవలను గుర్తించి ఆయన పేరు మీద జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసింది. విద్యారంగంలో ప్రతి ఏటా జూన్‌ నెలలో జరిగే బడి పండుగకు జయశంకర్‌ బడిబాట నామకరణం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు జయశంకర్‌ గారి పేరు పెట్టడం అభినందనీయం, ప్రశంసనీయం. వారి జన్మదినం ఆగస్టు ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వారి జయంతి కార్యక్రమాలను నిర్వహించుకో వడం మన బాధ్యత వారి సేవలను స్మరించుకుందాం. వారి కాంస్య విగ్రహా లని జయశంకర్‌ జిల్లాల్లోని అన్ని మండలాల లో ఏర్పాటు చేయాలి. జోహార్లు జయశంకర్‌ సర్‌, జోహార్లు. ప్రతీ ఒక్కరు వారి జీవిత చరిత్ర చదివి స్ఫూర్తిని పొందుదాం. వారి ఉద్యమం అందరికి స్ఫూర్తి.

  • కామిడి సతీష్‌ రెడ్డి
    9848445134.
    (నేడు జయశంకర్‌ సర్‌ జయంతి)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News